Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

తెలంగాణలో ఆరోగ్యమస్తు!

-పేదలకు కార్పొరేట్ తరహాలో సర్కారు వైద్యం -విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ప్రభుత్వం -ప్రజారోగ్యం కోసం ఏటా బడ్జెట్ కేటాయింపుల్లో పెంపు -దేశానికే ఆదర్శంగా నిలిచిన కేసీఆర్ కిట్లు, ఈజేహెచ్‌ఎస్

నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనేది సమైక్యరాష్ట్రంలోని మాట! ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానలకు దీటుగా సర్కారు దవాఖానాల్లో సేవలు.. స్వరాష్టంలో వచ్చిన మార్పు! పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. గర్భం దాల్చిన మహిళలకు అనవసరపు కోతల నుంచి విముక్తి కల్పిస్తూ సర్కారు దవాఖానల్లో సాధారణ ప్రసవం అయ్యేలా చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రోత్సాహకంగా కేసీఆర్ కిట్ అందజేస్తూ దేశవ్యాప్తంగా మన్ననలు పొందారు. ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం రూపొందించిన ఈజేహెచ్‌ఎస్‌పైనా ప్రశంసలు వచ్చాయి. అమ్మఒడి వాహనాలు, ఆరోగ్యశ్రీ సేవలు, ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు వంటి విప్లవాత్మక సంస్కరణలతో రాష్ట్రంపై అవార్డుల వర్షం కురుస్తున్నది.

స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వైద్యరంగానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు. 2018-19 బడ్జెట్‌లో వైద్యారోగ్యశాఖకు రూ. 7,3275.20 కోట్లు కేటాయించారు. ఇందులో ఆరోగ్యశ్రీ పథకానికి రూ.699. 44కోట్లు కేటాయించారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం నుంచి జిల్లాకేంద్ర దవాఖానల వరకు అన్నిచోట్లా వ్యాధి నిర్ధారణ పరీక్షా పరికరాలు, ఆపరేషన్ థియేటర్లను ఆధునీకరించారు. లేబర్ రూమ్‌లను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. బెడ్స్, పరుపులు, బెడ్ షీట్లు, వైద్యపరికరాలకు ఎక్కడా కొరత లేకుండా చేశారు. కొత్త జిల్లా కేంద్రాల్లో జిల్లాస్థాయి దవాఖానలను నెలకొల్పేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా 10 వేల మందికి డయాలసిస్ చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో 40 డయాలిసిస్ కేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వ దవాఖానల్లోనే సింగిల్ యూజ్డ్ ఫిల్టర్ వినియోగించడం దేశంలోనే ఇక్కడే ప్రథమం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కోసం ఈజేహెచ్‌ఎస్ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈజేహెచ్‌ఎస్ సేవల కోసం వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటుచేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్ల సంఖ్య పెంచారు. యూజీ (ఎంబీబీఎస్) సీట్ల సంఖ్య 700 నుంచి 1000 వరకు, పీజీ సీట్లు 571 నుంచి 792 వరకు పెరిగాయి. కొత్తగా అనుమతించిన వైద్యకళాశాలల్లో మహబూబ్‌నగర్, సిద్దిపేట త్వరలోనే అందుబాటులోకి రావడంతో మరో 300 సీట్లు పెరిగాయి.

ఆరోగ్యశ్రీ.. అమ్మ ఒడి వాహనాలు ఆరోగ్యశ్రీ ద్వారా అందించే శస్త్రచికిత్సలలో కొన్ని వ్యాధులను అదనంగా చేర్చారు. ట్రాన్స్‌ప్లాంటేషన్, సర్జరీలకు సంబంధించి కొత్త విధానాలను అమలుచేస్తున్నారు. దీంతో ప్రభుత్వదవాఖానలకు వచ్చేవారి సంఖ్య 30 నుంచి 40 శాతం పెరిగింది. 2014 జూన్ 2 నుంచి ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ ద్వారా 91,10,141 మంది రోగులు సేవలు వినియోగించుకున్నారు. వీరి కోసం ప్రభుత్వం రూ.2,320 కోట్లను ఖర్చుచేసింది. గ్రామాలు, ఏజెన్సీల నుంచి ప్రసూతి కేంద్రాలకు చేరేందుకు రవాణా సౌకర్యం కల్పించాలని భావించిన ప్రభుత్వం అమ్మ ఒడి (102 నంబర్) వాహనాలను ప్రవేశపెట్టింది.

కేసీఆర్ కిట్ల పథకం ప్రైవేట్ దవాఖానల్లో సిజేరియన్ కాన్పులను నివారించే ఉద్దేశంతో ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవం జరిగేలా ప్రభుత్వం దృష్టిపెట్టింది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవించే మహిళలకు ప్రోత్సాహకంగా కేసీఆర్ కిట్ పథకం అమలుచేస్తున్నారు. గర్భిణులు ప్రసవించిన తర్వాత రూ.12 వేలను రెండు దశల్లో అందజేస్తున్నారు. ఆడ శిశువు జన్మిస్తే మరో రూ.వెయ్యి అదనంగా ఇస్తున్నారు. శిశువు జన్మించిన తర్వాత రూ. రెండు వేల విలువైన 16 రకాల వస్తువులను కూడా కిట్ రూపంలో అందజేస్తున్నారు. మాతాశిశు మరణాలను తగ్గించేందుకు, బాలింతకు గర్భస్థ సమయంలో కోల్పోయిన జీవనభృతి, తగిన విశ్రాంతిని అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో కేసీఆర్ కిట్ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం అమలుచేశాక ప్రభుత్వ దవాఖానల్లో 1,99,600 ప్రసవాలు జరిగాయి. వీటిలో సహజ ప్రసవాలు 1,05,868 ఉండగా, సిజేరియన్ 91,001 ఉన్నాయి. పథకం ప్రారంభమైన ఏడాదిలోపే 1,83,382 కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. 6,34,789 బాలింతలకు వివిధ దశల్లో రూ.201.37కోట్లు పంపిణీచేశారు.

చేరుకున్న లక్ష్యాలు -గ్లోబల్ హెల్త్ ఇండికేట్స్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం రాష్ట్రంలో మాతాశిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. -ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు 30% నుంచి 50 శాతానికి పెరిగింది. -శిశుమరణాల నియంత్రణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన చర్యలతో మూడేండ్లలో ఐఎంఆర్ శాతం 39 నుంచి 31 శాతానికి తగ్గింది. -వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించటంతో వ్యాధి నిరోధకత 62% నుంచి 80 శాతానికి పెరిగింది. -రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాలకు వచ్చే రోగుల సంఖ్య 20 % పెరిగింది. కిడ్నీ, లివర్, గుండె మార్పిడి శస్త్రచికిత్సలు పెరిగాయి. -మలేరియా, డెంగ్యూ, స్వైన్‌ఫ్లూపై నిరంతరం చర్యలు చేపట్టడంతో మరణాల రేటు తగ్గింది. -దేశంలోనే ప్రప్రథమంగా సామాన్య ప్రజలకు పార్థీవవాహన సేవలు ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. -చిన్నారులకు ఇమ్యూనైజేషన్‌లో 62 శాతం నుంచి 90 శాతానికి పురోగతి సాధించారు. ప్రశంసలు, అవార్డులు -మిషన్ ఇంద్రధనుష్‌ను దేశంలోనే మొదటగా తెలంగాణలో విజయవంతంగా అమలుచేశారని ప్రధాని మోదీ ప్రశంసించారు. -ఓపీ సేవల్లో 23 శాతం పురోగతి సాధించడంతో కేంద్రప్రభుత్వం ఎంఓహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ అవార్డును అందజేసింది. -ఆరోగ్యశ్రీ పథకంలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్, యాప్ నిర్వహణలో జాతీయస్థాయి అవార్డు దక్కింది. -ఈ- ఔషధి, కేసీఆర్‌కిట్ పథకం, సాఫ్ట్‌వేర్ నిర్వహణలో ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డులు దక్కాయి. వైద్యరంగ ప్రగతికి చేపట్టిన చర్యలు -రాష్ట్రంలోని మొత్తం 42 ఏరియా దవాఖానాలకు కొత్తగా పరుపులు, బెడ్‌షీట్లు, స్లైన్ స్టాండ్లను అందజేశారు. -గతంలో రూ.114 కోట్లున్న ఔషధాల బడ్జెట్‌ను రూ.350 కోట్లకు పెంచారు. -22 సర్కారు దవాఖానాల్లో ఐసీయూలు ఏర్పాటుచేశారు. ఒక్కో బెడ్ నిర్వహణకు నెలకు సగటున రూ.5,016 ఖర్చుచేస్తున్నారు. -దవాఖానాల్లో బెడ్లపై రోజుకో రంగు బెడ్‌షీట్లు వేస్తున్నారు. దీనికోసం 60 వేల బెడ్‌షీట్లను రూ.2.63కోట్లతో కొనుగోలు చేశారు. -రూ.600 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానాల కోసం వైద్యసామాగ్రి (మెడికల్ ఎక్విప్‌మెంట్) కొనుగోలు చేశారు. -రాష్ట్రవ్యాప్తంగా 40 డయాలిసిస్, 40 డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేశారు. -దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ దవాఖానల్లో రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాల ఏర్పాటు, నిర్వహణకు బడ్జెట్ కేటాయించారు. -హైదరాబాద్‌లో ప్రసూతి ఐసీయూలైన నిలోఫర్, పేట్లబుర్జు, గాంధీ దవాఖానల్లో 303.26 లక్షలతో పరికరాలు అందజేశారు. -రాష్ట్రవ్యాప్తంగా 12 చోట్ల క్యాన్సర్ పరీక్షా కేంద్రాల ఏర్పాటుచేసి ప్రాథమిక దశలోనే గుర్తించి, ప్రాణాలు కాపాడేందుకు చర్యలు చేపట్టారు. -రాష్ట్రవ్యాప్తంగా వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పరిధిలో 10,718 పోస్టులను మంజూరు చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.