Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

త్వరలో కేంద్రానికి నివేదిక

-వరద నష్టంపై సత్వరమే అంచనాలు సిద్ధం చేయండి: సీఎం రాష్ట్రంలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలతో కలిగిన నష్టంపై త్వరలో కేంద్రానికి నివేదికలు పంపించనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. రెండేండ్లకు సరిపడా వర్షం కురిసిందన్న సీఎం.. సమృద్ధిగా కురుస్తున్న వానలపై ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. వివిధ ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో భారీగా ఉండి కృష్ణా, గోదావరికి వరదలు వస్తాయన్న సంకేతాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో అల్పపీడనం ప్రభావంవల్ల కురిసే వర్షాలతో ఎటువంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలో గోదావరి వరద బాగా పోటెత్తే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సూచన మేరకు.. అవసరమైతే ఒకటి రెండు రోజులు కరీంనగర్‌లోనే మకాంవేసి.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టునుంచి కాళేశ్వరంవరకు పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించాలన్న ఉద్దేశంతో కరీంనగర్ వచ్చానన్నారు.

cm-kcr-review-on-rains-and-floods-in-karimnagar

సోమవారం సమీక్షాసమావేశం, ఏరియల్ సర్వే అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పలు అంశాలపై సీఎం మాట్లాడారు. ప్రస్తుత వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, పంట నష్టం, పరిహారాలు తదితరాలపై సమగ్ర అంచనాలు తయారు చేయాల్సిందిగా జిల్లా అధికారులను ఆదేశించామని, పూర్తిస్థాయి అంచనాలు రాగానే కేంద్రానికి నివేదికలు పంపిస్తామని తెలిపారు. నిజానికి వర్షం పరిస్థితులు ఎలా ఉంటాయోనని సోమవారం జరుగాల్సిన క్యాబినెట్ సమావేశాన్ని రద్దుచేశామని చెప్పారు. వర్షాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారయంత్రాగం అంతా అప్రమత్తంగా ఉండాలని,జిల్లా మంత్రులు ఎవరి పరిధిలోవారు ఉండాలని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా తమ నియోజకవర్గాల పరిధిలో ఉండి, ప్రజలకు ఏ ఇబ్బంది కాకుండా చూడాలని కోరారు.

అన్ని ప్రాజెక్టులకు భారీ ఇన్‌ఫ్లో సోమవారం మధ్యాహ్నం 3గంటల వరకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 3.18లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నదని, సింగూరు నుంచి 90వేల క్యూసెక్కులు, నిజాంసాగర్‌నుంచి 1.53 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని సీఎం తెలిపారు. ఇంకా వరద పెరిగే అవకాశం ఉందన్నారు. ఎస్సారెస్పీలో ప్రస్తుతం 81.96 టీఎంసీల నీరుందని, ఇంకా 9 టీఎంసీలు నింపుకొనే అవకాశం ఉందని అన్నారు. భారీ ఇన్‌ఫ్లో నేపథ్యంలో డ్యామ్‌కు ప్రమాదం లేకుండా అదే స్థాయిలో నీరు వదులుతున్నామని చెప్పారు. సింగూరు ప్రాజెక్టుకూ అదే పరిస్థితి ఉందన్నారు. నిజాంసాగర్‌కు 1.53 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 97వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలిపెడుతున్నట్లు చెప్పారు. ఎల్‌ఎండీ ప్రాజెక్టులోకి 20.5 టీఎంసీల నీరు వచ్చిందని, మరో మూడున్నర టీఎంసీలు నింపుకొనేందుకు అస్కారం ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టుకు 36వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నదని, జూరాల ఇప్పటికే నిండిందని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 1.40 లక్షల క్యూసెక్కులు, నాగార్జునసాగర్‌కు 73వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని, ఆల్మట్టి, నారాయణ్‌పూర్‌కు ఎగువనుంచి భారీ ఇన్‌ఫ్లో ఉందని వివరించారు. వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ముందస్తుచర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందులో భాగంగా మధ్యమానేరు ప్రాజెక్టు వద్ద వరద ఉధృతిని పరిగణలోకి తీసుకొని ఎటువంటి ప్రాణనష్టం ఉండకుండా 12గ్రామాలకు చెందిన 12వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. ప్రమాదం తగ్గిపోవడంతో సోమవారం ఉదయం తిరిగి వారి ఇండ్లకు క్షేమంగా పిలిపించామన్నారు. మధ్యమానేరుకు గండి పడిన సమయంలో ఎవరికీ ఏమీ జరుగకపోవడం హర్షించతగిన విషయమన్నారు. వరదలవల్ల ఇప్పటివరకు పెద్దగా ప్రాణనష్టం, పశుసంపద నష్టం జరుగలేదన్నారు. వివిధ కారణాలవల్ల చనిపోయినవారికి నిబంధనల ప్రకారం రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించానని తెలిపారు.

రెండేండ్లకు సరిపడా వర్షం రాష్ట్రంలో రాబోయే రెండేండ్లకు సరిపడే విధంగా అద్భుతమైన వర్షం కురిసిందని, ప్రజలు చాలా అనందంగా ఉన్నారని ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వస్తుండగా.. చాలా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తంచేశారని తెలిపారు. చేతికిరావని భావించిన వర్షాధార పంటలు కొంత నష్టపోయినా చాలావరకు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. రెండో పంట చాలామేరకు పండుతుందన్నారు. ఈ వర్షాలతో భూగర్భజలాలు భారీగా పెరుగుతాయన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా రైతుల సంక్షేమంకోసం 9 గంటల కరెంటు ఇచ్చి తీరుతామని సీఎం స్పష్టంచేశారు. రైతన్నలు మంచి పంటలు పండించాలని ఆకాంక్షించారు. దీనికి భగవంతుడు సహకరించాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

మధ్యమానేరు ప్రాజెక్టుకు  గండి తీవ్రమైన అంశం మధ్యమానేరు ప్రాజెక్టుకు గండిపడిన విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని సీఎం తెలిపారు. ఇక్కడ ఇద్దరు కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారని, కుడివైపు పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ నిబంధనల ప్రకారం నిర్మాణం చేశారని, ఎడమవైపు కాంట్రాక్టర్ ఆ తరహాలో చేయలేదని అన్నారు. ఇదో ప్రహసంగా తయారైందని విమర్శించారు. మధ్యమానేరుకు అత్యంత ప్రాధాన్యం ఉందని, ఇది కాళేశ్వరం పథకానికి లింకు కాబోతున్నదని చెప్పారు. వరద ఉన్నా, లేకపోయినా కాళేశ్వరంలో పుష్కలంగా నీరుంటుంది కాబట్టి దీనిని పటిష్ఠంగా నిర్మించాల్సి ఉందన్నారు. ప్రస్తుత పరిణామాన్ని పరిగణనలోకి తీసుకొని ఎడమవైపు కాంట్రాక్టు రద్దు చేస్తున్నామని సీఎం ప్రకటించారు. కొత్తగా టెండర్లు పిలిచేందుకు అదేశాలు ఇచ్చామని చెప్పారు. చాలా బందోబస్తుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం కావాలన్నారు. మొత్తం భవిష్యత్తులో ఉత్తర తెలంగాణకు ఈ ప్రాజెక్టు జీవనాడి అవుతుందని చెప్పారు. వీలైనంత వేగంగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టు విషయంలో సదరు కాంట్రాక్టర్‌కు ప్రభుత్వానికి ఉన్న ఒప్పందాన్ని పరిశీలించి, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఈ రోజుకు మేజర్లయితే పరిహారానికి అర్హులే మధ్యమానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల పరిధిలో ఇప్పటి వరకూ 2008 నాటికి మేజర్లుగా ఉన్నవారికి నష్టపరిహారం చెల్లిస్తున్న విధానాన్ని సవరిస్తున్నామని, ఆ స్థానంలో ఈ రోజుకు మేజర్లుగా ఉన్నవారందరికీ పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ విషయంలో నిర్వాసితుల డిమాండ్‌ను జిల్లా ప్రజాప్రతినిధులు తన దృష్టి తెచ్చారని చెప్పారు. ఈ డిమాండ్‌ను ఆమోదించడంవల్ల మధ్య మానేరు ప్రాజెక్టు పరిధిలో 4,831 మందికి, ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలో 1447 మందికి తలా రెండు లక్షల చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఫలితంగా ప్రభుత్వానికి రూ.114 కోట్ల భారం పడుతుందన్నారు. ఇది న్యాయమైన డిమాండన్న సీఎం.. ఈ చెల్లింపులకు వెంటనే అనుమతి ఇస్తున్నామని ప్రకటించారు. ఈ విధానం గండిపెల్లి, గౌరవెల్లి రిజర్వాయర్లకు కూడా వర్తిస్తుందన్నారు. ఎల్లంపల్లి, మధ్యమానేరు నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో గత ప్రభుత్వ హయాం లో జాప్యం జరిగిందని, తమ ప్రభుత్వం వచ్చాక చాలామేరకు పరిష్కరించే ప్రయత్నం చేశామని చెప్పారు.

డూప్లికేషన్ సమస్య రాకుండానే.. మధ్యమానేరు పరిధిలోని వేములవాడలో గతంలో ఒక సభ జరిగినప్పుడు నిర్వాసితులు ఎక్కడ ఇండ్లు కట్టుకున్నా రూ.5.04 లక్షల చొప్పున డబ్బు ఇస్తామని ప్రకటించిన మాట వాస్తవమని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజలకే అవకాశం ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని అనాడు చెప్పామన్నారు. అప్పటికి అక్కడి పరిస్థితి పూర్తిగా తెలియకపోవడంవల్ల మాట ఇచ్చినట్లు చెప్పిన సీఎం.. ఆ తదుపరి కలెక్టర్, ఇతర అధికారులు ఆర్‌ఆండ్‌ఆర్ కింద చేపట్టిన పక్రియ గురించి వివరించారని తెలిపారు. అప్పటికే బాధితులకు ప్లాట్లు కేటాయించడంతోపాటు పునరావాస కాలనీల్లో ఏర్పాటుచేసిన ప్రాథమిక సౌకర్యాలగురించి కలెక్టర్ తన దృష్టికి తెచ్చారని వివరించారు. మళ్లీ డూప్లికేషన్ అవసరం లేదని, అడిట్ సమస్య వస్తుందని కలెక్టర్ చెప్పడంవల్ల ఇవ్వలేకపోతున్నామని తెలిపారు. ఈ విషయంలో సంబంధిత నిర్వాసితులు తమను పెద్ద మనసుతో అర్థం చేసుకొని క్షమించాలని కోరారు. కానీ మేజర్ల విషయంలో డిమాండ్‌కు కట్టుబడి ఉంటామని తెలిపారు. ప్రాజెక్టుల పరిధిలో పరిహారం విషయంలో తలెత్తిన అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించి, వీలైనంత తొందరగా పరిహారం అందించేందుకు జిల్లా యంత్రాంగాన్ని అదేశించానని తెలిపారు. ఇప్పటికే డబ్బులు విడుదల చేశామని, అవసరాన్నిబట్టి ఇంకా ఇస్తామని చెప్పారు.

మిషన్ కాకతీయ చెరువులు తెగలేదు ఇంత భారీవర్షాలు కురిసినా.. మిషన్ కాకతీయకింద చేపట్టిన ఏ ఒక్క చెరువుకూడా తెగకపోవడం గమనించదగిన విషయమని, శుభసూచకమని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వేల చెరువులు తెగిపోయిన ఉదంతాలు చూశామని చెప్పారు. ఈసారి ఇంత పెద్ద మొత్తంలో వరదలు వచ్చినా ఇప్పటివరకు 122 చెరువులే తెగిపోయాయని, అవి కూడా మిషన్ కాకతీయ కింద చేపట్టని చెరువులని ముఖ్యమంత్రి వివరించారు. కరీంనగర్ జిల్లా మానాల వద్ద ఇటీవల ఎస్సారెస్పీ కాలువ తెగినప్పుడు ఆ నీరంతా అక్కడి చెరువులోకి వచ్చి చేరిందని, కట్టపైనుంచి నీళ్లు వెళ్లాయే తప్ప చెరువుకట్ట తెగలేదని అన్నారు. మిషన్ కాకతీయ పనులు పటిష్ఠంగా జరిగాయనేందుకు ఇదో నిదర్శనమన్నారు. విలేకరుల సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, సంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, బొడిగె శోభ, పుట్ట మధు, దాసరి మనోహర్‌రెడ్డి, రమేశ్‌బాబు, ఎమ్మెల్యే నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, నగర మేయర్ రవీందర్‌సింగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, జిల్లా ప్రత్యేక అధికారి బీఆర్ మీనా, కలెక్టర్ నీతూప్రసాద్, ఇన్‌చార్జి డీఐజీ రవివర్మ, ఎస్పీ జోయల్‌డేవిస్ తదితరులు పాల్గొన్నారు.

మేజర్లకు పరిహారంపై కొప్పుల హర్షం మధ్యమానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల పరిధిలోని నిర్వాసితుల్లో నేటివరకు 18 ఏండ్లు నిండిన అందరికీ పరిహారం ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేయడంపై ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. గత ప్రభుత్వాలు ఈ విషయంలో ఏ మాత్రం పట్టించుకోలేదని, తనతోపాటుగా జిల్లా ప్రజాప్రతినిధులమంతా ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా, గొప్ప మానవతా దృక్ఫథంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.

త్వరలో కేంద్రానికి నివేదిక   -వరద నష్టంపై సత్వరమే అంచనాలు సిద్ధం చేయండి: సీఎంరాష్ట్రంలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలతో కలిగిన నష్టంపై త్వరలో కేంద్రానికి నివేదికలు పంపించనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. రెండేండ్లకు సరిపడా వర్షం కురిసిందన్న సీఎం.. సమృద్ధిగా కురుస్తున్న వానలపై ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. వివిధ ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో భారీగా ఉండి కృష్ణా, గోదావరికి వరదలు వస్తాయన్న సంకేతాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో అల్పపీడనం ప్రభావంవల్ల కురిసే వర్షాలతో ఎటువంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలో గోదావరి వరద బాగా పోటెత్తే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సూచన మేరకు.. అవసరమైతే ఒకటి రెండు రోజులు కరీంనగర్‌లోనే మకాంవేసి.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టునుంచి కాళేశ్వరంవరకు పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించాలన్న ఉద్దేశంతో కరీంనగర్ వచ్చానన్నారు. సోమవారం సమీక్షాసమావేశం, ఏరియల్ సర్వే అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పలు అంశాలపై సీఎం మాట్లాడారు. ప్రస్తుత వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, పంట నష్టం, పరిహారాలు తదితరాలపై సమగ్ర అంచనాలు తయారు చేయాల్సిందిగా జిల్లా అధికారులను ఆదేశించామని, పూర్తిస్థాయి అంచనాలు రాగానే కేంద్రానికి నివేదికలు పంపిస్తామని తెలిపారు. నిజానికి వర్షం పరిస్థితులు ఎలా ఉంటాయోనని సోమవారం జరుగాల్సిన క్యాబినెట్ సమావేశాన్ని రద్దుచేశామని చెప్పారు. వర్షాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారయంత్రాగం అంతా అప్రమత్తంగా ఉండాలని,జిల్లా మంత్రులు ఎవరి పరిధిలోవారు ఉండాలని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా తమ నియోజకవర్గాల పరిధిలో ఉండి, ప్రజలకు ఏ ఇబ్బంది కాకుండా చూడాలని కోరారు.

అన్ని ప్రాజెక్టులకు భారీ ఇన్‌ఫ్లోసోమవారం మధ్యాహ్నం 3గంటల వరకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 3.18లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నదని, సింగూరు నుంచి 90వేల క్యూసెక్కులు, నిజాంసాగర్‌నుంచి 1.53 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని సీఎం తెలిపారు. ఇంకా వరద పెరిగే అవకాశం ఉందన్నారు. ఎస్సారెస్పీలో ప్రస్తుతం 81.96 టీఎంసీల నీరుందని, ఇంకా 9 టీఎంసీలు నింపుకొనే అవకాశం ఉందని అన్నారు. భారీ ఇన్‌ఫ్లో నేపథ్యంలో డ్యామ్‌కు ప్రమాదం లేకుండా అదే స్థాయిలో నీరు వదులుతున్నామని చెప్పారు. సింగూరు ప్రాజెక్టుకూ అదే పరిస్థితి ఉందన్నారు. నిజాంసాగర్‌కు 1.53 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 97వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలిపెడుతున్నట్లు చెప్పారు. ఎల్‌ఎండీ ప్రాజెక్టులోకి 20.5 టీఎంసీల నీరు వచ్చిందని, మరో మూడున్నర టీఎంసీలు నింపుకొనేందుకు అస్కారం ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టుకు 36వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నదని, జూరాల ఇప్పటికే నిండిందని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 1.40 లక్షల క్యూసెక్కులు, నాగార్జునసాగర్‌కు 73వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని, ఆల్మట్టి, నారాయణ్‌పూర్‌కు ఎగువనుంచి భారీ ఇన్‌ఫ్లో ఉందని వివరించారు. వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ముందస్తుచర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందులో భాగంగా మధ్యమానేరు ప్రాజెక్టు వద్ద వరద ఉధృతిని పరిగణలోకి తీసుకొని ఎటువంటి ప్రాణనష్టం ఉండకుండా 12గ్రామాలకు చెందిన 12వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. ప్రమాదం తగ్గిపోవడంతో సోమవారం ఉదయం తిరిగి వారి ఇండ్లకు క్షేమంగా పిలిపించామన్నారు. మధ్యమానేరుకు గండి పడిన సమయంలో ఎవరికీ ఏమీ జరుగకపోవడం హర్షించతగిన విషయమన్నారు. వరదలవల్ల ఇప్పటివరకు పెద్దగా ప్రాణనష్టం, పశుసంపద నష్టం జరుగలేదన్నారు. వివిధ కారణాలవల్ల చనిపోయినవారికి నిబంధనల ప్రకారం రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించానని తెలిపారు. రెండేండ్లకు సరిపడా వర్షంరాష్ట్రంలో రాబోయే రెండేండ్లకు సరిపడే విధంగా అద్భుతమైన వర్షం కురిసిందని, ప్రజలు చాలా అనందంగా ఉన్నారని ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వస్తుండగా.. చాలా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తంచేశారని తెలిపారు. చేతికిరావని భావించిన వర్షాధార పంటలు కొంత నష్టపోయినా చాలావరకు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. రెండో పంట చాలామేరకు పండుతుందన్నారు. ఈ వర్షాలతో భూగర్భజలాలు భారీగా పెరుగుతాయన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా రైతుల సంక్షేమంకోసం 9 గంటల కరెంటు ఇచ్చి తీరుతామని సీఎం స్పష్టంచేశారు. రైతన్నలు మంచి పంటలు పండించాలని ఆకాంక్షించారు. దీనికి భగవంతుడు సహకరించాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఎంఎండీకి గండి తీవ్రమైన అంశంమధ్యమానేరు ప్రాజెక్టుకు గండిపడిన విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని సీఎం తెలిపారు. ఇక్కడ ఇద్దరు కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారని, కుడివైపు పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ నిబంధనల ప్రకారం నిర్మాణం చేశారని, ఎడమవైపు కాంట్రాక్టర్ ఆ తరహాలో చేయలేదని అన్నారు. ఇదో ప్రహసంగా తయారైందని విమర్శించారు. మధ్యమానేరుకు అత్యంత ప్రాధాన్యం ఉందని, ఇది కాళేశ్వరం పథకానికి లింకు కాబోతున్నదని చెప్పారు. వరద ఉన్నా, లేకపోయినా కాళేశ్వరంలో పుష్కలంగా నీరుంటుంది కాబట్టి దీనిని పటిష్ఠంగా నిర్మించాల్సి ఉందన్నారు. ప్రస్తుత పరిణామాన్ని పరిగణనలోకి తీసుకొని ఎడమవైపు కాంట్రాక్టు రద్దు చేస్తున్నామని సీఎం ప్రకటించారు. కొత్తగా టెండర్లు పిలిచేందుకు అదేశాలు ఇచ్చామని చెప్పారు. చాలా బందోబస్తుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం కావాలన్నారు. మొత్తం భవిష్యత్తులో ఉత్తర తెలంగాణకు ఈ ప్రాజెక్టు జీవనాడి అవుతుందని చెప్పారు. వీలైనంత వేగంగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టు విషయంలో సదరు కాంట్రాక్టర్‌కు ప్రభుత్వానికి ఉన్న ఒప్పందాన్ని పరిశీలించి, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ రోజుకు మేజర్లయితే పరిహారానికి అర్హులేమధ్యమానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల పరిధిలో ఇప్పటి వరకూ 2008 నాటికి మేజర్లుగా ఉన్నవారికి నష్టపరిహారం చెల్లిస్తున్న విధానాన్ని సవరిస్తున్నామని, ఆ స్థానంలో ఈ రోజుకు మేజర్లుగా ఉన్నవారందరికీ పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ విషయంలో నిర్వాసితుల డిమాండ్‌ను జిల్లా ప్రజాప్రతినిధులు తన దృష్టి తెచ్చారని చెప్పారు. ఈ డిమాండ్‌ను ఆమోదించడంవల్ల మధ్య మానేరు ప్రాజెక్టు పరిధిలో 4,831 మందికి, ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలో 1447 మందికి తలా రెండు లక్షల చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఫలితంగా ప్రభుత్వానికి రూ.114 కోట్ల భారం పడుతుందన్నారు. ఇది న్యాయమైన డిమాండన్న సీఎం.. ఈ చెల్లింపులకు వెంటనే అనుమతి ఇస్తున్నామని ప్రకటించారు. ఈ విధానం గండిపెల్లి, గౌరవెల్లి రిజర్వాయర్లకు కూడా వర్తిస్తుందన్నారు. ఎల్లంపల్లి, మధ్యమానేరు నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో గత ప్రభుత్వ హయాం లో జాప్యం జరిగిందని, తమ ప్రభుత్వం వచ్చాక చాలామేరకు పరిష్కరించే ప్రయత్నం చేశామని చెప్పారు. డూప్లికేషన్ సమస్య రాకుండానే..మధ్యమానేరు పరిధిలోని వేములవాడలో గతంలో ఒక సభ జరిగినప్పుడు నిర్వాసితులు ఎక్కడ ఇండ్లు కట్టుకున్నా రూ.5.04 లక్షల చొప్పున డబ్బు ఇస్తామని ప్రకటించిన మాట వాస్తవమని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజలకే అవకాశం ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని అనాడు చెప్పామన్నారు. అప్పటికి అక్కడి పరిస్థితి పూర్తిగా తెలియకపోవడంవల్ల మాట ఇచ్చినట్లు చెప్పిన సీఎం.. ఆ తదుపరి కలెక్టర్, ఇతర అధికారులు ఆర్‌ఆండ్‌ఆర్ కింద చేపట్టిన పక్రియ గురించి వివరించారని తెలిపారు. అప్పటికే బాధితులకు ప్లాట్లు కేటాయించడంతోపాటు పునరావాస కాలనీల్లో ఏర్పాటుచేసిన ప్రాథమిక సౌకర్యాలగురించి కలెక్టర్ తన దృష్టికి తెచ్చారని వివరించారు. మళ్లీ డూప్లికేషన్ అవసరం లేదని, అడిట్ సమస్య వస్తుందని కలెక్టర్ చెప్పడంవల్ల ఇవ్వలేకపోతున్నామని తెలిపారు. ఈ విషయంలో సంబంధిత నిర్వాసితులు తమను పెద్ద మనసుతో అర్థం చేసుకొని క్షమించాలని కోరారు. కానీ మేజర్ల విషయంలో డిమాండ్‌కు కట్టుబడి ఉంటామని తెలిపారు. ప్రాజెక్టుల పరిధిలో పరిహారం విషయంలో తలెత్తిన అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించి, వీలైనంత తొందరగా పరిహారం అందించేందుకు జిల్లా యంత్రాంగాన్ని అదేశించానని తెలిపారు. ఇప్పటికే డబ్బులు విడుదల చేశామని, అవసరాన్నిబట్టి ఇంకా ఇస్తామని చెప్పారు. మిషన్ కాకతీయ చెరువులు తెగలేదుఇంత భారీవర్షాలు కురిసినా.. మిషన్ కాకతీయకింద చేపట్టిన ఏ ఒక్క చెరువుకూడా తెగకపోవడం గమనించదగిన విషయమని, శుభసూచకమని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వేల చెరువులు తెగిపోయిన ఉదంతాలు చూశామని చెప్పారు. ఈసారి ఇంత పెద్ద మొత్తంలో వరదలు వచ్చినా ఇప్పటివరకు 122 చెరువులే తెగిపోయాయని, అవి కూడా మిషన్ కాకతీయ కింద చేపట్టని చెరువులని ముఖ్యమంత్రి వివరించారు. కరీంనగర్ జిల్లా మానాల వద్ద ఇటీవల ఎస్సారెస్పీ కాలువ తెగినప్పుడు ఆ నీరంతా అక్కడి చెరువులోకి వచ్చి చేరిందని, కట్టపైనుంచి నీళ్లు వెళ్లాయే తప్ప చెరువుకట్ట తెగలేదని అన్నారు. మిషన్ కాకతీయ పనులు పటిష్ఠంగా జరిగాయనేందుకు ఇదో నిదర్శనమన్నారు. విలేకరుల సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, సంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, బొడిగె శోభ, పుట్ట మధు, దాసరి మనోహర్‌రెడ్డి, రమేశ్‌బాబు, ఎమ్మెల్యే నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, నగర మేయర్ రవీందర్‌సింగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, జిల్లా ప్రత్యేక అధికారి బీఆర్ మీనా, కలెక్టర్ నీతూప్రసాద్, ఇన్‌చార్జి డీఐజీ రవివర్మ, ఎస్పీ జోయల్‌డేవిస్ తదితరులు పాల్గొన్నారు. మేజర్లకు పరిహారంపై కొప్పుల హర్షంమధ్యమానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల పరిధిలోని నిర్వాసితుల్లో నేటివరకు 18 ఏండ్లు నిండిన అందరికీ పరిహారం ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేయడంపై ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. గత ప్రభుత్వాలు ఈ విషయంలో ఏ మాత్రం పట్టించుకోలేదని, తనతోపాటుగా జిల్లా ప్రజాప్రతినిధులమంతా ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా, గొప్ప మానవతా దృక్ఫథంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.