Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

తెలంగాణ కోటి ఎకరాల మాగాణం

కాళేశ్వరం ఎత్తిపోతల ఇరిగేషన్ ప్రాజెక్టులో అత్యంత కీలక ఘట్టం శుక్రవారం ఆవిష్కృతమైంది. చందలాపూర్ శివారులో నిర్మించిన రంగనాయకసాగర్ ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసే కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు ప్రారంభించారు. ఈ నీటి రిజర్వాయర్ ద్వారా దాదాపు 70 వేల ఎకరాల భూమికి సాగునీరు అందివ్వడమే కాకుండా తాగునీటిని కూడా సరఫరా చేయనున్నారు. అలాగే చెరువుల్లో నీటిని నింపేందుకు కూడా అధికార యంత్రాంగం తగు ఏర్పాట్లు చేసింది.

సిద్దిపేటకే కాదు రాజన్న సిరిసిల్ల జిల్లాను కూడా రంగనాయక సాగర్‌ ప్రాజెక్టు సస్యశ్యామలం చేస్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌కు సిద్ధిపేట అంటే అమితమైన ప్రేమ. సిద్దిపేట ప్రజలు ధన్య జీవులు. చిరస్మరణీయ ఘట్టం మా చేతుల మీదుగా ప్రారంభం కావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ ప్రాజెక్టుతో ఆరు నియోజకవర్గాలకు శాశ్వతంగా సాగునీరు అందనుంది. కాళేశ్వరం నిర్మాణంలో సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా హరీశ్‌రావు శ్రమించారు. కాళేశ్వరం నిర్మాణంలో శ్రమించిన హరీశ్‌రావుకు అభినందనలు. మెతుకు సీమ తెలంగాణకు బువ్వ పెట్టే జిల్లా కావాలని కోరుకుంటున్నా. కాళేశ్వరం నిర్మాణంలో సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగూణంగా హరీశ్‌రావు శ్రమించారు.

హరీశ్‌రావు నాయకత్వంలో కార్మికులు కాలంతో పోటీపడి శ్రమించారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో, మంత్రి హరీశ్‌రావు శ్రమతో తెలంగాణ రాష్ట్రం కోటి ఎకరాల మాగాణం కల త్వరలో సాకారమవుతుంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో నాలుగు విప్లవాలు చూడబోతున్నాం. హరితవిప్లవం, మత్స్యసంపద పెరిగి నీలి విప్లవం, పాడి రైతులు క్షీర విప్లవం తీసుకువస్తారు, గొర్రెల పెంపకం ద్వారా గులాబి విప్లవం వస్తుంది. దేశానికే ఆదర్శంగా నిలిచే అగ్రశ్రేణి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో శ్రమించిన కార్మికులకు, ఇంజినీర్లకు కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో నీటి సమస్యను ఈ రిజర్వాయర్ ఇకనుంచి శాశ్వతంగా పరిష్కరించనుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రిజర్వాయర్ కింద తమ భూములను పోగొట్టుకున్న వారికి తమ ప్రభుత్వం ఇప్పటికే సహాయ, పునరావాస ప్యాకేజీని పూర్తిగా అందించిందని తెలిపారు. కాగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రంగనాయక సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు నీటిని ఎత్తిపోసేందుకు విద్యుత్ శాఖ చేసిన ఏర్పాట్ల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. కొండపోచమ్మ సాగర్‌కు నీటిని ఎత్తిపోయడానికి లిఫ్టులను నాలుగైదురోజుల్లో పూర్తి చేయాలని తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభారకరావుకు నిర్దేశించారు. విద్యుత్ శాఖ తనకు అప్పగించిన పనులన్నింటినీ నిర్ణీత గడువుకు ముందే పూర్తి చేస్తూ ఇతర శాఖలకు ఆదర్శంగా నిలిచిందని కేసీఆర్ ఈ సందర్భంగా కొనియాడారు.

ప్రాజెక్టులో భాగంగా రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లో 134.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు మోటార్లను ఏర్పాటు చేశారు. ఒక్కో మోటార్ 24 గంటల్లో 0.25 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యంతో పనిచేస్తాయి. మూడు టీఎంసీల కెపాసిటి కలిగిన రిజర్వాయర్‌లో నాలుగు మోటార్లు మూడు రోజులు నడిపితే రిజర్వాయర్ నిండుతుంది. ఇక్కడి నుంచి మల్లన్నసాగర్, మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులోకి నీటిని తరలిస్తారు.

మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో బైపాస్ కాలువ ద్వారా నేరుగా గజ్వేల్ నియోజకవర్గం, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌లోకి నీటిని పంపింగ్ చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే శ్రీరంగనాయక సాగర్‌లో దశలవారీగా మొదట ఒక టీఎంసీ నీటిని నింపి ప్రాజెక్టు కట్ట సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. అన్ని సవ్యంగా ఉంటే మరో టీఎంసీ, ఆ తర్వాత ఏ సమస్య రాకపోతే పూర్తి రిజర్వాయర్ నింపుతారు. ఈ రిజర్వాయర్ ద్వారా నియోజకవర్గంలో దాదాపు 70కిపైగా చెరువుల్లోకి నీటిని నింపేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాజెక్టుల్లో నీరు నింపడం ద్వారా సిద్దిపేట జిల్లాలో 70వేలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 30వేల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు.

సాగునీరు, తాగనీటి కోసం ఆరుదశాబ్దాల దాహంతో ఉన్న తెలంగాణ ఒక్కటొక్కటిగా ప్రాజెక్టులు పరిపూర్తి అవుతూ బీడు భూములను పచ్చని పంటపొలాలుగా మారుస్తున్న వేళ.. తెలంగాణ మాగాణి ఇక నాదే ఆలస్యం అన్నట్లుగా పంట సిరులను కురిపిస్తోంది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.