Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

టీఆర్‌ఎస్‌కు ప్రజాబలం

-లక్ష్యానికి మించి నమోదవుతున్న సభ్యత్వాలు -ఉత్సాహంగా పనిచేస్తున్న పార్టీ శ్రేణులు -నేటితో ముగియనున్న నమోదు గడువు

Membership-drive

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్ బలమైన శక్తిగా ఎదుగుతున్నది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశంతో ఈనెల 3 నుంచి చేపట్టిన సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. పార్టీ నిర్ధేశించిన లక్ష్యాన్నిమించి రికార్డుస్థాయిలో రెట్టింపు సభ్యత్వాలు నమోదవుతున్నాయి. ఇతర పార్టీ నుంచి కూడా శ్రేణులు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుంటూ సభ్యత్వాలు తీసుకుంటుండడంతోపాటు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుండటంతో పార్టీ శ్రేణులు కూడా రెట్టించిన ఉత్సాహంతో సభ్యత్వ నమోదులో పాల్గొంటున్నారు. శుక్రవారంతో సభ్యత్వ నమోదు గడువు ముగుస్తుండటంతో చివరి రోజుకూడా భారీగా నభ్యత్వాలు నమోదు చేయించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధమయ్యారు.

రికార్డుస్థాయిలో గ్రేటర్ సభ్యత్వాలు గ్రేటర్ టీఆర్‌ఎస్ సభ్యత్వం రికార్డుస్థాయిలో సాగింది. గ్రేటర్‌లో టీఆర్‌ఎస్ చేపట్టిన సభ్యత్వం పది లక్షలకు చేరుకున్నది. ఇప్పటికే పార్టీ కార్యాలయాన్ని 8 లక్షలకు పైగా పుస్తకాలు, సభ్యత్వ డబ్బులు చేరుకోగా ఇంకా రెండున్నర లక్షల సభ్యత్వాలకు సంబంధించిన పుస్తకాలు కార్యకర్తల వద్దే ఉన్నాయి. గురువారం సభ్యత్వ నమోదులో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, గ్రేటర్ కన్వీనర్ మైనంపల్లి హన్మంతరావు పాల్గొన్నారు. పలువురు న్యాయవాదులు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా టీఆర్‌ఎస్ సభ్యత్వం స్వీకరించారు. టీఆర్‌ఎస్ భవన్‌లో అర్చక సేవా సంఘం సభ్యడు సీతారామశర్మ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సభ్యత్వం అందజేశారు. మెదక్ జిల్లా లక్ష్యం 3 లక్షలు కాగా గురువారం నాటికి 4.25 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి. గురువారం సంగారెడ్డి మండలం కందిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, సభ్యత్వ నమోదు జిల్లా ఇన్‌చార్జి మందుల సామేల్, పటాచెరుల ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో సభ్వత్వాల సంఖ్య 4 లక్షలు దాటిందని మంత్రులు జోగు రామన్న, ఇద్రకరన్‌రెడ్డి ప్రకటించారు. టీడీపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ములుగునూరి రాజేశ్వర్‌గౌడ్ ఎంపీ గొడాం నగేశ్, ఎమెల్యే రేఖానాయక్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఖమ్మం జిల్లా టార్గెట్‌ను దాటి రెట్టింపు దిశగా పయనం చేస్తున్నది. జిల్లాకు 2.50 లక్షల సాధారణం, 50 వేల క్రియాశీలక సభ్యత్వాలు లక్ష్యంగా పెట్టగా సభ్యత్వాలు మొత్తం 4లక్షలకు చేరుకుంది.

పేదల సంక్షేమానికే పెద్దపీట: మంత్రి మహేందర్‌రెడ్డి

పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో నిర్వహించిన సభ్యత్వ నమోదులో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ సభ్యత్వ నమోదుకు అపూర్వ స్పందన లభిస్తున్నదన్నారు. కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీల నుంచి భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. జిల్లాలో ఆరు లక్షల సభ్యత్వాలతో రికార్డు సృష్టించినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, నరేందర్‌రెడ్డి, రాములునాయక్, ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్ పాల్గొన్నారు. వికారాబాద్‌లో ఎమ్మెల్యే సంజీవరావు, ఇబ్రహీంపట్నంలో నియోజకవర్గ ఇన్‌చార్జి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, మహేశ్వరంలో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ స్టేజీవద్ద సాంస్కృతిక సారథి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కరీంనగర్‌లో మేయర్ రవీందర్ సింగ్, మంత్రి ఈటల రాజేందర్ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్ ప్రెస్‌క్లబ్‌లో ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ సమక్షంలో మాజీ నక్సలైట్లు నాగరాజు, జేరిపోతుల సంపత్, చంద్రన్నల ఆధ్వర్యంలో 300 మంది టీఆర్‌ఎస్ సభ్యత్వం స్వీకరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు. వేములవాడలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే కే విద్యాసాగర్‌రావు, హుస్నాబాద్‌లో పార్లమెంటరీ కార్యదర్శి సతీశ్‌కుమార్, మహాముత్తారంలో ఎమ్మెల్యే పుట్ట మధు, పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, చొప్పదండిలో ఎమ్మెల్యే బొడిగ శోభ పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలో జెట్‌స్పీడ్‌తో కొనసాగుతున్నది. గురువారం సాయంత్రానికి 5 లక్షల 20వేల సభ్యత్వాలు పూర్తయ్యాయి.

మహబూబ్‌నగర్‌లో సభ్యత్వ నమోదు జిల్లా ఇన్‌చార్జి మార్కడేయ ఎంపీ జితేందర్‌రెడ్డికి సభ్యత్వం అందజేశారు. కార్యక్రమంలో కో కన్వీనర్ బెక్కెం జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, బెక్కెం జనార్దన్ సమక్షంలో రిటైర్డ్ జిల్లా జడ్జి కిషన్‌రావుతోపాటు పలువురు న్యాయవాదులు పార్టీలో చేరి సభ్యత్వాలు స్వీకరించారు. శ్రీనివాస్‌గౌడ్ ఇంట్లో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థిసంఘం నాయకులు సభ్యత్వాలు స్వీకరించారు. తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చెరుకు శాంతిభూషణ్ ఆధ్వర్యంలో మహిళలు, యువకులు స్వచ్ఛందంగా సభ్యత్వాలు స్వీకరించారు. కొత్తకోటలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్, జిల్లా ఇన్‌చార్జి మార్కండేయ పాల్గొన్నారు. కల్వకుర్తి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పాల్గొన్నారు.

సభ్యత్వం స్వీకరించిన 1969 ఉద్యమకారులు నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో స్థానికులు పెద్ద సంఖ్యలో సభ్యత్వాలు తీసుకున్నారు. రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం, నకిరేకల్ మండలం నోములలో ఎమ్మెల్యే వీరేశం కార్యకర్తలకు సభ్యత్వం అందజేయగా, నార్కట్‌పల్లి మండల పరిధిలోని దేశినూనిగూడెంలో ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మిర్యాలగూడలో నియోజకవర్గ ఇన్‌చార్జి అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. కోదాడ పట్టణంలో 1969 తెలంగాణ ఉద్యమకారులు 60 మంది టీఆర్‌ఎస్‌లో చేరి సభ్యత్వ తీసుకున్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఇన్‌చార్జి కాసోజు శంకరమ్మ, నల్లగొండ పట్టణంలో నియోజకవర్గ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి, ఆత్మకూర్(ఎం), గుండాల మండలాల్లో టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి గొంగిడి మహేందర్‌ర్‌రెడ్డి సభ్యత్వం అందజేశారు. నిజామాబాద్ జిల్లాలో 2.70 లక్షల సభ్యత్వ నమోదు చేయాలని నిర్ధేశించగా ఇప్పటి వరకు 4.38 లక్షల సాధారణ, క్రియాశీల సభ్యత్వాలు చేయించారు. శుక్రవారంతో గడువు ముగియనుండటంతో మరిన్ని సభ్యత్వాలు చేపించే అవకాశం ఉందని జిల్లా సభ్యత్వ నమోదు పరిశీలకుడు ఎల్ రూప్‌సింగ్ తెలిపారు. గురువారం బాల్కొండలో ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, అర్బన్‌లో ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.