Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

త్వరలోనే ఫ్రంట్

-నిర్మాణాత్మక ప్రణాళికతో ప్రజల ముందుకు.. త్వరలోనే శుభవార్త
-కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ కోసం దేశవ్యాప్తంగా చర్చలు కొనసాగిస్తాం: సీఎం కేసీఆర్
-ఘనస్వాగతం.. అర్చకుల ఆశీర్వాదం
-కేసీఆర్ తెలంగాణకే పరిమితం కావద్దు
-ఒకేసారి ఇద్దరు దేవుళ్లను దర్శించుకున్నాం
-ఆలయం వద్ద తెలంగాణ, ఆంధ్ర ప్రజల వ్యాఖ్యలు

కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు తన మిషన్ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దీనిపై నిర్మాణాత్మక ప్రణాళికతో త్వరలో ప్రజల ముందుకు వస్తామని తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్‌పై తమ ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు. రాజకీయాల్లో గుణాత్మక మార్పునకు దేశవ్యాప్తంగా ప్రాంతీయపార్టీలన్నీ ఏకంకావాల్సిన అవసరముందన్న కేసీఆర్.. త్వరలోనే శుభవార్త వింటారని తెలిపారు. ఒడిశా పర్యటన ముగించుకుని సోమవారం సాయంత్రం కోల్‌కతాలోని పశ్చిమబెంగాల్ సచివాలయానికి చేరుకున్న కేసీఆర్‌కు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతాబెనర్జీ స్వయంగా స్వాగతం పలికారు. ఆమెతో పాటు కేసీఆర్‌ను స్వాగతించినవారిలో పలువురు మంత్రులు, అధికారులు ఉన్నారు. దాదాపు గంటపాటు సాగిన సమావేశంలో ఇద్దరు నేతలు ప్రధానంగా ఫెడరల్‌ఫ్రంట్‌పై చర్చించినట్టు సమాచారం. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై ఆదివారం నుంచి యాత్ర ప్రారంభించానన్నారు. మొదట ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌తో, ఇప్పు డు మమతాబెనర్జీతో భేటీ అయ్యానని చెప్పారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న శక్తుల ఏకీకరణ అన్నారు. బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫ్రంట్ అనేది మిషన్ ఆఫ్ కేసీఆర్ అని స్పష్టంచేశారు. దీనిపై తన ప్రయత్నాలను కొనసాగిస్తానని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ అంటే ఆదరాబాదరాగా చేయాల్సింది కాదన్నారు.

ఫ్రంట్ అనేది చిన్న విషయం కాదని, దేశవ్యాప్తంగా
వివిధ పార్టీల నాయకులతో చర్చలు కొనసాగుతాయని తెలిపారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పుడు మమతాబెనర్జీ ఫోన్ చేసి అభినందించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దీదీతో చర్చలు ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఇద్దరు రాజకీయ నాయకులు సమావేశమైనప్పుడు ఇద్దరికీ పరస్పర ఆసక్తి ఉన్న, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు చర్చకు వస్తాయి అన్నారు. తమ ఇద్దరి చర్చలు ఆహ్లాదకరంగా సాగాయని తెలిపారు. ఈ చర్చలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని చెప్పారు. కాళీఘాట్ (కోల్‌కతాలోని ప్రఖ్యాత కాళికాదేవి ఆలయం) సందర్శనకు వచ్చాను. దీదీని కలిసి, ఆమె ఆశీర్వాదాలు తీసుకోవాలని భావించాను అని తెలిపారు. అంతకుముందు కేసీఆర్‌ను మమతాబెనర్జీ శాలువాతో సన్మానించారు. మమతాబెనర్జీకి సీఎం కేసీఆర్ శాలువా కప్పి జ్ఞాపిక అందచేశారు. సీఎం కేసీఆర్ వెంట రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్, టీఎస్‌ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎంవో అధికారులు రాజశేఖర్‌రెడ్డి, సందీప్‌కుమార్ సుల్తానియా తదితరులున్నారు.

కాళీమాత దర్శనం.. ఢిల్లీలో నేడు పలువురితో సమావేశం
మమతాబెనర్జీతో భేటీ అనంతరం కోల్‌కతాలోని కాళీమాత దేవాలయాన్ని కుటుంబసభ్యులతో కలిసి కేసీఆర్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికిన దేవాలయ అధికారులు.. ఆలయ ప్రత్యేకతలను వివరించారు. దర్శనం అనంతరం కేసీఆర్ రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం నుంచి రెండు, మూడురోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటారు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీని మర్యాదపూర్వకంగా కలుస్తారు. కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో సమావేశమవుతారు. బీఎస్పీ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్‌తోనూ కేసీఆర్ సమావేశమవుతారు. పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుని రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారు.

పూరి ఆలయంలో కేసీఆర్ పూజలు
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం ఒడిశా రాష్ట్రం పూరిలోని జగన్నాథస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం భువనేశ్వర్ నుంచి రోడ్డుమార్గం గుండా జగన్నాథ స్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ కేసీఆర్ కుటుంబసభ్యులకు దేవాలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన కేసీఆర్‌ను ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. దేవాలయ ప్రత్యేకతలు, చరిత్ర గురించి వివరించారు. కేసీఆర్‌కు ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. సందర్శకుల పుస్తకంలో కేసీఆర్ దేవాలయం గురించి తన అభిప్రాయాన్ని రాశారు.

పేదల పాలిట దేవుడు
కేసీఆర్‌కు స్వాగతం పలుకడానికి, ఆయనను చూడటానికి పెద్దఎత్తున అభిమానులు తరలివచ్చారు. వీరిలో తెలంగాణకు చెందినవారితో పాటు తెలుగు, ఒడిశా ప్రజలు ఉన్నారు. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ రైతులకు అమలుచేస్తున్న పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయని ప్రశంసించారు. దేశానికి కేసీఆర్ నా యకత్వం అవసరమని తమ ఆంకాక్షను వ్యక్తంచేశారు. కేసీఆర్ జగన్నాథ దర్శనానికి వచ్చినప్పుడు తెలంగాణకు చెందిన పలువురు అక్కడ ఉన్నారు. దీంతో వారి సంతోషం అంతాఇంతా కాదు. తెలంగాణలో పేద ప్రజల దేవుడు కేసీఆర్ అని, ఆ దేవుడు ఇక్కడికి వచ్చిన రోజు తాము ఇక్కడికి రావడంతో ఇద్దరు దేవుళ్ల దర్శనం ఒకేసారి కావడం తమ అదృష్టమని వారు మీడియాతో అన్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు కూడా అక్కడికి వచ్చారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆంధ్రలో మాత్రం దోచుకునే ప్రభుత్వం ఉందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ తెలంగాణకే పరిమితం కావద్దని, ఆంధ్రలో కూడా పార్టీ పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలు చాలా బాగున్నాయని ఒడిశాలో నివాసముంటున్న వారు అన్నారు. సీఎం కేసీఆర్ వెంట కుటుంబసభ్యులతోపాటు రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్, టీఎస్‌ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.