త్వరలో “ తెలంగాణ పల్లె ప్రగతి ” పథకం ప్రారంభం పల్లెప్రగతి కార్యక్రమంపై సెర్ప్ అధికారులతో సమావేశం పల్లెప్రగతి కార్యక్రమం కోసం రూ.653 కోట్లు జీవనోపాది కల్పన, పాడి పరిశ్రమ, వ్యవసాయ ఉత్పత్తులకి చేయూత మానవాభివృధ్ది సూచికల పెరుగుదలకి ప్రత్యేక చర్యలు పల్లె సమగ్ర సేవా కేంద్రాల ఏర్పటు

తెలంగాణ పల్లెల సమగ్రాభివృధ్ధి కోసం చేపట్టనున్న తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్టు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కె. తారక రామా రావు ప్రకటించారు. ప్రపంచ బ్యాంకు సహయంతో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి అధికారికంగా సమాచారం వచ్చిన నేపథ్యంలో బేగంపేటలోని (క్యాంపు అపీసు)లో సెర్ప్ అధికారులతో సమావేశమయ్యారు. ఈసమావేశంలో సెర్ఫ సియివో మురళితోపాటు పలువురు అధికారులు పాల్గోన్నారు. మెత్తం తెలంగాణ రాష్ట్రంలో తొమ్మది జిల్లాల్లోని 150 వెనుకబడిన మండలాల అభివృద్ది కొరకు వరల్డ్ బ్యాంకు మరియు రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో 107 మిలియన్ డాలర్లు అనగా రూపాయలు 653 కోట్ల మొత్తాన్ని “ తెలంగాణ పల్లె ప్రగతి ” కార్యక్రమాన్ని ఐదు సంవత్సరాల కాలపరిధిలో అమలు చేయుటకు నిర్ణయించడం జరిగింది. ఎంపికైన 150 మండలాల్లో సూమారుగా 2,900 పంచాయతీలు ఉండగా, వీటి పరిధిలో సూమారుగా 4,950 గ్రామాలు, 10,600 పునరావాస ప్రాంతాలు ఉన్నాయి. ఈ మొత్తంలో వరల్డు బ్యాంకు 75 మిలియన్ డాలర్లు అనగా 450 కోట్లు రుణంగా మరియు రాష్ట్ర ప్రభుత్వం 32 మిలియన్ డాలర్లు అనగా 203 కోట్లు తమ వాటాగా మంజూరు చేయ్యడం జరిగింది. ఈ మొత్తాన్ని క్రింద తెలిపిన అభివృద్ది కార్యక్రమాలకు సెర్ప్ ద్వారా వినియోగించి “ తెలంగాణ పల్లె ప్రగతి ” కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు.
ఉత్పత్తిదారుల సంస్థలు మరియు జీవనోపాదుల విలువలను పెంపొందించుటలో భాగంగా గ్రామాల్లోని ప్రజలకి జీవోనోపాధి శిక్షణతో ఇవ్వడం జరుగుతుంది. దీంతో వారు స్వయంసమృద్ది సాధించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీంతో పాటు వ్యవసాయం మీద అధారపడిన రైతులకి మరింత సాయం అందించేందుకుకోసం వివిధ ప్రణాళికలను ఈకార్యక్రమంలో భాగంగా చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం వ్యవసాయదారుల కోపరేటివ్స్ ని ఏర్పాటు చేసి సమిష్టిగా రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రైతులు ప్రధానంగా ఆధారపడే పాడి పరిశ్రమ, గొర్రెలు, మేకల పెంపకంతో పాటు వరి, తృణదాన్యాల ఉత్పత్తి వంటి అంశాల్లో సహకారం అందించి రైతులకి మేలు చేకూర్చుతామన్నారు. దీనివల్ల రైతులకి గిట్టుబాటు దర లభించడంతోపాటు వివిధ అంశాల్లో ప్రయోజనం చేకూతుందన్నారు. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకి మార్కెటింగ్ సౌకర్యాలు పెంపోందించేందుకు షాప్ లను(రూరల్ అవుట్ లెట్స్) ఏర్పాటు చేస్తామన్నారు. మనవాభివృధి సూచికలను పెంపొందించే ప్రణాళికలో భాగంగా వివిధ కార్యక్రమాలు చేపట్టి గ్రామ ప్రజలకి ముఖ్యంగా స్ర్తీలకి సరైన పౌష్టికాహరం అందే విధంగా చర్యలు చేపడుతామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక శ్రధ్దవహించనున్నట్టు ఆయన తెలిపారు.
పల్లె సమగ్ర సేవ కేంద్రాలును ఏర్పాటు చేయనున్నట్లు అయన ప్రకటించారు. ఇందులో భాగంగా 1000 గ్రామాల్లో ప్రత్యేక కియోస్క్ లు ఏర్పాటు చేస్తామని, వీటి ద్వారా పౌరసేవలను అందిస్తామని తెలిపారు. పౌరసేవలతోపాటు నగదు బదీలీ సేవలను, ఉపాధిహమీ కూలీ చెల్లింపులను, పించన్ల వంటి పలు అర్దికపరమైన సేవలను ఈ సేవా కేంద్రాల ద్వారా చెల్లిస్తారు. ఇక ప్రజల నుంచి వివిధ దరఖాస్తులు మరియు పిర్యాదులను స్వీకరించేందుకు సైతం ఇక్కడ ఏర్పాట్లు చేస్తామన్నారు. మహిళా సాధికారతను పేంచె ఉద్దేశ్యంతో ఈ పౌరసేవా కేంద్రాల నిర్వహననను అయా గ్రామాల్లోని విద్యావంతులైన మహిళకి అప్పజెప్పాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టులో బాగంగా చేసే వ్యయం తాలుకు వివరాలు కింద విధంగా ఉంటాయని మంత్రి కె.తారక రామారావు తెలిపారు.
ఈ పథకం 75 లక్షల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో 13.17 లక్షల షెడ్యుల్డ్ కులాల వారు మరియు 16.43 లక్షల షెడ్యుల్డ్ తెగల ప్రజలు ఉన్నారు.