రాష్ట్ర సాధన ఉద్యమంలో నమోదైన కేసులను ఇప్పటికే ప్రభుత్వం ఎత్తివేసినా.. పెండింగ్‌లోనున్న కొన్ని కేసులపై గురువారం రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
కేసుల ఎత్తివేతలో కొంత మంది బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో పెండింగ్‌లో ఉన్న కేసులు, రైల్వే కేసులకు సంబంధించిన తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా హోంమంత్రి చర్చించారు. సమావేశంలో హోం శాఖ కార్యదర్శి బీ వెంకటేశం, లా సెక్రటరీ సంతోశ్‌రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, సీఐడీ అదనపు డీజీ సత్యనారాయణ్, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి, సైబరాబాద్ జాయింట్ సీపీ శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు.