Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

తెలంగాణ పంచాయతీరాజ్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

తెలంగాణ పంచాయతీరాజ్, పురపాలక బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. పంచాయతీ రాజ్, పురపాలక బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగిన అనంతరం స్పీకర్ బిల్లుకు ఆమోదం తెలిపారు. అయితే.. చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన సందేహాలకు సీఎం శ్రీ కేసీఆర్ సమాధానాలు ఇచ్చారు.

గడువులోపు తెలంగాణ పంచాయతీ ఎన్నికలు నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రాష్ట్రంలో 12,751 గ్రామపంచాయతీలు ఉంటాయన్న సీఎం… ఇకపై రాష్ట్రంలో నగర పంచాయతీలు అనేవి ఉండవన్నారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే ఉంటాయన్నారు. కొత్త చట్టం ప్రకారం మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు కలిపి 147 ఉంటాయన్నారు. గడువులోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయన్నారు.

గ్రామ పంచాయతీలన్నీ మురికి కూపాలుగా ఎందుకున్నాయి? రాజకీయ నాయకులంతా ఆత్మపరిశీలన చేసుకోవాలన్న సీఎం… స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా మున్సిపాలిటీ ఏమైనా మారిందా? అని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీలన్నీ మురికి కూపాలుగా ఎందుకున్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా గ్రామీణ వ్యవస్థ ఎందుకు మార్పు రాలేదు? లక్షా 36 వేల మంది ప్రజాప్రతినిధులు పని చేస్తున్నా మార్పు రాలేదు. చాలా చట్టాలకు మార్పులు జరిగాయి. కొత్త గ్రామపంచాయతీ ఏర్పడాలన్నా మున్సిపాలిటీ ఏర్పడాలన్నా అసెంబ్లీ ద్వారానే జరగాలి. అమెరికా గ్రామీణాభివృద్ధి ఛైర్మన్‌గా భారత్‌కు చెందిన ఎస్‌కే డే ఉండేవారు. ఎన్‌ఐఆర్‌డీ స్థాపించిన మహనీయుడు ఎస్‌కే డే. ఎస్‌కే డే పుణ్యమాని పంచాయతీరాజ్ ఉద్యమం మొదలైంది. దేశంలోనే మొట్టమొదటి పంచాయతీ పటాన్‌చెరు. తొలి సమితి ప్రెసిడెంట్ జి. రామచంద్రారెడ్డి. ఆ రోజుల్లో సమితి ప్రెసిడెంట్‌ని చూసి ఎమ్మెల్యేలు భయపడేవారు. టీచర్ల నియామకం కూడా సమితి ప్రెసిడెంట్ చేతుల్లోనే ఉండేది.. అని సీఎం చెప్పారు.

రాజకీయ నాయకులంతా ఆత్మ పరిశీలన చేసుకోవాలి గొప్పగా ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థను రాజకీయపరం చేశారు. గ్రామాన్ని ఏకీకృతం చేయాల్సిన పంచాయతీరాజ్ వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. ఈ విష సంస్కృతికి ఎవరు బాధ్యులు. రెండేళ్ల నుంచి కొన్ని వేలమందితో చర్చించాను. కో ఆపరేటివ్, నీటి తీరువాలోనూ అదే పరిస్థితి. రాజకీయ నాయకులంతా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తాగునీటి, కరెంట్ సమస్య తీరింది. త్వరలో సాగునీటి సమస్య కూడా తీరబోతుంది. రైతు సమన్వయ సమితులకు పంచాయతీరాజ్‌కి సంబంధం లేదు. కిషన్‌రెడ్డి చెప్పేది శంకరాచార్యులకు పీరీల పండక్కి ముడిపెట్టినట్లుగా ఉంది.. అని కేసీఆర్ సమాధానమిచ్చారు.

ఇనుప ముక్కలు ఏరుకునే వారికి కూడా సంఘం ఉంది ఫర్టిలైజర్ కంపెనీలు తప్పుదారి పట్టిస్తున్నాయే కారణంతో కోట్లాది మంది రైతులను ఇబ్బంది పెడుతున్నది. ఎరువుల దగ్గర్నుంచి మార్కెట్ దాకా రైతులకు ఎన్నో చిక్కులు. ఇనుప ముక్కలు ఏరుకునే వారికి కూడా సంఘం ఉంది. రైతులను సంఘటితం చేసేందుకే రైతు సమన్వయ ఏర్పాటు చేసినం. ప్రతీ ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని నియమించినం. రాష్ట్రవ్యాప్తంగా 250 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం సంకల్పించింది. హరితహారం కార్యక్రమాన్ని చూసి ప్రధాని మోదీ అభినందించారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఏ ఒక్క సంవత్సరం కూడా 50 లక్షల మొక్కలు నాటలేదు. రాష్ట్రవ్యాప్తంగా 4 వేల నర్సరీలు ఏర్పాటు చేసిన ఘనత మాది. ప్రతీ గ్రామానికి ఒక నర్సరీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నం. నాటిన మొక్కల్లో 85 శాతం బతికుండకపోతే పంచాయతీ సెక్రటరీని తొలగిస్తున్నం. ఏ స్థాయికి తగ్గట్లుగా ఆ స్థాయి పనులు జరగకపోతే ప్రభుత్వ ఉద్దేశం నెరవేరదు.. అని సీఎం వివరించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.