Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

వారంలోగా ఎర్రజొన్న బకాయిలు చెల్లింపు

– సర్వే పూర్తికాగానే బీడీ కార్మికులకు రూ.వెయ్యి భృతి – త్వరలోనే బ్యాంకులకు రైతురుణ బకాయిలు – దీపావళి నాటికి వృద్దులు, వితంతువులకు పెన్షన్లు – ఇండ్ల నిర్మాణ వ్యయం రూ. 3.50 లక్షలకు పెంపు – స్కూల్ పిల్లల్ని రోడ్డుపైకి తేవడం బ్యాన్ – ఆర్మూర్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్

KCR 0001

ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల భృతిని త్వరలోనే అమలు చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. బీడీ కార్మికుల సంఖ్య తదితర వివరాల సేకరణ జరుగుతున్నదని ఆ వివరాలు అందగానే వెయ్యి రూపాయల భృతి నెలనెలా పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో గురువారం రూ.114 కోట్లతో చేపట్టనున్న తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం స్థానిక ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.

ఈ స్కీం సంవత్సరంలోగా పూర్తిచేసి మళ్లీ తానే వచ్చి ప్రారంభిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. గత ఎన్నికల సమయంలో వచ్చి టీఆర్‌ఎస్ పార్టీని గెలిపిస్తే రైతులకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వ పక్షాన అందిస్తమని చెప్పినం. ఆ మాటకు నిలబడి రూ.11 కోట్ల ఎర్రజొన్న బకాయిలు ఇక్కడ్నే మంజూరు చేస్తున్న. మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్ స్వయానా మీ ఇంటికే వచ్చి వారం నాటికి డబ్బులు ఇస్తరు. డబ్బుల కోసం ఎక్కడికి తిరిగే అవసరం లేదు. ఆఫీసుల పొంట తిరిగే పని లేదు. మీ గ్రామాలలో కడప ముందటికి వచ్చి చెక్కులు ఇస్తరు అని కేసీఆర్ చెప్పారు. ఆర్మూర్‌లో వంద పడకల ఆసుపత్రిని ఈ రోజే సాంక్షన్ చేస్తున్నానని ప్రకటించారు. న్యాయవాదుల డిమాండ్ మేరకు ఆర్మూర్‌లో సబ్‌జడ్జి కోర్టు కోర్టు కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడి మంజూరు చేయిస్తానని చెప్పారు.

రైతు రుణాలు త్వరలో మాపీ.. గతంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు రైతుల రుణాలను అల్‌రెడీ మాఫీ చేయడం జరిగింది. దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తాం. రాబోయే కొద్ది రోజుల్లో ఆ రుణాలన్నీ బ్యాంకులకు తిరిగి చెల్లించబడతాయి. మీ రుణాలు మాఫీ అయిపోతాయి. రిజర్వ్ బ్యాంకు వాళ్లు చిన్న చిన్న ఇబ్బందులు పెడ్త ఉన్నరు. దాని కోసం క్యాబినెట్‌లో అల్‌రెడీ గవర్నమెంట్ తీర్మానం చేసి ఆర్థిక శాఖకు, వ్యవసాయ శాఖకు అప్పగించడం జరిగింది. మంత్రి పోచారం ఆధ్వర్యంలో యావత్ తెలంగాణ రైతాంగానికి 39 లక్షల రైతు కుటుంబాలకు 19 వేల కోట్ల రూపాయలను మాఫీ చేసినం. అదేవిధంగా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం ఆటో రిక్షాలకు పన్ను అల్‌రెడీ రద్దు చేయడం జరిగింది. రైతులు వాడుకునే ట్రాక్టర్లు , ట్రాక్టర్ల ట్రాలీలు గాని పన్ను మాఫీ చేస్తమని చెప్పినం. వాటి మీద కూడా పన్ను మాఫీ చేయడం జరిగింది అని వివరించారు.

దసరా దీపావళినుంచి పెన్షన్లు… వృద్ధులకు, వితంతువులకు వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తమని చెప్పినం. దసరా నుండి దీపావళి మధ్య కొత్త కార్డులు అందజేసి వెయ్యి రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. వికలాంగులకు 1500 రూపాయల పెన్షన్ కూడా దసరా నుండి దీపావళి మధ్య ప్రారంభమవుతుంది. బలహీనవర్గాల గృహ నిర్మాణంలో గత ప్రభుత్వాలు అవలంభించిన తప్పుడు విధానాల వల్ల అనేక వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది. అక్రమార్కులెవరైనా వదిలిపెట్టొద్దని సీఐడీ ఎంక్వైరీ పెట్టినం. ఎంక్వైరీ జరిగిన తర్వాత పేదలకు రెండు బెడ్‌రూమ్‌లు, ఒక వంటగది మూడు లక్షలతోటి కట్టిస్తమన్నమో ఇప్పుడు మూడు లక్షలు కాదు సిమెంట్ ధరలు పెరగడం వల్ల మూడు లక్షల 50 వేల తోటి ఆ ఇండ్లు నిర్మాణం చేసి ఇస్తం.

దళిత పిల్లలు, గిరిజన పిల్లలు పెండ్లి సందర్భంలో ఇబ్బంది పడుత ఉంటరు. కాబట్టి దళిత అమ్మాయిల పెండ్లి కోసం, లంబాడా గిరిజనుల ఆడబిడ్డల పెండ్లి కోసం, ఆదివాసీ బిడ్డల పెండ్లి కోసం కల్యాణలక్ష్మి అనే పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రభుత్వం 50 వేల రూపాయలు ఈ కళ్యాణ లక్ష్మీ ద్వారా అందిస్తుంది. గ్రామీణ మంచినీటి సరపరా విషయంలో డ్రింకింగ్ వాటర్‌గ్రిడ్ ఏర్పాటుచేసి ప్రతి మారుమూల పల్లెకు, లంబాడి తండాకు, ప్రతి మూడు గుడిసెల పల్లెకు కూడా సరఫరాను చేయడం జరుగుతుంది.

19 నాడు ఇండ్లు కదలొద్దు… గతంలో భారతదేశ చరిత్రలో గతంలో ఎన్నడు జరగని విధంగా ఈనెల 19వ తేదీన చేపట్టడం జరిగింది. ఆ రోజు మొత్తం ఆర్టీసీ బస్సులు బందుంటయి. ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులు, ప్రైవేట్ జీబులు, కార్లు కూడా బందుంటయి. ఎదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఇతర వాహనాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. ఎలక్షన్ టైంలో ఎైట్లెతే అధికారులు గ్రామగ్రామానికి వస్తుంటారో అ విధంగా 19వ తేదీనాడు మీమీ గ్రామాలకు ఇండ్లకు అధికారులు వస్తున్నరు. దయచేసి ఆ రోజు ఇండ్లు కదలవద్దు. ఒకవేళ పెండ్లిలు పెట్టుకున్న రద్దు చేసుకొని మరో డేటు పెట్టుకోండి. అందరు ఇంటికాడనే ఉండి మీ పేర్లు రాయించుకుంటే భవిష్యత్‌లో మీకే లాభం జరుగుతది. అది మన తెలంగాణ రాష్ర్టానికి, సమాజానికి బాగుంటది.

దళితుకు మూడెకరాలు పంద్రాగస్టునుంచే… దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామిన చెప్పిన ప్రకారం ఈ పంద్రాగష్టు నాడు భూమలు ఇస్తున్నం. తెలంగాణవ్యాప్తంగా నాలుగైదు వేల మందికి వచ్చినా సరే ఆ పథకాన్ని ఫిఫ్టీంత్ నాడే లాంచ్ చేస్తం. ఈ రోజు హైదరాబాద్ నుండి వస్తూ ఆ ఫైల్ మీదనే సంతకం చేసి రావడం జరిగింది. బోర్‌వెల్ ప్రభుత్వమే వేయిస్తది, కరెంట్ మోటార్ కూడ ప్రభుత్వమే కొనిస్తది. సంవత్సరానికి అవసరమయ్యే పెట్టుబడి కూడా ప్రభుత్వమే సమకూరుస్తది. ఆర్మూర్‌లో మంచి మున్సిపాలిటీ ఆఫీసు నిర్మాణానికి త్వరలోనే సాంక్షన్ చేస్త.

స్కూలు పిల్లలను రోడ్లమీదికి తేవడం బ్యాన్… రాష్ట్ర అధికారులకు ఆర్మూర్ వేదిక నుండి చెబుతున్నా. ఈరోజునుంచి స్కూలు పిల్లలను మంత్రులు, ముఖ్యమంత్రుల కార్యక్రమాల కోసం రోడ్ల మీదికి తేవద్దు. అది బ్యాన్ చేస్తున్నం. పిల్లలను ఎండలో నిలబెట్టి బాధ పెడ్తున్నరు. అది సరికాదు. నేనురాష్ట్రంలో ఎక్కడ పర్యటనకు వచ్చినా దయచేసి స్కూల్ పిల్లలను ఎండలో నిలబెట్టవద్దని ప్రార్థిస్తున్నా. ఈరోజు చిన్న పిల్లలు రోడ్డు మీద నిల్చుంటే బాధ కలిగింది.

కేసీఆర్‌లాంటి సీఎంను చూడలేదు… ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్‌కు సాటిలేరని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తన 38 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎందరో ముఖ్యమంత్రులను, ఎన్నోప్రభుత్వాలను చూశాను గానీ కేసీఆర్ లాగా చెప్పిన మాటకు కట్టుబడి చేసిన వాగ్ధానాలను నెరవేర్చిన వారు ఎవరు లేరన్నారు. జూన్ 2న ప్రభుత్వం ఏర్పాటు కాగా జూలై 16న కేబినెట్‌లో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను ప్రవేశపెట్టి సుదీర్ఘంగా చర్చించి వాటిని అమలుచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, ప్రశాంత్‌రెడ్డి, హన్మంత్ షిండే, షకీల్, గణేశ్ గుప్తా, జడ్పీ చైర్మన్ దఫెదార్ రాజు, ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్, వైస్ చైర్మన్ మోత్కూరి లింగాగౌడ్, కలెక్టర్ రొనాల్డ్ రాస్ పాల్గొన్నారు.

ప్రపంచ మహిళ బాక్సింగ్ చాంపియన్ – నిఖత్‌కు రూ.50 లక్షల నగదు పురస్కారం ప్రపంచ మహిళ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణపతకాలు సాధించిన నిఖత్ జరీన్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి రూ. 50 లక్షల నగదుపురస్కారాన్ని ప్రకటించారు. గురువారం జిల్లా పర్యటనలోభాగంగా మండలంలోని బోర్గాం(పీ) గ్రామంలో పద్మావతి కల్యాణ మండపంలో జరిగిన అధికారుల సమావేశం అనంతరం నిఖత్ జరీన్‌ను సీఎం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకటించిన నగదు పురస్కారాన్ని ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో సందర్భంగా నిఖత్‌కు అందించనున్నామన్నారు. అంతర్జాతీయస్థాయిలో పతకాలు, ప్రతిభ కనబర్చిన తెలంగాణ క్రీడాకారులను ఎంపికచేసి ఈనెల 15న గోల్కొండకోటలో సన్మానిస్తామని చెప్పారు.

ప్రతిభ, నైపుణ్యతలు ఉన్నవారిని గుర్తించి ప్రభుత్వం ఈ విధంగా ప్రోత్సహించడం తన అదృష్టమని నిఖత్‌జరీన్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఇలాంటి ప్రోత్సహకాలు అందజేస్తే మరెంతో మంది క్రీడాకారులకు వెలుగులోకి వస్తారని ఆమె అన్నారు. నగదు పురస్కారాన్ని ప్రకటించిన సీఎం కేసీఆర్, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవిత, కలెక్టర్, ఎమ్మెల్యేలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిఖత్ జరీన్ తల్లిదండ్రులు పర్వీన్ సుల్తానా, జమీల్ అహ్మద్ పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.