Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా మార్చడమే ప్రభుత్వం లక్ష్యం

పథకాల పేరుతో దోచుకుని దాచుకునే సంస్కృతి కాంగ్రెస్‌కే చెల్లిందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. ఇన్నేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వాలు దానికే ప్రాధాన్యం ఇచ్చాయని, ఆదర్శ రైతుల పేరుతో దగా చేశారని పోచారం ఘాటుగా విమర్శించారు. గురువారం జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లా చిన్నంబావి, నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్రచౌరస్తా, మహబూబ్‌నగర్ జిల్లా నర్వ, వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడల్లో జరిగిన రైతు సమన్వయ సమితుల అవగాహన సదస్సులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మంత్రి పోచారంతోపాటు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. మంత్రి పోచారం మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్న పెట్టుబడుల పథకంపైనా కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్లి ఆపాలని చూసిందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఆదర్శ రైతుల పేరిట ఎలాంటి ప్రాతిపదిక లేకుండా ఎంపికలు చేసి ప్రజాధనం దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. శుక్రవారం నుంచి గ్రామాల్లో రెవెన్యూ బృందాలు సర్వే చేస్తాయన్నారు. పక్కా లెక్కతో ముందుకు వెళుతున్నామని, ఎక్కడా అవినీతి, అన్యాయం జరుగడానికి అవకాశం లేకుండా సర్వే చేస్తున్నామన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్నదాత కన్నీళ్లను తుడిచేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న భగీరథ ప్రయత్నాలకు కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అడ్డుతగులుతున్నదని భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు మండిపడ్డారు.

సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సంగారెడ్డి, కంది మండలాల రైతు సమన్వయ కమిటీ సభ్యుల అవగాహన సదస్సులో హరీశ్ రావు మాట్లాడుతూ.. మాజీ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ పేర్లపై వ్యవసాయ భూమి ఉండి సేద్యం చేస్తే ఎకరానికి రూ.8 వేల చొప్పున వారి ఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తుందని చెప్పారు. రైతులు బాగుపడితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. 2006 నుంచి 2013 వరకు రాష్ట్రంలో 1672 మంది రైతులు కరెంటు షాక్‌తో ప్రాణాలు కోల్పోయారని, ఇందుకు కాంగ్రెస్ పార్టీది బాధ్యత కాదా అని ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ, కోట్‌పల్లిలో జరిగిన సదస్సులో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులను సంఘటితం చేసేందుకే ప్రభుత్వ సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నదన్నారు. తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్‌లో నియోజకవర్గ స్థాయి సదస్సుకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి హాజరై మాట్లాడారు. సమన్వయ సమితులను పార్టీలకతీతంగా ఎన్నుకుంటున్నట్టు చెప్పారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చి రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో జరిగిన సదస్సులో ఎంపీ బూర నర్సయ్యగౌడ్, విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌తో కలిసి పాల్గొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా వ్యవసాయరంగం పూర్తి స్థాయి లో విధ్వంసమైందన్నారు. రైతులు తలెత్తుకునేలా చేసేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నమే సమన్వయ సమితులని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం చేయని బృహత్తర కార్యక్రమం రైతు సమన్వయ సమితుల ఏర్పాటు అని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్‌లో నిర్వహించిన సదస్సులో ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు అనేక చర్యలు చేపట్టిందని చెప్పారు. ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు సీఎం కేసీఆర్ ఫొటోకు ఐదు నదుల నీటితో మంత్రి లక్ష్మారెడ్డి ,జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ జలాభిషేకం చేశారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో జరిగిన సదస్సులో అటవీశాఖ మంత్రి జోగురామన్న మాట్లాడారు. రైతులను సంఘటితం చేసేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. రైతులు తమ పంట ఉత్పత్తులకు ధర నిర్ణయించుకొనే రోజులు త్వరలోనే రానున్నాయని, అందు లో భాగంగానే సీఎం కేసీఆర్ రైతు సమన్వయ సమితులు ఏ ర్పాటు చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట, కొల్చారం, చేగుంట మండలాల్లో జరిగిన సదస్సుల్లో మాట్లాడారు. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాట్లాడుతూ రైతులను సంఘటిత పరిచేందుకే సమన్వయ సమితులను ఏర్పాటు చేశామన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.