Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

తెలంగాణలో ఎగరాల్సింది మన జెండాయే

పొన్నాల గరీబుగాడు.. ఏమన్నంటే ఏడ్చి చస్తడు గీతారెడ్డి ఫైవ్‌స్టార్ మంత్రి నేత కార్మికుల రుణాలపై మారటోరియం టెక్స్‌టైల్ ఇండస్ట్రీకి కేరాఫ్‌గా సిరిసిల్లను చేస్తా దేవాదుల, కంతనపల్లి పూర్తి చేయిస్తా ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆంధ్రోళ్లతో పంచాయితీ ఒడవలేదు టీఆర్‌ఎస్ చేతిలోనే తెలంగాణ సేఫ్ రెండు ఓట్లు కారు గుర్తుకే వేయాలి మోసపోతే మళ్లీ గోస తప్పదు బీజేపీకి ఓటేస్తే బాబుకు ఓటేసినట్టే మోడీ పిచ్చికూతలు మానుకోవాలి: కేసీఆర్

KCR in Siricilla తెలంగాణలో మన జెండాయే ఎగరాలని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణలో మన జెండానే ఉండాలి. ఇతర పార్టీల జెండాలు ఇంకెందుకు? అని ప్రశ్నించారు. ఇక్కడి ప్రజల జీవితాలు బాగుపడాలన్నా, తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలన్నా టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందని చెప్పారు. అందుకు రెండు ఓట్లు కారు గుర్తుకే వేయాలని కోరారు. మోసపోయి సీమాంధ్ర పార్టీలకు ఓటువేస్తే మళ్లీ దశాబ్దాలపాటు గోస తప్పదని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ చేతిలో పెడితేనే తెలంగాణ సేఫ్‌గా ఉంటుందని స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ తెచ్చింది మేమే అని చెపుతోంది. కాంగ్రెస్ నేతలు ఏ ఒక్కరోజైనా జైలుకు వెళ్లారా? రాజీనామాలు చేశారా? గత్యంతరం లేక, ఉద్యమానికి తలొగ్గి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది అని చెప్పారు. పరిస్థితులు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతున్నదని అన్నారు. శనివారం వరంగల్ జిల్లా పరకాల, నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, కరీంనగర్ జిల్లా సిరిసిల్ల, మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గంలోని జోగిపేట, నల్లగొండ జిల్లా ఆలేరు, భువనగిరిల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఆయా సభలకు పోటెత్తిన జనాన్ని ఉద్దేశించిన తనదైన శైలిలో మాట్లాడారు.

ఇంటి పార్టీనే గెలిపించండి ఆంధ్రోళ్లతో పంచాయితీ ఇంకా ఒడవలేదు. ఆస్తులు, అప్పుల పంపకాలు జరుగలేదు. ఈ నేపథ్యంలో ఇంటి పార్టీ టీఆర్‌ఎస్‌ని గెలిపించాలి. ఎమ్మె ల్యే స్థానాలు ఎంత ముఖ్యమో, ఎంపీ స్థానాలూ అంతే ముఖ్యం అని చెప్పా రు. పద్నాలుగేళ్లుగా పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. ఇక్కడ ఆంధ్రా పార్టీలు అవసరమా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఆరంభం నుంచి చివరిదాకా తెలంగాణకు అడ్డుపడిందీ, అడ్డుకున్నదీ చంద్రబాబేనన్నారు. నక్కజిత్తుల చంద్రబాబులాంటి వారి నాటకాలు నడవవని తేల్చిచెప్పారు. ఇప్పుడు మోడీ రూపంలో చంద్రబాబు తెలంగాణను ముంచేందుకు బొడ్లో కత్తి పెట్టుకుని వస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బీజేపీకి ఓటేస్తే బాబుకు ఓటేసినట్టేనని పేర్కొన్నారు. 40 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందో చూశాం. టీడీపీ ఆంధ్రోళ్ల పార్టీ. బాబు చూపు అటు వైపే ఉంటది. తెలంగాణలో ఇంటి పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని కేసీఆర్ చెప్పారు.

పిచ్చికూతల మోడీ మోడీ తెలంగాణలో పిచ్చికూతలు కూస్తున్నాడని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్.. బిడ్డను బతికించేందుకు తల్లిని చంపిందంటావా? తల్లి ఎవరో బిడ్డ ఎవరో తెలిసే మాట్లాడుతున్నావా? అని నిలదీశారు. ఇద్దరు ఏడుపుగొట్టు ఆంధ్రోళ్లు పవన్‌కల్యాణ్, చంద్రబాబులను వెంబడేసుకొని తెలంగాణలో తిరుగుతూ మోడీ జీరో అయ్యాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చినంకనే భరతమాత నవ్విందని, అది మోడీకి ఏడ్చినట్టు కన్పించిందని విమర్శించారు. మోడీకి ఇక్కడి సమస్యలు ఏం తెలుసని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ బీజేపీతో కలిస్తే ప్రసక్తేలేదని పునరుద్ఘాటించారు. టీఆర్‌ఎస్ సెక్యులర్ పార్టీ. అధికారంలోకి రాగానే ముస్లింలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తాం అన్నారు.

పొన్నాల భూకబ్జాకోరు దొరతనం కులంలో ఉంటుందా? గుణంలో ఉంటుందా? నీ ఊరికి పోదాం. లేకుంటే నాఊరికి రా. నా ఇల్లు బడిగా మారితే ఖిలాషాపురంలో నీ ఇల్లు గడీగా మార్చుకున్నవ్. నీవు దళితుల భూములను ఆక్రమించిన కబ్జాకోరువు. భూదొంగవు అని పొన్నాలపై విరుచుకుపడ్డారు. నా ఆస్తులపై విచారణ జరుపుకుంటారా. నీ బొంద. నీ బొక్క. నేను దేనికైనా సిద్ధమే. పిట్ట బెదిరింపులకు భయపడేదిలేదు అని తేల్చిచెప్పారు. అంతకుముందు పొన్నాలపై మాట్లాడాల్సిందిగా టీఆర్‌ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చీటీ అందించగా.. గరీబుగాడు.. పాపం ఏమన్న అంటే ఏడ్చిచస్తడు అంటూ వ్యాఖ్యానించిన కేసీఆర్ ఆ తర్వాత ఆయనపై విమర్శలతో మండిపడ్డారు. డాలర్ లక్ష్మయ్య గంగిరెద్దుల వాడు.. సన్నాసి.. దోచుకుని దాచుకునుడు తప్ప మరోటి తెలీదు. జలయజ్ఞంలో వందల కోట్లు దోచుకున్నడు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన తెలంగాణను రక్షించుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో విలీనం చేయకుండా ఒంటరిగా బరిలో నిలిచాం అని కేసీఆర్ అన్నారు. అందుకే పొన్నాలలాంటి సొల్లు గాళ్లతోని మాటలు పడాల్సి వస్తున్నదని చెప్పారు.

గీతారెడ్డి ఫైవ్‌స్టార్ మంత్రి జహీరాబాద్ అభ్యర్థి గీతారెడ్డిపై సీబీఐ కేసులున్నాయి. అయినా పొన్నాల టిక్కెట్ ఇచ్చిండు అని విమర్శించారు. గీతారెడ్డి ఫైవ్ స్టార్ మంత్రి అని ఆరోపించారు. ప్రతి ఏడాది డిసెంబర్ 6న దేశవ్యాప్తంగా ముస్లింలు బ్లాక్‌డే నిర్వహించుకుంటారని, జహీరాబాద్‌లో మాత్రం ముస్లింలకు ఆ స్వేచ్ఛలేకుండా గీతారెడ్డి అడ్డుకుంటున్నారని విమర్శించారు. ముస్లింలకు కాంగ్రెస్ ఇస్తున్న గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. జహీరాబాద్‌కు చెందిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్‌ను ఉద్దేశించి ఫరీద్ భాయ్ ఇంకా కాంగ్రెస్‌లో ఎందుకుంటున్నవ్? బయటకు రా. టీఆర్‌ఎస్‌లో మంచి గుర్తింపు ఇస్తా అన్నారు. జహీరాబాద్‌ను సిద్దిపేటలా అభివృద్ధి చేస్తానని, లక్ష ఎకరాలకు సాగునీరిస్తామని చెప్పారు.

సిరిసిల్లపై వరాల జల్లు సిరిసిల్ల నేత కార్మికులపై కేసీఆర్ వరాల జల్లులు కురిపించారు. సిరిసిల్ల ఒకనాడు సిరులతో వర్ధిల్లేదనీ, సీమాంధ్ర సర్కారుల పాలనలో చేనేత, నేత కార్మికుల అత్మహత్యలకు కేరాఫ్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నేతన్నల్లారా మీరెవ్వరూ అత్మహత్యలు చేసుకోవద్దు. బంగారు తెలంగాణ చూసేందుకు మనమంతా బతికే ఉండాలి. మీకున్న ఇబ్బందులన్నీ నాకు తెలుసు. మీ వ్యక్తిగత రుణాలు, ప్రభుత్వ రుణాలపై టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే మారటోరియం పెడుతా. నాదీ భరోసా. మెరుగైన వైద్య సదుపాయం అందించేందుకు స్పెషల్ కార్డులు అందిస్తా. సిరిసిల్లను టెక్స్‌టైల్ ఇండస్ట్రీకి కేరాఫ్‌గా తీర్చిదిద్దుతా. భవిష్యత్తు మనదే. ఎవరూ అధైర్యపడొద్దు అని విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్ అధికారం చేపట్టగానే ఈ నియోజకవర్గంలో పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ముందుగానే ఐదువేల ఇండ్లు మంజూరు చేస్తా. వాటికి నేను స్వయంగా వచ్చి శంకుస్థాపన చేస్తా అంటూ హామీ ఇచ్చారు.

వరంగల్‌ను సస్యశ్యామలం చేస్తా  వరంగల్ జిల్లాలో ఉన్న 12 శాసనసభాస్థానాల్లో పది వ్యవసాయ ప్రాంతాలే. పక్కనే గోదావరి పారుతది. అయినా పంటలకు నీళ్లుండవు. ఆంధ్రోళ్ల పాలనలో పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు. కంతనపల్లి, దేవాదుల ప్రాజెక్టులతో నీళ్లివ్వాల్సిన చేతగాని కాంగ్రెసోళ్లు ఆ పని చేయలే. అదేం బ్రహ్మ పదార్థం కాదు. దృడ సంకల్పం ఉండాలి. యూనిట్ కరెంటు ఖర్చు లేకుండా జూరాల నుంచి పాకాల వరకు నాలుగు వందల కిలోమీటర్ల వరకు కాలువ తవ్విస్తాం. పంటలకు నీరందించి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం. అని కేసీఆర్ ప్రకటించారు. దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టులు పూర్తి చేయిస్తా. ఎవడు అడ్డం వస్తాడో నేనూ చూస్తా. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరిందించేందుకు అవసరమైతే ఇక్కడే కుర్చీ వేసుకొని పనులు పూర్తి చేయిస్తా. ఇది కేసీఆర్ పంతం అని ప్రకటించారు. వైఎస్ హయాంలో దేవాదుల ప్రాజెక్టు కోసం వేసిన పైపులైన్లు పటాకుల్లాగా పేలిపోయినయని ఎద్దేవా చేశారు. జనగామకు నీళ్లు ఏట్ల తేవాలో నాకు తెలుసు. ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లక్షా 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. జనగామలో వాటర్‌ప్లాంట్లు పెరిగేందుకు, ప్రజలు మంచి నీళ్లు కొని తాగాల్సి దుస్థితి ఏర్పడేందుకు కారణం పొన్నాలే అని చెప్పారు. రైతులు తీసుకున్న రూ.300 కోట్ల ప్రైవేటు అప్పులను మాఫీ చేస్తామని, మారటోరియం ప్రకటించి రైతులను ఆదుకుంటామని కేసీఆర్ హామీనిచ్చారు. ఇంతకుముందు సీఎంలు తెలంగాణను దగా చేశారని, ఫలితంగా రైతన్నలు అప్పులపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆ అప్పులను తీర్చాల్సిన బాధ్యత తెలంగాణ తొలి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.

టీఆర్‌ఎస్ గెలుపు డిసైడైపోయింది ఆంధ్రపార్టీల సన్నాసులకు తెలంగాణను అప్పగించలేకనే బంగారు తెలంగాణ కోసం ఒంటరిగా ఇంతగా కష్టపడుతున్నా. తప్పకుండా తెలంగాణను అన్ని రంగాల్లోఅభివృద్ధి చెందేవిధంగా చూస్తా అని కేసీఆర్ చెప్పారు. ప్రజలంతా గులాబీ జెండానే పట్టుకున్నరు. టీఆర్‌ఎస్ గెలుపు డిసైడైపోయింది. తెలంగాణ సాధించుకొచ్చిన తృప్తి వెయ్యి జన్మలకు సరిపోయేంత కలిగింది.

రాజకీయాలు వద్దనుకున్నా. కానీ తెలంగాణ అరిగోసను పోగొట్టేందుకు అందరి ఒత్తిడితో బరిలో ఉన్నా. తెలంగాణ కోసం సొళ్లుగాళ్లతోని మాటలు పడుతున్నా అన్నారు. ఈ బహిరంగసభల్లో సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థి కే తారక రామారావు, కరీంనగర్, వరంగల్, భువనగిరి, జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థులు వినోద్‌,కడియం శ్రీహరి, బూర నర్సయ్యగౌడ్, బీబీ పాటిల్, పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు ముద్దసాని సహోదర్‌రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మాజీ డీజీపీ పేర్వారం రాములు, మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, ఆందోల్ అభ్యర్థులు మాణిక్యరావు, భూపాల్‌రెడ్డి, బాబుమోహన్, టీఆర్‌ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థులు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డిలతో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.