మార్చి 1నుండి జరగాల్సిన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశాలను వాయిదా వేస్తున్నట్టు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ ప్రకటించారు. దేశ సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సమావేశాలు వాయిదా వేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మళ్లీ ఎప్పటి నుండి సమావేశాలు నిర్వహించే విషయం పార్టీ అధ్యక్షుడు శ్రీ కేసీఆర్ గారితో సంప్రదించిన తర్వాత ప్రకటిస్తామని కేటీఆర్ తెలిపారు.