Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

తెలంగాణకు వరం హరితహారం

పది జిల్లాలు పచ్చబడాలంటే కోట్లాది మొక్కలు కావాలి. ఊరూరా ఉద్యమంలా చెట్లను నాటాలి. ఇందుకోసం ప్రతీ జిల్లాలో వందల సంఖ్యలో నర్సరీలు ఎండాకాలానికి ముందే ఏర్పాటు చేశారు. ప్రతీ నియోజకవర్గంలో లక్షలాది మొక్కలు నాటేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మండు ఎండాకాలంలో కూడా సిబ్బందిని పెట్టి మొక్కలను సిద్ధం చేసింది. ఇక ప్రజలను ఇందులో భాగస్వాములు కావాల్సిందిగా సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. పర్యావరణ సమతుల్యతను సాధించి, తెలంగాణను పచ్చగా మార్చేందుకు ప్రతీ ఒక్కరు ముందుకు రావాలన్నారు ఆయన.

తెలంగాణ పునర్నిర్మాణం పునాదుల నుంచి మొదలు కావాలి. అప్పుడు మాత్రమే దీర్ఘకాలికంగా తిష్టవేసిన సమస్యలు పరిష్కారమవుతాయి. తెలంగా ణ జనజీవితాన్నే కాదు, ప్రకృతిని కూడా సమైక్య పాలన నిర్లక్ష్యమే చేసింది. ఫలితంగా తెలంగాణ అభివృద్ధి క్రమంగా కుంటుపడ్డది. ముఖ్యంగా వ్యవసాయ రంగం కోలుకోలేని స్థితికి చేరుకున్నది. పాలకుల నిర్లక్ష్యానికి తోడు, ప్రకృతి మార్పులు కూడా తెలంగాణ రైతాంగాన్ని అతలాకుతలం చేశాయి. పర్యావరణ విధ్వంసంలో భాగంగా అడవుల నరికివేత భారీ ఎత్తున జరిగింది. దీంతో పచ్చదనం కనుచూపు మేరలో కనబడకుండా పోయింది. ఈ ప్రభావం పర్యావరణ అసమతుల్యతకు దారితీసింది. రుతువులు క్రమం తప్పిపోయాయి. వానలు సకాలంలో కురవలేదు.

ఇలా కరువులకు తెరలేసింది. తెలంగాణ రైతుల పరిస్థితే కాదు, వ్యవసాయం మీద ఆధారపడ్డ కులాలకు తిండికి తిప్పలొచ్చాయి. కరువు జిల్లాలుగా కేంద్రం గుర్తించినా సరే, గత రాష్ర్ట పాలకులు మాత్రం ఆదుకునేందుకు ముందుకురాలేదు. ఇట్లా తెలంగాణలో ఒక్క పంట పండించడం కూడా కష్టంగా మారింది. ఇది ఏ ఒక్క ఏడాది చరిత్రో కాదు. దశాబ్దాలుగా తెలంగాణ నేలది ఇదే పరిస్థితి. అందుకే ప్రజా వాగ్గేయకారుడు జయరాజన్న వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ అంటూ పాట రాశాడు. కరువు అలుముకున్న ప్రతీసారి కళాకారులంతా ఇదే పాట పాడారు. ఇప్పుడు స్వయంపాలన తరుణం. ఈ సమయంలో ఇంకా వానల గురించి ఇదే పాట పాడుకుంటే అర్థం లేదు. ఈ పరిస్థితులు మారాలి. పోయిన వానలు తిరిగిరావాలి.

పల్లెలు పచ్చబడాలి. అన్నదాత తలెత్తుకుని బతకా లి. ఇదంతా జరగాలంటే పచ్చదనాన్ని పెంచడమొక్కటే మార్గం. ఇది ప్రభుత్వమో అధికారులో చేస్తే పూర్తయ్యే పని కాదు. తెలంగాణను బాగుచేసుకోవాలనుకునే ప్రతీ మట్టిబిడ్డ ఇందు లో భాగస్వాములు కావాలి. అలా తెలంగాణను మొత్తం సస్యశ్యామలం చేసే పథకమే హరితహారం. తెలంగాణ సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రారంభించిన ప్రతిష్టాత్మాక కార్యక్రమం మిషన్ కాకతీయ ద్వారా పూడుకపోయిన చెరువులను బాగుచేసింది తెలంగాణ సర్కార్. ఇక వర్షాభావ పరిస్థితులను మార్చి, తెలంగాణను పచ్చని వనంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం తెలంగాణ సర్కార్ ప్రణాళికలు రూపొందించింది. అటవీ, రెవెన్యూ, వ్యవసాయ శాఖలను అనుసంధానం చేస్తూ హరితహారం లక్ష్యంపై అవగాహన కల్పించింది.

పది జిల్లాలు పచ్చబడాలంటే కోట్లాది మొక్కలు కావాలి. ఊరూరా ఉద్యమంలా చెట్లను నాటాలి. ఇందుకోసం ప్రతీ జిల్లాలో వందల సంఖ్యలో నర్సరీలు ఎండాకాలానికి ముందే ఏర్పాటు చేశారు. ప్రతీ నియోజకవర్గంలో లక్షలాది మొక్కలు నాటేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మండు ఎండాకాలంలో కూడా సిబ్బందిని పెట్టి మొక్కలను సిద్ధం చేసింది. ఇక ప్రజలను ఇందులో భాగస్వాములు కావాల్సిందిగా సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. పర్యావరణ సమతుల్యతను సాధించి, తెలంగాణను పచ్చగా మార్చేందుకు ప్రతీ ఒక్కరు ముందుకు రావాలన్నారు ఆయన. ఇందుకు కావాల్సిన అవగాహనను ప్రజల్లో కలుగ జేసేందుకు ప్రింట్, టీవీ మీడియా ద్వారా కూడా ప్రచారం కల్పించారు.

అంతేకాకుండా సారథి కళాకారుల చేత పెద్ద ఎత్తున పాటలు రాయించారు. ఆడియో, వీడియో ఆల్బవ్‌ులు, పాటల పుస్తకాలు తయారు చేయించారు. సారథిలో ఉద్యోగాలు పొందిన రచయితలు, కళాకారులు అద్భుతమైన పాటలు రాశారు. ఈ పాటలను జనంలోకి తీసుకుపోయిందుకు సాంస్కృతిక సారథి కళాకారుల బృందాలను ఏర్పాటు చేసింది. ఆయా జిల్లాల కళాకారులను, వారి వారి పరిసర గ్రామాల ప్రజలను మొక్కల పెంపకంలో చైతన్యపర్చేందుకు జిల్లాలకు పంపింది. అట్లా గత పదిరోజులుగా కళాకారులు ఊరూరు చెట్లను పెంచేందుకు కావాల్సిన అవగాహను ప్రజలకు అందిస్తున్నారు. స్వచ్ఛందంగా ప్రతీ పౌరుడు ముందుకొచ్చేలా శ్రమిస్తున్నారు. గుండెను సూటిగా తాకే శక్తి పాటకే ఉంటుంది. ఈ విషయాన్ని గమనించిన సీఎం కేసీఆర్ హరితహారం విజయవంతానికి కళాకారులను సైనికులుగా మలిచారు.

తెలంగాణలో 33 శాతం ఉండాల్సిన అటవీ ప్రాంతం 24 శాతం మాత్రమే ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో అడవి దట్టంగా ఉంటే, మరికొన్ని చోట్ల అడవే లేకుండా పోయింది. నగరీకరణ, పట్టణీకరణ పెరిగి అటవీ సమతౌల్యం దెబ్బతిన్నది. దట్టమైన అటవీ ప్రాంతంలో కూడా చెట్లు లేవు. అందుకే కొన్ని సంవత్సరాలుగా వర్భాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దుక్కిదున్నిన అన్నదాత ఆకాశం వైపు చూసే పరిస్థితి ఎదరవుతోంది. వానలు సరిగాలేక, పంటలు కూడా సరిగా పండడం లేదు. దీంతో ఆహార ఉత్పత్తి పెరిగిన జనాభా సరిపోయేటంతగా ఉండడం లేదు. ఆహార కొరత అంతకంతకు ఏర్పడుతూనే ఉన్నది. ఈ పరిస్థితి మారాలంటే పెద్దమొత్తంలో కృత్రిమ అడవులను సృష్టించాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పం. అందుకే తెలంగాణ వ్యాప్తంగా 210 కోట్ల మొక్కలు నాటే బృహత్తర కార్యమ్రానికి శ్రీకారం చుట్టారు.

గతంలో రూపాయికి ఒక మొక్క చొప్పున పంపిణీ చేస్తే, ప్రజాదరణ కరువైంది. కానీ తెలంగాణ సర్కార్ సరికొత్తగా ఉచితంగా ఇంటింటికి మొక్కలను పంపిణీ చేస్తోంది. ఈ మొక్కల్లో పండ్లమొక్కలు, పూలమొక్కలే కాకుండా వాణిజ్యపరమైన మొక్కలు కూడా ఉన్నాయి. వీటన్నింటిని నాటాల్సిన ప్రదేశాలను ఇప్పటికే అధికారులు గుర్తించారు. హరితహారం విజయవంతమైతే ప్రజల బతుకు పచ్చబడుతాయి. ఇందుకోసం సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో వందలాది బృందాలు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి. ఊరూరా ఉద్యమంలా మొక్కలు నాటే కార్యక్రమం పురుడు పోసుకుంటున్నది.

ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే వన్యప్రాణి ప్రేమికులు ప్రశంసిస్తున్నారు. తెలంగాణ ప్రజల బతుకులు బాగు చేసేందుకు హరితహారమే నూటికి నూరుపాళ్లు ఉపయోగపడుతుందంటున్నారు. పదిజిల్లాల నిండా పాటల మొక్కలు మొలుస్తున్నాయి. ఈ పాటల విత్తనాలను మోసుక తిరుగుతున్న సేద్యకారులు మన కళాకారులే. సమాజ మార్పుకోసం సాగిపోయే కళాకారులు ఇలా కార్యక్షేత్రంలో దిగి పనిచేస్తున్నారు. ఇప్పుడు కళాకారులు ఏ జిల్లాకు పోయిన హరితహారం పాటలే పాడుతున్నారు. ఈ కళాకారులను జనం అక్కున చేర్చుకుంటున్నారు. జనం ఊరూరా నాటబోయే లక్షలాది మొక్కలకు సారథి కళాకారులే ప్రత్యక్ష సాక్షులు.

రేపటి తరాలు గర్వపడేలా జనానికి హరితహారంపై అవగాహన కల్పిస్తున్నారు. కళాకారులకు జనం హారతి పడుతున్నారు. తమ బతుకులు మారేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న హరితహారం పథకాన్ని చూసి గర్వపడుతున్నారు. చేయి చేయి కలిపి చెట్లు నాటడానికి సిద్ధమవుతున్నారు. బంగారు తెలంగాణ ఎంతో దూరం లేదనే విషయం హరితహారం ద్వారా స్పష్టమవుతున్నది. -(వ్యాసకర్త: రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే, సాంస్కృతిక సారథి)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.