Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు

-ప్రచారానికి వెళ్లిన ప్రతిచోటా ఓటు మీకేనంటున్న పట్టభద్రులు -దేవీప్రసాద్‌కు తొలి ప్రాధాన్యత ఓటెయ్యండి: హోంమంత్రి నాయిని -సమాజానికి, సర్కారుకు వారథిగా ఉండాలనే సీఎం కేసీఆర్ ఎన్నికలో బరిలో  నిలిపారు: ఎమ్మెల్సీఅభ్యర్థి దేవీప్రసాద్ -టీడీపీ, బీజేపీ అబద్ధాలను పట్టభద్రులు నమ్మరు: పల్లా రాజేశ్వర్‌రెడ్డి

Palla Rajeshwar Reddy

తెలంగాణ ఉద్యమంలో 22 రోజులపాటు జైలుకూడు తిన్న ఉద్యమకారుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. స్వరాష్ట్రం సాధించేవరకు ఉద్యమంలో ఉద్యోగులను ఒక్కతాటిపై నిలిపి గల్లీ టు ఢిల్లీ లాంగ్‌మార్చ్ చేయించిన పోరాటయోధుడు దేవీప్రసాద్. ఉద్యమంతో మమేకమైన ఇద్దరు నేతలు ఇప్పుడు ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచారు. ఘనమైన నేపథ్యమున్న ఈ నేతలకు ప్రచారంలో తెలంగాణ సమాజం మొత్తం ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నది. బడి, గుడి, కాలేజీ, కోర్టు, వాకర్స్, విద్యార్థులు, న్యాయవాదులు, కాలనీ సంక్షేమ సంఘాలు అనే తేడాలేకుండా అన్ని చోట్లా ఊహించని మద్దతు వెల్లువెత్తుతున్నది. తొలి ప్రాధాన్యత ఓటు టీఆర్‌ఎస్‌కే వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు.

దేవీప్రసాద్ విజయం ఖాయమైంది: హోంమంత్రి నాయిని తెలంగాణ ఉద్యమంలో సకలజనుల సమ్మెతో చరిత్ర సృష్టించిన టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌కు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రులు తొలిప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం వనస్థలిపురంలోని ఎన్జీవోస్ కాలనీ, సచివాలయనగర్, రైతుబజార్ ప్రాంతాల్లోని పార్కుల్లో వాకర్స్‌తో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ మినీ ఇండియా అని, అన్ని ప్రాంతాలవారు స్వేచ్ఛగా జీవిస్తున్నారన్నారు. ఇక్కడ ఉన్నవారంతా తెలంగాణ బిడ్డలేనని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా అండగా ఉంటామన్నారు. దేవీప్రసాద్‌కు ఉద్యోగులు, పట్టభద్రుల మద్దతు పుష్కలంగా ఉందన్నారు. టీఆర్‌ఎస్ గ్రేటర్ అడ్‌హక్ కమిటీ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలు టీఆర్‌ఎస్‌కు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్ మాట్లాడుతూ 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి దేశంలోనే చరిత్ర సృష్టించిన ఘనత సీఎం కేసీఆర్‌దన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై గళమెత్తేందుకే ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానన్నారు. ఈ సందర్భంగా వాకర్స్ దేవీప్రసాద్‌కే ఓటేస్తామని ప్రకటించారు. తర్వాత సైఫాబాద్ పీజీసైన్స్ కాలేజీలో టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ దేవీప్రసాద్ ప్రచారానికి అపూర్వస్పందన వస్తున్నదని, ఆయన గెలుపు ఎప్పుడో ఖాయమైందన్నారు. విద్యార్థులంతా దేవీప్రసాద్‌కే ఓటేస్తామని ప్రతిజ్ఞచేశారు.

నష్టపోయినా ఉద్యమించిన న్యాయవాదులు: దేవీప్రసాద్ తెలంగాణ న్యాయవాదులు స్వరాష్ట్రం కోసం విలక్షణమైన పాత్ర పోషించారని దేవీప్రసాద్‌రావు కొనియాడారు. నాంపల్లి కోర్టు ఆవరణలోని బార్ కౌన్సిల్ హాల్‌లో బార్‌ అసోసియేషన్ అధ్యక్షుడు కొండారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. న్యాయం కోసం కోర్టుల్లో పోరాడే న్యాయవాదులు ఆత్మగౌరవం కోసం నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన పోరాడారని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం హైకోర్టు, ఉద్యోగుల విభజనలో పరిష్కారమార్గాలు చూపకుండా ఆలస్యం చేస్తుందని ఆరోపించారు. పరిష్కార మార్గాల కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. అడ్వకేట్ జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యమంలో ముందున్న వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని, తొలి ప్రాధాన్యత ఓటును దేవీప్రసాద్‌కే వేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారులే బంగారు తెలంగాణ సాధిస్తారని, దేవీప్రసాద్‌కు ఓటెయ్యాలని సీనియర్ న్యాయవాది ప్రహ్లాద్ కోరారు. జేఏసీ ప్రతినిధి శ్రీరంగారావు మాట్లాడుతు దేవీప్రసాద్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. హాల్‌లోకి నలుగురైదుగరు టీడీపీ, బీజేపీ మద్దతుదారులైన న్యాయవాదులు సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీఎన్జీవో సంఘం హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశమై మద్దతును ప్రకటించారు.

గచ్చిబౌలిలో బిల్డర్స్ అసోయేషన్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దేవీప్రసాద్‌ను సన్మానించి విజయం కోసం అండగా ఉంటామని ప్రకటించారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు అలుగుబెల్లి నర్సిరెడ్డి, చావ రవి దేవీప్రసాద్‌కు మద్దతు ప్రకటించారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో మూడు జిల్లాల కార్యకర్తల సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఘాల తరుపున దేవీప్రసాద్ నిలబడ్డారని కొనియాడారు. పీఆర్‌టీయూ, తెలంగాణ రిటైర్ట్ ఉద్యోగుల సంఘం కూడా మద్దతు ప్రకటించాయి. ఆయా కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ ఎల్బీనగర్ ఇన్‌చార్జి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్, గ్రేటర్ అడ్‌హక్ కమిటీ సభ్యులు పీచర వెంకటేశ్వరరావు, గ్రేటర్ జేఏసీ ఛైర్మన్ శ్రీధర్, టీఆర్‌ఎస్వీ గ్రేటర్ అధ్యక్షుడు బాబా ఫసియొద్ధీన్, ఖైరతాబాద్ టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి, నక్క ప్రభాకర్‌గౌడ్, కిషోర్‌గౌడ్, శ్రీనివాస్, జీహెచ్‌ఎంసీ మాజీ ఫ్లోర్‌లీడర్ సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ కార్పోరేటర్ కాలేరు వెంకటేశ్, అడ్వకేట్స్ జేఏసీ ప్రతినిధులు గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

బీజేపీకి ఓటేస్తే చంద్రబాబుకు బలపరిచినట్లే: పెద్ది సుదర్శన్‌రెడ్డి వ్యక్తిగత దూషణలు వద్దు. అభివృద్ధిపై చర్చిద్దాం.. బీజేపీ, టీడీపీ సిద్ధమా అని నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం వరంగల్ జిల్లా మరిపెడలో నిర్వహించిన డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభలో ఆయన మాట్లాడారు. తాను వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ఓ కుగ్రామంలో పుట్టానని, అక్కడ 7వతరగతి చదివి 8 నుంచి 10వరకు ఖమ్మం, ఇంటర్ హన్మకొండలో చదివినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా అత్తగారు, నల్గొండ జిల్లాలో విద్యాసంస్థలు నిర్వహిస్తున్నానని వివరించారు. తెలంగాణ కోసం ఉద్యమించి జైలు కెళ్లి, 22 రోజులు జైలు కూడు తిన్నానని గుర్తుచేశారు. ఉద్యమంలో అప్పుడు కానరానివారిని ఎన్నికల్లో దించి మాయమాటలు అబద్ధాలు ప్రచారం చేసినంత మాత్రాన పట్టభద్రులు నమ్మరని టీడీపీ, బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో హామీలతోపాటు కొత్త సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. అనంతరం పట్టణంలోని డిగ్రీ, జూనియర్ కళాశాలలు తిరిగి గ్రాడ్యుయేట్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు.

అనంతరం టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు భారీగా డబ్బు సంచులు పంపిస్తున్నాడని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థులకు ఓట్లేస్తే చంద్రబాబును బలపరిచినట్లువుతుందని, ఈ విషయాన్ని గ్రాడ్యుయేట్స్ గుర్తించాలని ఆయన విజ్ఞప్తిచేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపు నల్లేరుపై నడకేనన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపెల్లి రవీందరరావు, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, టీఆర్‌ఎస్ స్టీరింగ్ కమిటీ సభ్యులు సత్యవతిరాథోడ్, రామ్మోహన్‌రావు, శ్రావణ్‌కుమార్, రామసహాయం రంగారెడ్డి, టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, మానుకోట మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత, వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా టీఆర్‌ఎస్ నాయకులు గుడిపూడి నవీన్, నాయకులు రామసహాయం సత్యనారాయణరెడ్డి, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, తాళ్లపెల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.