Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

తుమ్మిళ్ల నుంచి జలధార

-ఆర్డీఎస్ ఆయకట్టుకు మహర్దశ
-ఫలించిన ఉద్యమ స్వప్నం
-కాల్వలకు చేరిన తుంగభద్ర నీళ్లు
-ఆర్డీఎస్ కింద 55,600 ఎకరాలకు లబ్ధి
-11 నెలల్లో పూర్తిచేసిన టీఆర్‌ఎస్ సర్కారు
-ఆర్డీఎస్ వాటా కోసం నాడు కేసీఆర్ పాదయాత్ర

హైదరాబాద్ స్టేట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో కలుపడంతో పచ్చగా పరిఢవిల్లిన పాలమూరు మాగాణాలు ఎడారులయ్యాయి. 10 నుంచి 20 ఎకరాలున్న మోతుబరి రైతు పొట్ట చేతబట్టుకొని ముంబై, హైదరాబాద్ తదితర మహానగరాలకు వలసెళ్లటం ప్రారంభమైంది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఎడుమ వైపున ఉన్న ఆర్డీఎస్ ఆయకట్టుకు 15.9 టీఎంసీల నీటి కేటాయింపు ఉన్నా సగం నీరు కూడా రాలేదు. కుడివైపు కేసీ కెనాల్ రెట్టింపు నీళ్లతో ఉరకలు వేసింది. తెలంగాణ ఉద్యమ సారథి, ప్రస్తుత సీఎం కేసీఆర్ 2003 జూలై 20న పాదయాత్ర చేపట్టారు. అలంపూర్ నుంచి గద్వాల వరకు 120 కిలోమీటర్ల మేర 30 గ్రామాల గుండా సాగిన ఈ పాదయాత్ర చారిత్రాత్మకమైంది. అదే నెల 25వ తేదీన గద్వాలలో జరిగిన బహిరంగసభలో తెలంగాణ జలసాధన ఉద్యమం ఊపిరి పోసుకుంది. ఆర్డీఎస్‌కు న్యాయం జరిగేవరకు పోరాటాన్ని ఆపను… అవసరమైతే ఢిల్లీదాకా ఈ సమస్యను తీసుకుపోయి న్యాయం చేస్తాను అని ఉద్యమ నేత కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ పాదయాత్రకు జడిసి అప్పటి ప్రభుత్వం ఆర్డీఎస్ వద్ద తెరిచి ఉన్న తూములను మూసేందుకు ముందు కొచ్చింది. కానీ కర్నూల్ జిల్లా ప్రజాప్రతినిధులు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, బాలనాగిరెడ్డి తూములను పేల్చివేశారు. దీంతో తూముల మూసివేత ఆగిపోయింది. వైఎస్‌ఆర్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ తీవ్రతను తట్టుకోలేక ఎట్టకేలకు ఆర్డీఎస్ తూములను మూసివేయించింది.

ఆర్డీఎస్ విషాద గాథ ఇది…
పూర్వపు హైదరాబాద్ స్టేట్, బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉన్న మద్రాసు రాష్ర్టానికి 1944లో తుంగభద్ర జలాల వినియోగంపై ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఆర్డీఎస్‌కు దిగువన సుంకేశుల ఆనకట్ట, కేసీ కెనాల్ నిర్మాణం చేపట్టారు. 1944 ఒప్పందం ప్రకారం ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద ఎడమవైపున హైదరాబాద్ రాష్ర్టానికి ఆర్డీఎస్ కెనాల్ ద్వారా, దిగువన సుంకేశుల ద్వారా కేసీ కెనాల్‌కు పోవాలి. 1956లో రాష్ర్టాల పునర్విభజన తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా ఆంధ్రప్రదేశ్‌లో, రాయచూర్ జిల్లా కర్ణాటక రాష్ట్రంలో కలిశాయి. తుంగభద్రజలాల వాడకం కోసం జరిగిన ఒప్పందంలో మద్రాసు, హైదరాబాద్ స్టేట్‌లకు బదులు ఏపీ, కర్ణాటక వచ్చాయి. ఈ ఒప్పంద వివరాలను 1970 దశకంలో కృష్ణాజలాల పంపిణీ కోసం ఏర్పాటైన బచావత్ ట్రిబ్యునల్ ముందు పెట్టకుండా కేసీ కెనాల్‌కు ఎక్కువనీటి కేటాయింపు చేసుకొని ఏపీ 1944 ఒప్పందాన్ని ఉల్లంఘించింది. బచావత్ ట్రిబ్యునల్ ముందు ఆర్డీఎస్ కాల్వకు, కేసీ కెనాల్‌కు సమానంగా నీరు కేటాయించాలని వాదించకుండా కేసీ కెనాల్‌కు 69.4 టీఎంసీలు, ఆర్డీఎస్ కాల్వకు 15.9 టీఎంసీలను సమైక్య ప్రభుత్వం డిమాండ్ చేసింది.

ఆయకట్టు దీనస్థితి ఇది
ఆర్డీఎస్ ఆనకట్ట ఎడమవైపున కాల్వ ప్రారంభమవుతుంది. దీని మొత్తం పొడవు 143 కిలోమీటర్లు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో 42.6 కిలోమీటర్లు.. ఆతర్వాత మహబూబ్‌నగర్ జిల్లాలో 42.6 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఆనకట్ట వద్ద తూములు తెరిచి ఉండటం వల్ల అక్కడ తగినంత నీటిమట్టం లేకపోవడం… కాల్వల నిర్వహణ సరిగా లేకపోవడంతో నీటి ప్రవాహం రాని దుస్థితి. దీంతో ఆర్డీఎస్ కింద 87,500 ఎకరాల ఆయకట్టు ఉంటే ఏనాడూ 30వేల ఎకరాలకు మించి నీరివ్వలేదు. గద్వాల తాలూకాలో ఏడు, అలంపూర్ తాలూకాలోని 67 గ్రామాల పరిధిలోని 87వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకుగాను 15.91 టీఎంసీల నీటిని బచావత్ కేటాయించింది. ఆర్డీఎస్ కాల్వకు కొన్ని దశాబ్దాలుగా సగటున 5.5 – 8.5 టీఎంసీలకు మించలేదని దక్కలేదని రికార్డులు చెప్తున్నాయి. 1975-76లో ఆర్డీఎస్‌కు 13.77 టీఎంసీలు దక్కగా కేసీ కెనాల్‌కు 65.88 టీఎంసీల నీళ్లందాయి. 1986-87లో 9.08 టీఎంసీలు ఆర్డీఎస్‌కు, 47.10 టీఎంసీలు కేసీ కెనాల్‌కు చేరాయి. 1996-97లో 6.53 టీఎంసీలు ఆర్డీఎస్‌కు, 51.32 టీఎంసీలు కేసీ కెనాల్‌కు నీళ్లందాయి. 2007-08లో 4.52 టీఎంసీలు ఆర్డీఎస్‌కు, 50.91 టీఎంసీలు కేసీ కెనాల్‌కు అందాయి.

ఈ దుస్థితిని గమనించిన మంత్రి హరీశ్‌రావు సమైక్య రాష్ట్రంలో మంజూరైన ఆధునీకరణ పనులు పూర్తిచేయించేందుకు యత్నించారు. కర్ణాటక వెళ్లి అక్కడి జలవనరులశాఖ మంత్రితో పనులు వేగవంతం చేయించినా కాల్వకు మరోవైపు ఉన్న ఏపీ రైతులు, ప్రజాప్రతినిధులు సహకరించలేదు. మంత్రి హరీశ్‌రావు ఏపీ మంత్రి దేవినేని ఉమకు లేఖ రాసినా, ఫోన్ చేసినా సానుకూలంగా స్పందించలేదు. దీంతో సీఎం కేసీఆర్ తన ఆలోచనతో ప్రత్యామ్నాయంగా తుమ్మిళ్ల వద్ద ఎత్తిపోతలను చేపట్టి పూర్తిచేశారు. ఇలా నానా ఇబ్బందుల మధ్య మొదలైన తుమ్మిళ్ల ఎత్తిపోతలను అడ్డుకొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నించారు. నదీయాజమాన్య బోర్డుకు, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి తన నైజాన్ని బయటపెట్టుకున్నారు. అయినా సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పదినెలల్లో ఈ పథకాన్ని పూర్తిచేసి నడిగడ్డ ప్రజలకు కానుకగా అందించారు. రెండోదశలో మల్లమ్మకుంట, జులకల్, వల్లూర్ రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు లింక్ కెనాల్స్, ఫీడర్ ఛానెల్స్‌ను నిర్మించనున్నారు.

ఆర్డీఎస్ కాల్వలోకి చేరిన తుమ్మిళ్ల నీరు
-పూజలుచేసి ప్రారంభించిన సీఈ అయిజ: ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు తుమ్మిళ్ల ఎత్తిపోతలద్వారా నీరు చేరింది. ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల సీఈ ఖగేందర్, ఎత్తిపోతల పథకాల రాష్ట్ర సలహాదారు పెంటారెడ్డి ఉదయం 10.55 గంటలకు సంప్రదాయబద్ధంగా పూజలు చేసి మొదటి మోటర్‌ను ప్రారంభించారు. నీటి విడుదల జరుగగానే తనగల గ్రామ సమీపంలోని డిస్ట్రిబ్యూటరీ వద్ద ఆర్డీఎస్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ తనగల సీతారాంరెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున చేరుకున్న రైతుల పటాకులు కాల్చి, పూలు చల్లి తుంగభద్ర నీటికి పూజలు చేశారు. పథకం పనులను ఈ ఏడాది జనవరి 8న మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, లకా్ష్మరెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డితో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయించారు. మొదటిదశలో రూ.389 కోట్లతో మూడు మోటర్లను ఏర్పాటు చేయడంతోపాటు అప్రోచ్ కెనాల్, ఫోర్ బే, పంప్‌హౌస్, మూడు పైపులైన్లు చేపట్టారు. రెండు 5.5 మెగావాట్ల పంపులు, ఒకటి 10.5 మెగావాట్ల పంపును ఏర్పాటు చేసి, ఆర్డీఎస్ ప్రధాన కాల్వ 75వ కిలోమీటర్ దగ్గర ఆర్డీఎస్ కాల్వకు అనుసంధానం చేశారు. మొదటి దశలో ఒక మోటర్ పూర్తికావడంతో ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలోని వానాకాలం, యాసంగిలలో సాగుచేసిన పంటలకు సాగునీరు అందించాలనే దృఢ సంకల్పంతో పనులు 11 నెలల్లోనే పూర్తి చేసి, మొదటి పంపును ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో అనతికాలంలోనే పూర్తిచేసిన ప్రాజెక్టుల వరుసలో మొదటిది భక్తరామదాసు ప్రాజెక్టు కాగా, రెండోది తుమ్మిళ్ల ఎత్తిపోతల.

దేవదూతలా వచ్చి పాలమూరును పచ్చగా చేసిన సీఎం కేసీఆర్‌సీ
ఎం కేసీఆర్ పాలమూరుకు దేవదూతలా వచ్చి ఈ ప్రాంతాన్ని పచ్చబర్చేందుకు ప్రాజెక్టులు చేపట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ జిల్లాలో పాదయాత్రలు చేసి, ఎంపీగా మహబూబ్‌నగర్ ఉమ్మ డి జిల్లా సమస్యలన్నింటిని గుర్తించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తుండటంతో పూర్వవైభవం వస్తున్నది. రికార్డు సమయంలో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి నడిగడ్డలోని 85 వేల ఎకరాలకు సాగునీటిని అందించడం గొప్ప ఘట్టం. సీఎం కేసీఆర్‌కు జిల్లా తరపున చేతులెత్తి దండం పెడుతున్నా. తుమ్మిళ్ల జలాలను తీసుకెళ్లి సీఎం కేసీఆర్ పాదాలను కడిగేందుకు నడిగడ్డ రైతులు సిద్ధమవుతున్నారు. -మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకులలో మీడియాతో ఎంపీ జితేందర్‌రెడ్డి

తుమ్మిళ్ల మొదటి దశ
-తుమ్మిళ్ల వద్ద తుంగభద్ర నుంచి 70 రోజుల్లో 5.44 టీఎంసీలను 75 కి.మీ. పాయింట్‌కు ఎత్తిపోస్తారు
-650 మీటర్ల మేర అప్రోచ్‌చానెల్ నిర్మించారు. తర్వాత 80 మీటర్ల నీటి సంప్ (ఫోర్‌బే), పంపుహౌజ్ పూర్తి
-పంపుహౌజ్‌లో 5.5 మెగావాట్ల సామర్థ్యంతో 2 పంపులు, 10.5 మెగావాట్ల మరోపంపు ఏర్పాటు చేశారు.
-ఆర్డీఎస్ కాల్వకు సమాంతరంగా రెండు పైపులైన్ల ద్వారా 687 క్యూసెక్కులను 75 కి.మీ. వద్ద కాల్వలో పోస్తున్నారు.

ఆర్డీఎస్ కాలువలు మురిశాయి. నడిగడ్డ సంబురపడింది.. పూర్వ పాలమూరు పరవశించింది. రాష్ట్ర ప్రభుత్వం 11 నెలల్లోపే తుమ్మిళ్ల లిఫ్టును పూర్తి చేసి ఆర్డీఎస్ శనివారం నుంచి కాలువలకు నీళ్లందించడం ప్రారంభించింది. దీంతో పండుగ వాతావరణం నెలకొంది. తుంగభద్ర వడివడిగా ఆర్డీఎస్ కాలువను ముద్దాడటంతో నడిగడ్డ రైతులు పరవశించి పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకున్నారు. తుమ్మిళ్ల లిఫ్టుతో ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలోని 55,600 ఎకరాలకు లబ్ధిచేకూరనుంది. దీంతో తెలంగాణ ఉద్యమ కాలంనాటి స్వప్నం సాకారమైంది

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.