Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఉద్యమ బెబ్బులి తెలంగాణ

-ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్లు వారి హక్కు
-మొండిపట్టు పడుత.. సాధించేదాక వదిలిపెట్ట
-రిజర్వేషన్లు పెంచేది లేదని అమిత్‌షా అంటడు
-ఎందుకు పెంచరు? ఇండియా మీ అయ్య జాగీరా?
-కాంగ్రెస్, బీజేపీలది ఛండాలమైన రాజకీయం
-ఆ రెండు పార్టీలు దేశానికి అతిపెద్ద పీడ.. దరిద్రం
-నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ఫెడరల్‌ఫ్రంట్ రావాలి
-అందులో నేనే కీలకపాత్ర పోషిస్తా
-అందుకే ఆ రెండు పార్టీలు వణుకుతున్నయి
-ప్రజా ఆశీర్వాదసభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్
-ఎవలుపడితే వాళ్లు.. ఏదిపడితే అది మాట్లాడితే వినేవాళ్లెవరూ లేరిక్కడ
-బీజేపీ రాష్ట్రాల్లో 24 గంటల కరంట్ ఇస్తరా?
-నరేంద్రమోదీ, అమిత్‌షాలకు సీఎం కేసీఆర్ సవాల్
-తెలంగాణను చూసి నరేంద్రమోదీ నేర్చుకోవాలి
-కరంటుపై చర్చిద్దామంటే నిజామాబాద్ దాటిండు

ఆరు నూరైనా ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్లు సాధించి తీరుతానని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. రిజర్వేషన్ల పెంపుదలకు కేంద్రం అడ్డుపడటంపై ఆయన నిప్పులు చెరిగారు. తెలంగాణ ఏర్పాటుతో ముస్లింల సంఖ్య 6% నుంచి 12శాతానికి పెరిగింది. ముస్లింలు, గిరిజనుల రిజర్వేషన్లు పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసినం. కేంద్రానికి కూడా పంపినం. మేం రిజర్వేషన్లు పెంచం అంటరు నరేంద్రమోదీ, అమిత్‌షా! ఎందుకు చెయ్యరు? ఇది మీ అయ్య జాగీరా? మా గిరిజనులు, ముస్లింల పిల్లలు చదువుకోవద్దా? ఉద్యోగాలు రావొద్దా? ఇంకెంతకాలం చేస్తరు ఈ మతాల పంచాయితీ? ఏం మతం అండీ పొద్దాక! ఇది సరికాదు కదా అని కేసీఆర్ అసహనం వ్యక్తంచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆదిలాబాద్, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, రామగుండంలలో ఏర్పాటుచేసిన టీఆర్‌ఎస్ ప్రజాఆశీర్వాదసభల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్బ్భై ఏండ్లుగా పెత్తందారి రాజకీయం. బీజేపీ యేతర కాంగ్రెసేతర ప్రభుత్వం కేంద్రంలో రావాలి. దానికోసమే యుద్ధం ప్రారంభిస్తే.. ఆ రెండు పార్టీలకు కేసీఆర్‌ను చూస్తే వణుకు! తెలంగాణ తెస్తానన్నప్పుడు ఎవరూ నమ్మలేదు. గట్టిగ కొట్లాడితే ఇయాల కాలేదా? ప్రజల హక్కు కాబట్టి ముస్లిం, గిరిజనులకు రిజర్వేషన్ కేంద్రం మెడలు వంచి తెస్తాను. పట్టుపడితే మొండిపట్టు పడుత. సాధించేవరకు వదిలిపెట్ట. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. వచ్చే టర్మ్‌లో నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటుచేసి, ఇక్కడ 17 ఎంపీ సీట్లు గెలిచి ముస్లిం, గిరిజన రిజర్వేషన్లు సాధిస్తం అని చెప్పారు.

రిజర్వేషన్లు 50శాతానికి మించొద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవరించే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉన్నదని సీఎం అన్నారు. భారతదేశంలో దురదృష్టం! పెద్ద పార్టీలు, జాతీయపార్టీలు అని చెప్పుకునే కాంగ్రెస్, బీజేపీవాళ్లు పచ్చి అబద్ధాలు మాట్లాడుతరు. దుర్మార్గమైన రాజకీయాలు, ఛండాలమైన రాజకీయాలు చేస్తున్నరు. ఆ పార్టీలు ఉన్నంతకాలం ఈ దేశం గతి ఇంతే.

మంచివాళ్లు కూడా దుర్మార్గం చేసేలా చేస్తయి. దేశానికి అవి పెద్ద పీడ, దరిద్రం అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉంటూ, అన్ని అధికారాలు చేతిలో పెట్టుకొని రాష్ట్రాలపై కర్రపెత్తనం చేస్తున్నాయని విమర్శించారు. వీటి పీడపోవాలంటే కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ నాయకత్వంలో నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. అందులో తాను కీలకపాత్ర పోషిస్తానని స్పష్టంచేశారు. ఒకప్పుడు మనకన్నా పేద దేశమైన చైనా.. ఇప్పుడు అమెరికా తర్వాత నంబర్ టు గా నిలిచిందని సీఎం చెప్పారు. కానీ.. మనం మాత్రం ఇంకా పేదరికంలోనే ఉండిపోయామని ఆవేదన వ్యక్తంచేశారు.

దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీకి మెదడు లేకపోవడంవల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న సీఎం.. ఈ రెండు దరిద్రాలు పోతేనే దేశం బాగుపడుతుందని చెప్పారు. కరంటు సమస్యను పరిష్కరిస్తామంటే ప్రతిపక్ష నేత జానారెడ్డి ఎట్లయితది? అన్నారని, కానీ.. చేసి చూపించామని సీఎం చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ మేధావులు పోడు భూముల సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటున్నామని సీఎం చెప్పారు. 58 ఏండ్లలో కాంగ్రెస్, టీడీపీ చేసిందేమిటో.. నాలుగున్నరేండ్లలో టీఆర్‌ఎస్ సాధించింది ఏమిటో ప్రజల కండ్లముందే ఉన్నదన్న సీఎం.. గాలి గాలి కావొద్దు.. ఆలోచించి ఓటేయాలని, టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కొన్ని అంశాలపై సీఎం కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

అధికారాలు ఎందుకు బదలాయించరు?
బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఆదిలాబాద్‌కు వచ్చి కమ్యూనిటీ హాల్ గురించి మాట్లాడుతడు. ప్రధాని మోదీ నిజామాబాద్‌కు పోయి మోరీలు లేవంటడు! ఇదా వీళ్లు మాట్లాడేది? గ్రామీణ పాఠశాలలు, వ్యవసాయం, ఆరోగ్యం, పట్టణాభివృద్ధిపై కేంద్రం పెత్తనం ఎందుకు? అధికారాలను ఎందుకు బదలాయిస్తలేరు? ఇది రాష్ర్టాల హక్కులను హరించడమే.

తెలంగాణ.. బెబ్బులి!
తెలంగాణ ప్రజలను ఆగమాగం చేయాలని బీజేపీ చూస్తున్నది. ఏది నిజమో.. ఏది అవాస్తవమో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఎవరో వచ్చి చెప్తే.. గోల్‌మాల్ అయ్యే పరిస్థితిలో లేరు బిడ్డా! ఇది తెలంగాణ.. పదిహేనేండ్లు కొట్లాడి రాష్ట్రం సాధించుకున్న బెబ్బులి. ఎవలువడితే వాళ్లు వచ్చి.. ఇష్టం ఉన్నది చెప్పితే వినడానికి ఎవరూ లేరు ఇక్కడ.

ఆయుష్మాన్ భారత్ థర్డ్ క్లాస్ స్కీం..
ఆయుష్మాన్ భారత్ థర్డ్ క్లాస్ స్కీం. చిన్న గుడిసె ఉన్నా, మోటర్‌సైకిల్ ఉన్నా, ఎకరం జాగా ఉన్నా వర్తించదట. అంటే రాష్ట్రంలోని 20% ప్రజలు కూడా దీని పరిధిలోకి రారు. మనదగ్గర ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ కవర్ అయితది. ఆయుష్మాన్ భారత్‌కంటే కోటి పాళ్లు నయం. అందుకే అందులో మేం చేరలేదు. హెలికాప్టర్‌లో వస్తా అంటే మోదీ జారుకున్నడు..

తెలంగాణలో విద్యుత్ సరిగాలేదని ప్రధాని అబద్ధాలు చెప్పారు. దమ్ముంటే అక్కడే ఉండు.. ప్రజల్లోనే తేల్చుకుందాం అని సవాలు చేస్తే.. నిలబడక నిజామాబాద్ దాటిండు. మిస్టర్ నరేంద్రమోదీ, మిస్టర్ అమిత్‌షా.. నేను ఒక ప్రశ్న అడుగుతున్న. దమ్ముంటే జవాబు చెప్పాలె. బీజేపీ పాలిస్తున్న 19 రాష్ర్టాల్లో ఏ ఒక్కచోటైనా ముసలోళ్లకు పింఛన్ ఇస్తున్నరా? వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నరా? రైతులకు రూపాయన్నా రుణమాఫీ చేసిన్రా? ఒక్క రాష్ట్రంలనైన ఒంటరి మహిళలకు పింఛను ఇచ్చే సంస్కారం మీకుందా? ఇయాల మా దగ్గర మేం తండ్లాడుతున్నం. మీరు అధికారంలో ఉన్న రాష్ర్టాలల్లో మీరు పీకిందేంలేదు కానీ.. మా దగ్గరకొచ్చి మాకు సున్నాలు పెడ్తున్నారు. మీకింత సక్కదనం ఉన్నదని మా కాడికొచ్చి విమర్శ చేస్తున్నరా? ప్రధాని మోదీ మమ్ముల్ని చూసి నేర్చుకోవాలి.

తెలంగాణ వస్తదన్న నమ్మకం ఎవరికీ లేకుండే
తెలంగాణ వచ్చే సమయంలో నిజానికి నేను ఉద్యమం మొదలుపెట్టిననాడు తెలంగాణ వస్తదన్న నమ్మకం ఎవనికీ లేదు. సామల సదాశివగారు అనే పెద్దాయన ఉండే. నేను ఆయన ఇంటికి వెళ్లిన. చాలా విషయాలు షేర్ చేసుకున్నం. ఉద్యమ సమయంలో నాకు బాగా ఆవేశం ఉండే. కేసీఆర్‌గారు ఉద్యమాన్ని బాగా తెచ్చినవ్.. ఈంత కొస ఎల్లాలి.. తెలంగాణ రావాలి. కొన్ని విషయాలు గట్టిగ అనకు.. కొందరికి నచ్చదు. బార్‌బార్‌బోలూంగా.. హజార్‌బార్ బోలూంగా.. అంటే నడవదు అని చెప్పినాడు ఆ పెద్దాయన. అట్లా చాలా కొట్లాడినం. అయినా తెలంగాణ వస్తదన్న నమ్మకం లేకుండే. కేసీఆర్ కొట్లాడుతుండు కానీ, ఎవరు ఇస్తరు తెలంగాణ? అనేటోళ్లు. కానీ ఉద్యమంలో నీతి, నిజాయితీ ఉంటే దేవుడి దయ ఉంటుంది.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.