Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

వచ్చేది శబ్దవిప్లవమే

-రాష్ట్రమంతటా టీఆర్‌ఎస్ వేవ్
-జిల్లా సభల్లా నియోజకవర్గ సభలు: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
-ఎన్నికల తర్వాత ఉద్యోగులకు సముచితంగా ఐఆర్, ఫిట్‌మెంట్లు
-పదవీ విరమణ వయసు పెంచుతాం
-60 ఏండ్లా.. 61 ఏండ్లా అన్నది మ్యానిఫెస్టో కమిటీలో నిర్ణయిస్తాం
-ప్రతి సభలో జనజాతరే..
-ఎవరి పాలన ఎలాఉందో ఊళ్లల్లో చర్చ చేయాలి
-రెండు లక్షల రుణమాఫీ డంబాచారమే
-ఎన్నికల అనంతరం ప్రతి నియోజకవర్గానికి సీనియర్ అధికారులను పంపుతాం
-సమస్యలు పరిశీలించి.. పరిష్కరిస్తాం
-బీడీ కార్మికులకు 2014 కటాఫ్ తీసేసి పీఎఫ్ ఇస్తం
-ఎన్నికల ప్రచార సభల్లో సీఎం కేసీఆర్

రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వస్తదని కొందరు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారని, కానీ.. రాబోయేది శబ్ద విప్లవమేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ విషయాన్ని టీఆర్‌ఎస్ సభలకు భారీగా హాజరవుతున్న జనసందోహమే చెప్తున్నదని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత ఉద్యోగులకు సబబైన, సముచితమైన ఐఆర్, ఫిట్‌మెంట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. పదవీ విరమణ వయసు పెంచాలని కొన్ని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయని చెప్పిన కేసీఆర్.. పదవీవిరమణ వయస్సు అరవై ఏండ్లు చేయాలా? అరవై ఒక్క సంవత్సరాలు చేయాలా అనే విషయాన్ని మ్యానిఫెస్టో కమిటీలో నిర్ణయం తీసుకుని ప్రకటిస్తామని తెలిపారు. గురువారం ఖానాపూర్, ఇచ్చోడ, నిర్మల్, ముథోల్, ఆర్మూర్‌లో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాలు, వర్గాల్లో.. అందరి ముఖాల్లో చిరునవ్వులు చూడాలని.. అలాంటి చిరునవ్వుల తెలంగాణే తన లక్ష్యమని స్పష్టంచేశారు. తెలంగాణకు అన్యాయంచేసిన చంద్రబాబును తన్ని తరిమేశానని, ఇప్పుడు తరిమేసే బాధ్యత ప్రజలదేనని చెప్పారు. కూటమిలో పార్టీకో మ్యానిఫెస్టో ఉందన్న సీఎం.. చివరకు ఏది అమలుచేస్తారో ఎట్ల నమ్మాలి? అని ప్రశ్నించారు. ఎవరు సీఎం అయితరోగూడ ఢిల్లీ నుంచి లిఫాపల రావాల్సి ఉంటదని అన్నారు. పచ్చి తెలంగాణవ్యతిరేకి అయిన చంద్రబాబు పెత్తనం మనకు అవసరమా? అని కేసీఆర్ ప్రశ్నించారు. బక్క పేదోడైన కేసీఆర్‌ను కొట్టేందుకు తెలంగాణ కాంగ్రెస్ వాళ్లకు శక్తిచాలక ఆంధ్రాకుపోయి చంద్రబాబునాయుడును తోలుకువస్తున్నరని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ నాయకులు డంబాచారాల కోసం రూ.2 లక్షల

రుణమాఫీ ప్రకటిస్తున్నారని, వాస్తవానికి రూ.2 లక్షల రుణాలు ఉన్న రైతులు రెండు మూడు శాతం కూడా ఉండరని అన్నారు. కేసీఆర్ ఉన్నంతకాలం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందితీరుతుందని స్పష్టంచేశారు. ఎన్నికల తరువాత ఒక్కొక్క రోజు ఒక నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులను తీసుకొచ్చి స్థానిక సమస్యలను తెలుసుకుని పరిష్కారం చూపుతామని తెలిపారు. బీడీ కార్మికులకు 2015 కటాఫ్‌ను తీసేసి.. అందరికీ పీఎఫ్ ఇస్తామని ప్రకటించారు. టీఆర్‌ఎస్ ఓడిపోతే నష్టపోయేది తెలంగాణేనని అన్నారు. ప్రజలు గెలిచే రాజకీయం వస్తేనే అందరూ బాగుపడుతారన్న సీఎం.. ప్రజల హక్కులు గౌరవించే పద్ధతి రావాలని ఆకాంక్షించారు. 58 ఏండ్లలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు చేసింది, నాలుగున్నరేండ్లలోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించింది ప్రజల కండ్ల ముందే ఉన్నదన్న సీఎం.. ఎవరి పాలనలో అభివృద్ధి ఎలా ఉన్నదో ఊళ్లకుపోయిన తర్వాత చర్చకు పెట్టాలని, ఎవరిని ఎన్నుకుంటే కరెక్టో వారినే గెలిపించాలని కోరారు.

మోదీ ప్రభుత్వం విఫలం
-రిజర్వేషన్లపై ప్రధాని స్పందించలేదు
-కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వంతోనే మన రాష్ట్ర సమస్యలకు పరిష్కారం
-కేంద్రంలో ఫెడరల్‌ఫ్రంట్ ప్రభుత్వం రావాలి
-నిర్మల్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పైలట్ ప్రాజెక్టు
-నిర్మల్ ఎన్నికల ప్రచారసభలో సీఎం కేసీఆర్

ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్రప్రభుత్వం విఫలమైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. ఎస్టీ, ముస్లిం రిజర్వేషన్లపై అసెంబ్లీలో, క్యాబినెట్‌లో తీర్మానాలుచేసి పంపినా, లేఖలురాసినా ప్రధాని స్పందించడంలేదని చెప్పారు. కేసీఆర్ పట్టుపడితే సాధించినదాకా వదులడు. తెలంగాణ సాధించా. ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్లు కూడా సాధించితీరుతం అని స్పష్టంచేశారు. మోదీకి హిందూ-ముస్లిం బీమారీ ఉన్నది. ప్రధానమంత్రికి విశాల దృక్పథంలేదు. రిజర్వేషన్లు మోదీ జాగీరుకాదు అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయలేదు. అందుకే కేంద్రంలో నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలి. అప్పుడే రాష్ర్టాల హక్కులు సాధించుకుంటం. ఈ బీమారీ పోవాలంటే కేంద్రంలో బలమైన ఫెడరల్‌ఫ్రంట్ ప్రభుత్వం రావాలి.

తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలు టీఆర్‌ఎస్ గెలిస్తే కేంద్రంలో రాష్ర్టాలకు దక్కాల్సిన హక్కులను సాధించవవచ్చు అని కేసీఆర్ చెప్పారు. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్.. టీడీపీ నాయకుడు చంద్రబాబైతే హైదరాబాద్‌ను నేనే కట్టాను అంటడు. హైదరాబాద్‌ను చంద్రబాబు కడితే కులీకుతుబ్‌షా ఏం చేయాలి? ఆత్మహత్య చేసుకోవాల్నా? ఇట్లా అడ్డం పొడువు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతరు అన్నారు. నిర్మల్ సభ చూస్తే.. రాష్ట్రంలో వచ్చేది శబ్ద విప్లవమే అని అర్థం అవుతున్నదని, పెద్ద మెజారిటీతో ఇంద్రకరణ్‌రెడ్డి గెలిచిపోయిండని అన్నారు. బీడీ కార్మికులు నిర్మల్ ప్రాంతంలో కూడా దండిగా ఉన్నరు. ఒక్క నిర్మల్‌లో 66,829 మంది ఆసరా పింఛన్ల లబ్ధిదారులున్నరు. వీరు, వీరిండ్ల నుంచి ఓట్లువేస్తే.. ఇంద్రకరణ్‌రెడ్డి గెలిచినట్టే అని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నిర్మల్‌లో నిర్వహించిన భారీ బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ఆయన మాటల్లోనే..

నిర్మల్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పైలట్ ప్రాజెక్టు
తెలంగాణ మొత్తం అండర్ డ్రైనేజీ వ్యవస్థ ఉండాలని నా కోరిక. గజ్వేల్‌ను పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని నిర్ణయించాం. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కోరికమేరకు నిర్మల్ పట్టణంతోపాటు మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని పూర్తిచేస్తం. ఆదిలాబాద్ జిల్లా నాలుగు జిల్లాలుగా మారిందంటే ప్రధానకారణం మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్నలే. ఆదిలాబాద్ జిల్లాలో మిషన్‌భగరథ పూర్తవుతదని ఎవరూ ఉహించలేదు. కానీ.. 90% పనులు పూర్తయ్యాయి. మిగిలిన పదిశాతం ఒకటిరెండు నెలల్లో పూర్తవుతది.

ఇబ్బందులున్నా.. తట్టుకుని నిలబడ్డాం
తెలంగాణ రాష్ట్రమైనప్పుడు అంతా గందరగోళం. అధికారులు లేరు. ఆంధ్రవాళ్లు పెట్టే పంచాయితీ! నరేంద్రమోదీ మనకు సహకరించలే. అయినప్పటికీ తట్టుకుని నిలబడి, పరిపాలన మొదలుపెట్టాం.

ముస్లిం సంక్షేమానికి కృషిచేస్తున్నం
ముస్లింల సంక్షేమానికి 60 ఏండ్ల నుంచి ఏ పార్టీ ఏమీ చేయలేదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాటల్లో కాదు, ముస్లిం మైనార్టీల సంక్షేమాన్ని చేతల్లో చూపాం. హైదరాబాద్ నాంపల్లి చౌరస్తాలో అనీసుల్ గుర్బా ఇమారత్ ఉంది. దానికి స్థలం ఇవ్వాలని ముస్లిం పెద్దలు ఎన్నో ఏండ్ల నుంచి అడుగుతున్నరు. ఏ ప్రభుత్వాలు ఇవ్వలేదు. కానీ నన్ను అడుగగానే ఒక్క నిమిషంలో ఎకరా భూమి మంజూరుచేసిన. 30-40కోట్ల రూపాయలతో హైదరాబాద్‌లో ఏడంతస్తుల భవనం అద్భుతంగా నిర్మితమవుతుంది.

ఆంధ్రోళ్ల కల్చర్ వేరు.. మన కల్చర్ వేరు
గతంలో ఉమ్మడి రాష్ర్టానికి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ముస్లిం సంప్రదాయాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బందిపడిన విషయం గుర్తొస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది. టీడీపీ ప్రభుత్వహయాంలో రంజన్ సందర్భంగా అప్పటి సీఎం చంద్రబాబుతో కలిసివచ్చాం. ముస్లింలకు శుభాకాంక్షలు ఉర్దూలో చెప్పాలని.. ఈద్ ముబారక్ అని చెప్పమన్న. కానీ.. ఆయన మర్చిపోయి.. సభలో ఈద్ ముబారక్ బదులు.. ఊద్ ముబారక్ అన్నడు. ఆంధ్రోళ్ల కల్చర్ వేరు. మన కల్చర్ వేరు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.