-జోరుగా సాగుతున్న కార్యక్రమం -గ్రామాల్లో విశేష స్పందన -స్వచ్ఛందంగా ముందుకొస్తున్న ప్రజలు -మరింత పటిష్ఠంగా గులాబీదళం -ఉద్యమంలా సభ్యత్వ నమోదు
టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఉద్యమంలా సాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా అన్ని జిల్లాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పార్టీ అభిమానులు, యువత, ఉద్యోగులు స్వచ్ఛందంగా సభ్యత్వాలు స్వీకరిస్తున్నారు. బుధవారం పలు జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు పార్టీ జిల్లా, నియోజకవర్గాల ఇంచార్జిలు, నాయకులు, కార్యకర్తలకు సభ్యత్వాలు అందించారు.

రికార్డు స్థాయిలో సభ్యత్వాలు టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తీసుకుంటున్నారని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆజంపురా డివిజన్ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో హైదరాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో పలువురికి సభ్యత్వాలు అందజేశారు.

యజ్ఞంలా చేపట్టాలి : మంత్రి మల్లారెడ్డి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని యజ్ఞంలా చేపట్టాలని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు. మేడ్చల్ నియోజకవర్గంలో నియోజకవర్గలో పలు ప్రాంతాల్లో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి మంత్రి పర్యటించి సభ్యత్వ నమోదు చేయించారు.
స్వచ్ఛందంగా రావడం అభినందనీయం : టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా రావడం అభినందనీయమని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో సభ్యత్వ నమోదును పరిశీలించారు. నాగారం, అర్వపల్లి మండలాల్లో ఎమ్మెల్యే గాదరి కిశోర్, పాలకవీడు, నేరేడుచర్ల మండలాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

సభ్యత్వ నమోదులో భాగస్వాములవుదాం సభ్యత్వ నమోదులో పార్టీ నాయకులు, కార్యకర్తలు భాగస్వాములు కావాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు లక్ష్మారెడ్డికి ఆయన తొలి సభ్యత్వం అందజేశారు. మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి పాల్గొన్నారు.
ఉద్యమంలా చేపట్టాలి : మంత్రి అల్లోల సభ్యత్వాన్ని ఉద్యమంలా చేపట్టాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపు నిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సొనాలలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పాల్గొన్నారు.
వివిధ జిల్లాల్లో.. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, పెద్దపల్లి జిల్లా కాసులపల్లిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో పార్టీ ఇంచార్జి మూల విజయారెడ్డి, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, బెల్లంపల్లి, బెల్లంపల్లి మండలం తాళ్లగురిజాలలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సభ్యత్వ నమోదు అందజేశారు. అలాగే కోటపల్లిలో మూల విజయారెడ్డి , క్యాతనపల్లి మున్సిపాలిటీలో మంచిర్యాల జెడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి ప్రారంభించారు.ఆసిఫాబాద్లోఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, జెడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఆదిలాబాద్ జెడ్పీ చైర్పర్సన్ రాధోగ్ జనార్దన్, జిల్లా ఇంచార్జి నారదాసు లక్ష్మణ్‌రావు, కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సభ్యత్వాలు ప్రారంభించారు.
మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం దోనూరు, సింగందొడ్డి గ్రామాల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, దేవరకద్ర, చిన్నచింతకుంటలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, నారాయణపేట జిల్లా మక్తల్‌లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సభ్యత్వాలను ప్రారంభించారు.మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే రెడ్యానాయక్, కేసముద్రంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్, వరంగల్ అర్బన్ జిల్లా ఖిలావరంగల్‌లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ధర్మసాగర్ మండలం నారాయణగిరిలో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పలువురికి సభ్యత్వాలు అందజేశారు.ఆదిలాబాద్ మండలం బట్టి సవర్గాం, చాందా, బేల మండల కేంద్రాల్లో బుధవారం ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి సభ్యత్వ నమోదు ఇంచార్జి లోక భూమారెడ్డి సభ్యత్వాలు అందజేశారు.హైదరాబాద్ అల్వాల్‌లోని మెదక్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లక్ష్మీకాంతరావుకు గ్యాదరి బాలమల్లు సభ్యత్వాన్ని అందించారు.
-జనగామలోని ఎమ్మెల్యే క్యాంపుఆఫీస్లో సభ్యత్వ నమోదు కంప్యూటీకరణ (ఆన్లైన్) ప్రక్రియను రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, జనగామ జెడీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రారంభించారు. -టీఆర్ఎస్ సభ్యత్వాన్ని పండుగలా చేపట్టాలని ఎల్బీనగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం కురుమ అన్నారు. నియోజకవర్గంలోని కొత్తపేట, గడ్డిఅన్నారం, నాగోలు డివిజన్లలో నిర్వహించిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. – రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని స్టార్ గార్డెన్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డితో కలిసి రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ కోట్ల ప్రశాంతి, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు కొలన్ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణభవన్‌లో.. టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం టీఆర్ఎస్కేవీ ఆధ్వర్యంలో ఐదు లక్షల సభ్యత్వాలు నమోదుచేసే లక్ష్యంతో పనిచేయాలని టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ పిలుపునిచ్చారు. తెలంగాణభవన్‌లో బుధవారం జరిగిన టీఆర్ఎస్కేవీ రాష్ట్ర నాయకుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర కార్యదర్శులు గట్టు రాంచందర్‌రావు, ఎల్ రూప్సింగ్, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ, ఉపాధ్యక్షుడు మారయ్య, రాఘవులు, తదితరులు పాల్గొన్నారు.