ఐకేపీ కేంద్రాల్లోని ధాన్నాన్ని 48 గంటల్లో కొనుగోలు చేసి ఖాళీ చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆదేశించారు. మంగళవారం జమ్మికుంటలోని పాత మార్కెట్ కార్యాలయంలో వ్యాపారులు, మిల్లర్లు అధికారులు, రైతు సంఘం నేతలతో ప్రత్యేక సమావేశమయ్యారు. తర్వాత కలెక్టర్ వీరబ్రహ్మయ్య, జేసీ సర్ఫరాజ్ అహ్మద్, డీఆర్డీఏ పీడీ విజయ్ గోపాల్, డీఎస్‌వో చంద్రప్రకాశ్, సివిల్ సైప్లె డీఎం సంపత్‌కుమార్, ఆర్డీవో చంద్రశేఖర్, అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో సమావేమయ్యారు.

-మార్కెట్లోనే కొనుగోళ్లు జరగాలి.. తడిసిన ధాన్యాన్నీ సేకరించాలి -అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్
ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన కొనసాగడంపై ఆగ్రహించారు. రైతులకు ఇబ్బందులు పెట్టవద్దని సూచించారు. మొన్నటి మూడు ఎన్నికలు ఒకేసారి రావడంతో మార్కెట్‌పై అధికారులు దష్టి సారించలేకపోయారని, ఇప్పుడు మాత్రం ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకుంటామన్నారు. 80 శాతం ధాన్యాన్ని మిల్లర్లు నేరుగా కొనుగోలు చేశారని, రైతులకు మద్దతు ధర అందించలేదని మండిపడ్డారు. మార్కెట్లోనే ధాన్యం విక్రయాలు జరగాలని, అధికారుల చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అకాలవర్షాలు అన్నదాతలను ఇక్కట్లకు గురిచేశాయని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించా రు. గోనె సంచులు, ధాన్యం రవాణాకు ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. మక్కలను మద్దతు ధరతో కొనాలని ఆదేశించారు. మగ వడ్లు, దొడ్డు రకాలను కూడా కొనాలన్నారు. జిల్లా లక్ష్యం 6.5 లక్షల ధాన్యం సేకరణగా ఉందని, అవసరమైతే అంతకన్నా ఎక్కువ కొనుగోళ్లకు ప్రభుత్వ రంగ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, నాలుగు మండలాల జెడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.