హైదరాబాద్: టీఆర్ఎస్ను కాంగ్రెస్లో కలుపుమనడానికి కాంగ్రెస్ నేతలెవరని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్కు ఒక అస్థిత్వముందని, అది ఎవరో పెడితే పుట్టిందికాదని తెలంగాణ ప్రజల హదయాల్లో నుంచి వచ్చిందని తెలిపారు.అందుకే టీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలే హైకమాండ్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్కు ఢిల్లీ హైకమాండ్ అయితే, టీడీపీకి సీమాంధ్ర హైకమాండ్ అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ను విలీనం చేయాలన్నా, కొనసాగించాలన్న హైకమాండ్ తెలంగాణ ప్రజల అభిప్రాయం ముఖ్యమని తెలిపారు. ప్రజలు తమకు ఏ అభిప్రాయం చెబితే అది చేస్తామని వెల్లడించారు. నాలుగున్నర కోట్ల ప్రజల నవ నిర్మాణానికి టీఆర్ఎస్ పుట్టిందని వెల్లడించారు. కాంగ్రెస్, టీడీపీలు కలిసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చే పార్టీ టీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. సీమాంధ్ర పార్టీలు ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితి పూర్తిగా విచిత్రంగా ఉందని, ఆయన దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నాడని హరీష్రావు విమర్శించారు.