-కాంగ్రెస్, టీడీపీ పగటి కలలు ఫలించవు గణపురం: సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తెలంగాణలో టీఆర్ఎస్ అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు కైవసం చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీడీపీ నేతలకు ప్రజలు ఓటుద్వారా గుణపాఠం చెప్పారని, అధికారంలోకి వస్తామని వారు పగటికలలు కంటున్నారని ఎద్దేవాచేశారు
.
ఆదివారం వరంగల్ జిల్లా గణపురంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టారని, మెజార్టీ స్థానాల్లో గులాబీ అభ్యర్థులు గెలుపొందుతారని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు టీఆర్ఎస్తోనే జరిగిందని, ఈ విషయం ఆంధ్రా పార్టీలైనా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీకి ఓట్ల లెక్కింపు అనంతరం అర్థమవుతుందన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో మధుసూదనాచారి గెలుపొందడంతోపాటు మిగతా అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.