Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఉద్యోగులకు వరాలు.. నిరుద్యోగులకు వెలుగులు

-గ్రేటర్ పారిశుద్ధ్య కార్మికులకు రూ.1500 ఇంక్రిమెంట్.. విద్యావలంటీర్లకు 50శాతం వేతనం పెంపు -1,551 అధ్యాపక పోస్టులకు సీఎం కేసీఆర్ ఆమోదం.. జీహెచ్‌ఎంసీలో 226 ఖాళీల భర్తీకి పచ్చజెండా.

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు, నిరుద్యోగులకు వరాల జల్లు కురిపించింది. వేతనాల పెంపుతోపాటు, ఖాళీల భర్తీకి ఆమోదముద్ర వేసింది. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిత్యం శ్రమిస్తున్న 18,382మంది పారిశుద్ధ్య కార్మికులకు రూ.1500 జీతం పెంచుతూ సీఎం కే చంద్రశేఖర్‌రావు మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. విద్యావలంటీర్ల వేతనాన్ని 50శాతం పెంచాలని, కొత్తగా తీసుకోనున్న 11,428 విద్యావలంటీర్ల పోస్టులకూ ఇదే వర్తింపజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. యూనివర్సిటీలలో 1,551 అధ్యాపకుల పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. వీటిలో 1061 ఖాళీలను ప్రస్తుత సంవత్సరంలోనే భర్తీ చేయనున్నారు. ఇక జీహెచ్‌ఎంసీలో 226 ఖాళీల భర్తీకి కూడా మార్గం సుగమమైంది. పాఠశాల విద్యా శాఖలో ఖాళీగా ఉన్న 8,972 టీచర్ పోస్టుల భర్తీని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిత్యం శ్రమించే పారిశుద్ధ్య కార్మికుల జీవితాల్లో వేతనాల పెంపు ద్వారా వెలుగురేఖలను నింపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ బీ జనార్దన్‌రెడ్డి కూడా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను పెంచాలని ముఖ్యమంత్రిని కోరారు. మంగళవారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమీక్షలో వీరి వేతనాలను రూ.1500 మేర పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. తెలంగాణ వచ్చేనాటికి పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.8,500 ఉండేది. గతంలో సీఎం కేసీఆర్ వారి వేతనాన్ని రూ.12,500కు పెంచారు. తాజాగా మరోసారి రూ.1500 పెంచి, జీతాన్ని రూ.14,000 చేశారు. రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల నుంచి కూడా కార్మికుల వేతనాల పెంపు అంశం చర్చకొచ్చింది. దీనిపై కూడా ముఖ్యమంత్రి సానుకూలత వ్యక్తంచేశారు. మున్సిపాలిటీల ఆర్థికస్థితిపై వివరాలు తీసుకోవాల్సిందిగా పురపాలక శాఖ కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల వేతనాల్ని రూ.14,000కి పెంచుతూ సీఎం తీసుకున్న నిర్ణయంపై మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్ హర్షంవ్యక్తంచేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలవడానికి ప్రధాన కారణమైన పారిశుద్ధ్య కార్మికులకు జీతాల పెంపు ద్వారా ముఖ్యమంత్రి సరైన గుర్తింపు ఇచ్చారని పేర్కొన్నారు.

జీహెచ్‌ఎంసీలో 226 పోస్టుల భర్తీ.. జీహెచ్‌ఎంసీలో 226 పోస్టుల భర్తీకి ప్రభుత్వం మంగళవారం పచ్చజెండా ఊపింది. 200 మంది టౌన్ ప్లానింగ్ సర్వేయర్లు, 26 మంది ఫుడ్ ఇన్స్‌పెక్టర్లను నియమించడానికి జీవో జారీచేసింది. ఈ నియామకాల్ని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో స్థానికత, జోన్, రాష్ట్రస్థాయి కేటగిరీల విభజన, రోస్టర్ పాయింట్లు, రాష్ట్రపతి ఆదేశాల అనుసారం ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం పేర్కొంది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.