గత పదేళ్లలో ఎన్నో చట్టాలు చేశామని కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంటోంది. అవేవీ.. తనంతతానుగా చేసినవి కావు. ప్రజల పోరాటాలు, కోర్టుల ఒత్తిడి వల్ల చేసినవే. తెలంగాణ విషయమూ అంతే. తనంతతానుగా కాంగ్రెస్ ఇవ్వలేదు. తెలంగాణ ఉద్యమం, కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీ ఇవ్వకతప్పని పరిస్థితిని కల్పించాయి అని టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.

-ఆ పరిస్థితి కల్పించింది టీఆర్‌ఎస్, తెలంగాణ ఉద్యమం
-ఓటమి భయంతో కాంగ్రెస్ నేతల పిచ్చికూతలు: హరీశ్‌రావుశుక్రవారం సిద్దిపేటలోని తన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో హరీశ్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో టీఆర్‌ఎస్ పాత్ర లేదని సోనియాతో చెప్పించినంత మాత్రన ఇక్కడి ప్రజలు నమ్మబోరని అన్నారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారని, వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని హరీశ్ మండిపడ్డారు. పార్లమెంటు భవనం ముందు యాదిరెడ్డి ఆత్మబలిదానం చేసుకుంటే చూడటానికి రాని జైరాం, ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని తెలంగాణలో ఓట్లడుగుతున్నాడని నిలదీశారు. తెలంగాణలో వందల మంది బలిదానాలకు కాంగ్రెస్ పార్టీ, సోనియానే కారణమని, ఇందుకు అమరుల సూసైడ్‌నోట్లే ప్రత్యక్షసాక్ష్యాలన్నారు. టీఆర్‌ఎస్‌కు 2004లో వచ్చినన్ని సీట్లయినా రావని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య చేసిన వ్యాఖ్యలను హరీశ్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణలో 52 సార్లు ఉపఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కనీసం రెండు సీట్లయినా గెలుచుకోలేకపోయిన సంగతి మరిచిపోవద్దన్నారు. కేసీఆర్‌పై కేసులుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని, గత పదేళ్లుగా మీ ప్రభుత్వమే ఉన్న విషయం మరిచారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో రాబోయేది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు వెంకట్‌గౌడ్, మోహన్‌లాల్ పాల్గొన్నారు.