Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఉవ్వెత్తున ప్రచారం

-డప్పుచప్పుళ్లు, నృత్యాల హోరుతో మారుమోగుతున్న గ్రామాలు
-ప్రచారంలో వేగం పెంచిన టీఆర్‌ఎస్ అభ్యర్థులు
-ఓటర్లను కలుస్తూ..

ప్రభుత్వ పథకాలు వివరిస్తూ ముందుకు..
తెలంగాణ రాష్ట్ర స మితి అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో సై తం పర్యటిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. ప్రభు త్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. ఈ సందర్భం గా గ్రామస్థులు, టీఆర్‌ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ లు, డప్పుచప్పుళ్లు, నృత్యాలతో సందడి వాతావరణం సృష్టిస్తున్నారు.

టీఆర్‌ఎస్ గెలుపు చారిత్రక అవసరం..

టీఆర్‌ఎస్ గెలుపు చారిత్రక అవసరమని మంత్రి లకా్ష్మరెడ్డి అభిప్రాయపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం కాకర్‌జాల, తీగల్‌పల్లి గ్రామంలో సోమవారం ఎన్నికల ప్రచారం లో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో సమైక్యపాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని, నాలుగేండ్లలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా గుర్తింపుపొందామని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి కావాలంటే మరోసారి కేసీఆరే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలన్నారు. నారాయణపేట అభ్యర్థి రాజేందర్‌రెడ్డి మండలంలోని జాజాపూర్‌లో కో స్గి మండలం బోంరాస్‌పేటలో పట్నం నరేందర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మక్తల్ మండలం కుమారులింగంపల్లి, కృష్ణ మండలం కుసుమూర్తిలో చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి మద్దతు గా చిట్టెం సుచరితారెడ్డి ప్రచారం చేశారు. దేవరకద్ర నియోజకవర్గం సీసీకుంట మండలంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి మద్దతుగా స్వర్ణ సుధాకర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. వ నపర్తి జిల్లా మదనాపురం మండలంలో దేవరక ద్ర అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి విస్తృతంగా పర్యటించి, ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భం గా నర్సింగాపురం గ్రామానికి చెందిన కరీమాబేగం అనే వితంతువు తన పింఛన్ డబ్బులను ఎన్నికల ఖర్చు కోసం ఆలకు అందజేసింది.

నాగర్‌కర్నూల్‌లో మంత్రి జూపల్లి..

నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం దేదినేనిపల్లి తండాలో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రచారం చేశారు. టీఆర్‌ఎస్ హయాంలో ప్రభు త్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే పార్టీ ని గెలిపిస్తాయని ధీమా వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా తండావాసులంతా టీఆర్‌ఎస్‌కు అండ గా ఉంటామని వెల్లడిస్తూ మద్దతు ప్రకటించా రు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం బ్రాహ్మణ్‌పల్లి, కిష్టాపూర్, అన్నారం, నాగంపల్లి గ్రామా ల్లో జుక్కల్ అభ్యర్థి హన్మంత్‌షిండే ప్రచారం చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ అభ్యర్థి అబ్రహం ఉండవెల్లి మండలం కంచుపాడులో ఎన్నికల ప్రచారం చేశారు.

రసమయి ప్రచారం..

కరీంనగర్ జిల్లా మానకొండూర్ అభ్యర్థి రసమ యి బాలకిషన్ సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి సదాశివపల్లిలో ప్రచారం చేశారు. మహిళలు, వృద్ధులను ఆప్యాయంగా పలుకరి స్తూ ఓట్లు అభ్యర్థించారు. గంగాధర మండలం కొండపల్లిలో టీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షు డు సుంకె రవిశంకర్ ప్రచారం చేశారు. పెద్దపల్లి అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి కాల్వశ్రీరాంపూర్ మండలంలో ప్రచారం చేశారు. ఆదిలాబాద్ జి ల్లా ఖానాపూర్ అభ్యర్థి రేఖానాయక్ ఉట్నూర్ మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా రు. మహబూబాబాద్ అభ్యర్థి బానోత్ శంకర్‌నాయక్ సింగారం, జంగిలిగొండ, బేతోలు, ర జాలిపేట గ్రామాల్లో ప్రచారం చేశారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బూడిదంపా డులో పువ్వాడ అజయ్‌కుమార్ ప్రచారం చేశా రు. సత్తుపల్లిలో పిడమర్తి రవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. డప్పు వాయిద్యాలు, మ హిళల కోలాటాలు, జెండాలతో పట్టణమంతా గులాబీమయమైంది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో..

ఉమ్మడి నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలో నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి మిర్యాలగూడ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు విస్తృత ప్రచారం నిర్వహించారు. సూ ర్యాపేట అభ్యర్థి, మంత్రి జగదీశ్‌రెడ్డికి మద్దతుగా పెన్‌పహాడ్ మండలంలో టీఆర్‌ఎస్వీ నాయకు లు పాదయాత్ర కొనసాగించారు. తుంగతుర్తి అ భ్యర్థి గాదరి కిశోర్‌కుమార్ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం రాజన్నగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మద్దిరాల, నాగారం మండలాల్లో కిశోర్ విజయాన్ని కాంక్షి స్తూ టీఆర్‌ఎస్ నాయకులు ప్రచారం చేపట్టారు. డిండి మండలంలోని కందుకూరు, శాంతిగూ డెం, రహమంతాపురం గ్రామాల్లో దేవరకొండ అభ్యర్థి రమావత్ రవీందర్ కుమార్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. నార్కట్‌పల్లి మండలం శాపె ల్లి, రాజకుంట గ్రామాల్లో నకిరేకల్ అభ్యర్థి వేము ల వీరేశం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నల్లగొండ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి పట్టణంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు.

చరిత్రలో నిలిచే పథకాలు.. మంత్రి పోచారం

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చరిత్రలో ని లిచిపోయేలా టీఆర్‌ఎస్ సర్కారు పథకాలు, సం క్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో నిర్వహించిన టీఆర్‌ఎస్ పార్టీ బూత్ కమిటీ సభ్యుల స మావేశానికి మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి పోచారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు, కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రైతులకు మేలు చేసింది కేసీఆర్ ఒక్కరే అన్నారు. ఇ లాంటి సీఎం ఉండటం తెలంగాణ రైతాంగం అ దృష్టమన్నారు. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్థి బిగాల గణేశ్‌గుప్తా నగరంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ అభ్యర్థి బాల్క సు మన్ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌తో కలిసి జైపూర్ మండలంలో విస్తృతంగా ప్రచారం చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో యాదవసంఘం, నారాపూర్‌లో కాపు సంఘం, అంబేద్కర్ సంఘం నాయకులు సిరిసిల్ల అభ్యర్థి, మంత్రి కేసీఆర్‌కు మద్దతు ప్రకటించారు. గంభీరావుపేటలో ముదిరాజ్, ఎస్సీ, పూసలసంఘం సభ్యులను కలిసి టెస్కాబ్ చైర్మ న్ కొండూరి రవీందర్‌రావు ప్రచారం చేశారు. వేములవాడ అభ్యర్థి రమేశ్‌బాబు పట్టణంతోపాటు, ఆరెపల్లి, సంకేపల్లి, చెక్కపల్లి, లాలపల్లి తదితరగ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంటింటా తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డికి సదాశివనగర్ మండలం ధర్మారావుపేట గ్రామస్థులు, తాడ్వాయి మండల పరిధిలోని ఎర్రాపహాడ్ గ్రామానికి చెందిన కురుమ సంఘం సభ్యులు మద్దతు ప్రకటించారు.

నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు మంత్రి కేటీఆర్ రాక

మంత్రి కేటీఆర్ మంగళవారం స్టేషన్ ఘన్‌పూర్‌కు రానున్నారు. స్థానిక వి ద్యాజ్యోతి డిగ్రీ కళాశాలలో మధ్యాహ్నం 3 గంటలకు ఏ ర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పా ల్గొంటారు. స్టేషన్‌ఘన్‌పూర్ అభ్యర్థి తాటికొండ రాజయ్య గెలుపు కోసం ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యనాయకులు, కార్యకర్తలతో చర్చించి, దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీలు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గ్యాదరి బాలమల్లు తదితరులు పాల్గొంటారు.

వార్ వన్‌సైడే.. లెక్కే తేలాల్సి ఉంది: మంత్రి హరీశ్

తెలంగాణపై ఏపీ సీఎం చంద్రబాబు పెత్తనాలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఇంటింటి ప్రచారం చేశారు. చేర్యాలలో జనగామ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్‌సైడేనని, గెలిచే సీట్లు 100, 105 అన్న లెక్క తేలాల్సి ఉన్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు చేయి పట్టుకుని ముందుకు నడుస్తున్నదని, తె లంగాణకు ద్రోహం చేసే పార్టీతో జతకడితే రాష్ట్ర భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చేతుల్లోనే రాష్ట్రం పదిలంగా ఉంటుందన్నారు. త్యాగాల పునాదులపై నిర్మించుకున్న తెలంగాణను పరిరక్షించుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్‌కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపుకోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, బొడకుంటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్ విజయాన్ని బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ వంద సీట్లు సాధిస్తుందని, మరోసారి కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ విజయాన్ని బ్రహ్మదేవుడు కూడా ఆపలేడని అన్నారు. సోమవారం ఖమ్మంలోని ఎస్‌ఆర్ గార్డెన్‌లో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పువ్వాడ అజయ్‌కుమార్ గెలుపును కాంక్షిస్తూ ముఖ్యనాయకు లు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తుమ్మల మాట్లాడుతూ..దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందన్నారు. రాజకీయాలకతీతంగా అన్ని వర్గాలను సమానంగా ఆదరించిన ఏకైక పార్టీ టీఆర్‌ఎస్సేనని పేర్కొన్నారు. ముఖ్యనాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషిచేయాలని సూచించారు.

టీఆర్‌ఎస్ పాలనలో రైతులకు మంచిరోజులు: మంత్రి జూపల్లి

టీఆర్‌ఎస్ పాలనలో పాలమూరు రైతులకు మంచి రోజులు వచ్చాయని, శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కేతేపల్లి, కల్వరాల, పుల్గర్‌చర్ల గ్రామాల మధ్యనున్న ఎంజీకేఎల్‌ఐ, భీమా కాల్వలను మంత్రి జూపల్లి పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఆయకట్టు పంటలకు నీరందటం లేదని మంత్రి దృష్టికి తీసుకురాగా.. ఎంజీకేఎల్‌ఐ కాల్వ బ్యాంకింగ్ పెంచి భీమా కాల్వకు అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సబ్‌మైనర్ కాల్వల మరమ్మతులకు రైతులు సహకరించాలని కోరారు.

పాలమూరు గోస తీరింది..

సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో పాలమూరు గోస తీరిందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా మదనాపురం మండలం నెలివిడి తండాలో సోమవారం ఎన్నికల ప్రచారం చేశారు. అక్కడున్న గిరిజనులు ఆలతో మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన రైతుబంధు పథకం తమకు ఎంతో మేలు చేసిందని తెలిపారు. నాట్ల సమయంలో పెట్టుబడులకోసం అప్పులు చేసేవాళ్లమని, ప్రభుత్వం ఎకరాకు రూ.4వేలు ఇవ్వడంతో సంతోషంగా వరినాట్లు వేసుకున్నామని చెప్పారు. అక్కడ సాగవుతున్న పైర్లను చూసి ఆల ఆనందం వ్యక్తం చేశారు. మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రాబోతున్నదని, వచ్చే వానాకాలం నుంచి ఎకరాకు రూ.5 వేలు ఇస్తున్నట్టు చెప్పగా గిరిజనులు హర్షం వ్యక్తంచేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.