Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

తెలంగాణ వాణి వినిపించాం..

పార్లమెంటు శీతాకాల సమావేశాలలో రాజకీయాలకు అతీతంగా, రాష్ట్ర డిమాండ్లే ప్రధాన ఎజెండాగా అనేక అంశాలను లోక్‌సభలో ప్రస్తావించామని టీఆర్‌ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. గతనెల 26వ తేదీన ప్రారంభమైన ఈ సమావేశాలు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ఎంపీలు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. -రాష్ట్ర సమస్యలను పార్లమెంటు దృష్టికి తెచ్చాం -హైకోర్టు విభజనపై ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టాం -శీతాకాల సమావేశాలపై టీఆర్‌ఎస్ ఎంపీలు

TRS-MP's

లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్ష ఉపనాయకుడు బీ వినోద్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఈ శీతాకాల సమావేశాలలో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అనేక అంశాలను ప్రస్తావించామని సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 18 నెలలు దాటినా హైకోర్టు విభజన జరగలేదని, ఇప్పటికీ ఉమ్మడిగానే కొనసాగుతున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని గరిష్ట కాలపరిమితిని రెండేండ్లకంటే మించి ఉండకుండా చట్టానికి సవరణలను ప్రతిపాదిస్తూ ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టామని తెలిపారు.

పునర్వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టంగా చెప్పినప్పటికీ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకోని కారణంగా విభజన జరగలేదని చెప్పారు. టీఆర్‌ఎస్ తరఫున తెలంగాణ రాష్ర్టానికి సంబంధించి మొత్తం ఆరు ప్రైవేటు బిల్లుల్ని ప్రవేశపెట్టామని తెలిపారు. రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలను ప్రస్తుతమున్న 119 నుంచి 153కు పెంచడానికి సంబంధించి కూడా ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది వెనకబడిన జిల్లాలే ఉన్నందున ప్రత్యేకహోదాను ఇవ్వాలని, ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వాలని, ఇందుకోసం చట్టాన్ని సవరించాలని ప్రతిపాదిస్తూ మరో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టామని తెలిపారు. ఇక రాజ్యాంగ సవరణ కోరుతూ రెండు ప్రైవేటు బిల్లులు కూడా ప్రవేశపెట్టామని తెలిపారు. సుప్రీంకోర్టు బెంచ్‌ల ఏర్పాటును కోరుతూ ప్రస్తుతం ఈ అధికారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే ఉన్నందువల్ల రాష్ట్రపతికి అధికారాన్ని బదిలీ చేయాలని రాజ్యాంగంలోని 130వ ఆర్టికల్‌ను సవరించాలని కోరుతూ సవరణ బిల్లును ప్రవేశపెట్టినట్టు తెలిపారు.

ప్రస్తుతం చట్టసభల పదవీకాలం ఐదేండ్లు ఉన్నందున పూర్తిస్థాయిలో ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోడానికి ఉద్దేశిస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం సభలను మధ్యలోనే రద్దు చేసి మధ్యంతర ఎన్నికలను కోరడానికి వీలులేకుండా మరో రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టామని తెలిపారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టానికి సవరణలను ప్రతిపాదిస్తూ ఇంకొక ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టామని తెలిపారు. లోక్‌సభలో టీఆర్‌ఎస్ పోషించిన పాత్ర గురించి ఎంపీ వినోద్‌కుమార్ వివరిస్తూ, కేంద్ర ప్రభుత్వం ఈ శీతాకాల సమావేశాల్లో మొత్తం 12 కొత్త బిల్లుల్ని ప్రవేశపెట్టిందని, ఇంధులో పది బిల్లులపై తమ పార్టీ స్పందించిందని తెలిపారు. ఒక బిల్లు మినహా మిగిలినవాటిపై సానుకూలంగానే స్పందించామని తెలిపారు. టీఆర్‌ఎస్ సభ్యులు వివిధ అంశాలపై మొత్తం 180 ప్రశ్నలను పార్లమెంటు ముందుంచారని, కొన్నింటికి స్వయంగా ఆయాశాఖల మంత్రులే సమాధానం చెప్పారని తెలిపారు.

బిల్లులతోపాటుగా 25 ముఖ్య అంశాలపై చర్చల్లో టీఆర్‌ఎస్ సభ్యులు క్రియాశీలకంగా పాల్గొన్నారని తెలిపారు. లోక్‌సభలో టీఆర్‌ఎస్ వ్యవహరించిన పాత్ర గురించి ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, పార్టీపరంగా కాకుండా, రాజకీయ విభేదాలతో సంబం ధం లేకుండా రాష్ట్ర అవసరాలే ఎజెండాగా తమపార్టీ సభ్యులంతా వివిధ అంశాలపై స్పందించారని, రాష్ర్టానికి సంబంధించిన అంశాలను పార్లమెంటు దృష్టికి తీసుకెళ్ళారని తెలిపారు. ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఆయా బిల్లులపైనా, అంశాలపైనా వ్యవహరించాల్సిందిగా సీఎం కేసీఆర్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే స్పష్టత ఇచ్చారని, ఆ విధంగానే నడుచుకున్నామని తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకూ మద్దతు తెలిపామని, అయితే షుగర్‌సెస్ బిల్లును మాత్రం వ్యతిరేకించామని, చక్కెరపై సెస్ వేయడం వల్ల ప్రజల మీద ఆర్థిక భారం పడుతుందన్నదే దీనివెనుకనున్న ఉద్దేశమేనని వివరించారు.

ఎంపీ నగేష్ మాట్లాడుతూ, పార్లమెంటులో జరిగిన ప్రతి చర్చలోనూ తెలంగాణకు అన్వయించే విధంగా చొరవ తీసుకున్నామని తెలిపారు. హైకోర్టు విభజనపై గత సమావేశంలో నిరసన వ్యక్తం చేసినప్పటికీ తాజా సమావేశాల్లో మాత్రం వ్యూహాత్మకంగానే వ్యవహరించామని, అందులో భాగంగానే వినోద్‌కుమార్ ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారని అన్నారు. సుప్రీంకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తి వచ్చినందున ఈ అంశంపై ఇప్పటికే చర్చించామని, న్యాయశాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళామని తెలిపారు.

 

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.