-నిజామాబాద్ జిల్లా బైక్ ర్యాలీలో మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి మంత్రి కేటీఆర్ ఓదార్పు – రూ.5 లక్షల చెక్కు అందజేత.. ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని భరోసా

నిజామాబాద్ జిల్లాలోని దోమకొండ మండలం బీబీపేట్ గ్రామానికి చెందిన చాట్ల మహంకాళి (50) మూడు రోజుల క్రితం మంత్రి కేటీఆర్ స్వాగత ర్యాలీలో పాల్గొని ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని సోమవారం ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారక రామారావు, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పరామర్శించారు.
మహంకాళి భార్య సుశీల, కొడుకు శ్రీనివాస్, ఇద్దరు కూతుళ్లను ఓదార్చారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ హామీఇచ్చారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చెక్కు అంద జేశారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ పార్టీ కోసం సైనికుల్లా కష్టపడుతున్న టీఆర్‌ఎస్ కార్యకర్తల శ్రమను అధిష్ఠానం గుర్తించి వారిని అన్ని వేళలా ఆదుకుంటుందని స్పష్టంచేశారు.