Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన

అధికార పార్టీ టీఆర్‌ఎస్ చేపట్టిన సభ్యత్వ నమోదుకు తొలిరోజే అనూహ్య స్పందన లభించింది. క్రియాశీల కార్యకర్తలతో పాటు ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు, యువత సభ్యత్వం కోసం క్యూ కట్టారు. తొలిరోజే అనూహ్య స్పందన రావడంతో నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్నది. ఓటరు జాబితాలను చూసుకొని సభ్యత్వం చేయించవలసిన అగత్యం టీఆర్‌ఎస్‌కు లేదు. స్వచ్ఛందంగా లక్షలాది మంది టీఆర్‌ఎస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకుంటున్నారుఅని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

Tummala-Nageshwar-Rao-launching-of-party-Memebership-Drive-in-Kahmmam-District

-భవిష్యత్ టీఆర్‌ఎస్‌దేనని నేతల భరోసా -జిల్లాల్లో పోటాపోటీగా నమోదవుతున్న సభ్యత్వాలు బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరులో సభ్యత్వ నమోదును మంత్రి ప్రారంభించారు. ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి తొలిసభ్యత్వాన్ని అందజేశారు. మంత్రి చేతుల మీదుగా పరిశ్రమల శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, అంజయ్య యాదవ్ పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఖమ్మంలో ఉత్సాహంగా సభ్యత్వ నమోదు ఖమ్మం జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకటరావు ఘనంగా ప్రారంభించారు. ఆన్‌లైన్ సభ్యత్వ నమోదును ప్రారంభించి, ప్రచార వాహనానికి గులాబీ జెండా పంపించారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతున్నారని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, అశ్వరావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ పది అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్జీలు నాయకులు పాల్గొన్నారు. ఉదయం బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో పార్లమెంట్ కార్యదర్శి జలగం వెంకటరావు టీఆర్‌ఎస్ ఆన్‌లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి వందల మంది నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌దే భవిష్యత్: దాస్యం ఇతర పార్టీలకు రాష్ట్రంలో స్థానం ఉండదని పార్లమెంటరీ కార్యదర్శి దాస్యం వినయ్‌భాస్కర్ చెప్పారు. వరంగల్ టీఆర్‌ఎస్ అర్బన్ పార్టీ కార్యాలయంలో ఆయన సభ్యత్వ నమోదు, కాజీపేటలో ఆన్‌లైన్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో 30 వేల సాధారణ సభ్యత్వంతోపాటు ఐదువేల మంది క్రియాశీల సభ్యులను పార్టీలో చేర్పిస్తామని తెలిపారు. వర్థన్నపేటలో ఎమ్మెల్యే అరూరి రమేశ్, పాలకుర్తిలో సుధాకర్‌రావు సభ్యత్వ నమోదును ప్రారంభించారు.

అల్గుగునూరు నుంచి సభ్యత్వ నమోదు 2009 నవంబర్ 29న స్వరాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేసేందుకు కరీంనగర్ నుంచి బయలుదేరిన సీఎం కేసీఆర్‌ను అరెస్టు చేసిన అల్గునూరు చౌరస్తాలో ఎంపీ వినోద్‌కుమార్ సభ్యత్వ నమోదు ప్రారంభించారు. జిల్లాలో లక్ష్యానికి మించి సభ్యత్వం నమోదు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ వినోద్, తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి సభ్యత్వాన్ని స్వీకరించారు. హుస్నాబాద్‌లో పార్లమెంట్ కార్యదర్శి వొడితల సతీష్‌కుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి సభ్యత్వం స్వీకరించారు.

నల్లగొండను అగ్రభాగాన ఉంచుతాం: బండా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదులో నల్లగొండ జిల్లాను అగ్రభాగంలో నిలుపుతామని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. నకిరేకల్‌లో ఆయన సభ్యత్వ నమోదును లాంఛనంగా ప్రారంభించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తొలి సభ్యత్వాన్ని అందుకున్నారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ పాల్గొన్నారు.

ఉద్యమంలా సభ్యత్వం నమోదుచేయాలి: మంత్రి జోగు, ఎంపీ సుమన్ ఉద్యమంలో ఏ విధంగానైతే పాల్గొన్నారో, అదే తరహాలో పార్టీ సభ్యత్వ నమోదు విజయవంతం చేయాలని కార్యకర్తలకు అటవీశాఖ మంత్రి జోగు రామన్న, పెద్దపెల్లి ఎంపీ బాల్క సుమన్ పిలుపునిచ్చారు. వీరు ఆదిలాబాద్‌లో పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించి మాట్లాడారు. ఉద్యమంలో భాగస్వాములైన వారంతా సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన కార్యకర్తలకు సముచిత న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎంపీ గెడాం నగేష్ హాజరయ్యారు. నిర్మల్‌లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సభ్యత్వ నమోదును ప్రారంభించారు.

ఆడబిడ్డకు అండగా రాష్ట్ర సర్కార్ -కల్యాణలక్ష్మి, షీ టీమ్స్‌తో అభయం: ఎంపీ కవిత -టీఆర్‌ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు తుల ఉమకు తొలి సభ్యత్వం నమస్తే తెలంగాణ, హైదరాబాద్/ సిటీబ్యూరో: ఆడబిడ్డ బాగుంటేనే.. ఇల్లు బాగుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎపీ కవిత పేర్కొన్నారు. ఆడబిడ్డలు బిందెలతో నీరు తెచ్చుకోవద్దనే ఉద్దేశంతో ఇంటింటికి నీరు, కల్యాణలక్ష్మీ, మహిళల పేరుతో భూపంపిణీ, బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నారని అన్నారు. మహిళల రక్షణ, భద్రతకు చర్యలు చేపడుతున్నారని, షీటీంలు, జిల్లాల్లో నిర్భయ కేంద్రాలు ఏర్పాటు చేయించి ఆడబిడ్డలకు రాష్ట్ర సర్కార్ అండగా నిలిచిందన్నారు.

టీఆర్‌ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బుధవారం తెలంగాణ భవన్‌లో ఎంపీ కవిత ప్రారంభించారు. టీఆర్‌ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు తుల ఉమకు తొలి సభ్యత్వాన్ని ఎంపీ కవిత అందించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సభ్యత్వ నమోదులో మహిళలు చురుకుగా పాల్గొనాలని.. పురుషుల కంటే ఒకరు ఎక్కువే ఉండాలని పిలుపునిచ్చారు. తుల ఉమ మాట్లాడుతూ మహిళలు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని.. కేసీఆర్ నిర్మించే బంగారు తెలంగాణలోనూ పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ తదితరులు

సభ్యత్వ నమోదుపై మంత్రి పోచారం సమీక్ష సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదుపై మంత్రులు దృష్టి సారించారు. నిజామాబాద్ జిల్లాలో సభ్యత్వ నమోదు విషయంపై వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి బుధవారం ఆయన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఎంపీలు కవిత, పాటిల్, జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు. సభ్యత్వ నమోదులో ఎలా ముందుకు వెళ్లాలో వ్యూహరచన చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.