Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

వద్దన్నదాక నీళ్లుంటయి

-బాల్కొండలో 1.10 లక్షల ఎకరాలకు సాగునీళ్లు ఇచ్చే బాధ్యత నాది
-ఆర్మూర్, బాల్కొండలో బ్రహ్మాండమైన రైతులున్నరు
-మోర్తాడ్ ప్రజాఆశీర్వాదసభలో కేసీఆర్

బాల్కొండ నియోజకవర్గానికి వద్దన్నదాక నీళ్లుంటాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. లక్ష్మీకాల్వ కావచ్చు, కాకతీయకాల్వ కావచ్చు, వరదకాల్వ కావచ్చు, ఎస్సారెస్పీ ఫుల్‌గా ఉన్న తరువాత నీళ్లకు తక్కువెందుకు ఉంటదండీ.. సమస్యనే లేదు అని భరోసానిచ్చారు. సోమవారం మోర్తాడ్‌లో నిర్వహించిన బాల్కొండ నియోజకవర్గ ప్రజాఆశీర్వాదసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ రోజు అనేక పనులు చేసి, ఇంకా చేసే అభిలాషతో టీఆర్‌ఎస్ ఉందన్నారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..

మెదక్ నీళ్ళు.. మహారాష్ట్ర నీళ్ళు ఉంటయా?
సురేశ్‌రెడ్డి, నేను హెలికాప్టర్‌లో నిజాంసాగర్ ఆయకట్టు.. చెరువులు వాగులు, పెద్దవాగుమీద చెక్‌డ్యామ్‌లు, అక్విడక్ట్ అన్నీ చూసుకుంట వస్తున్నం. ఒక ప్రయత్నం సిన్సియర్‌గా చేసినం. ఈ విషయాన్ని గమనించాలి, కాంగ్రెస్ ఎంత కిరికిరి రాజకీయం చేస్తదంటే, పోయినేడాది నిజాంసాగర్ కింద పంటలు పండాలె.. నిజాంసాగర్‌కు నీళ్లురాలేదు. మీద సింగూర్‌లో వచ్చినవి. ఏం చేసినం.. సింగూర్‌లకెళ్లి నీళ్లుతెచ్చి నిజాంసాగర్‌ల నీళ్లుపెట్టి.. బొట్టుబొట్టు వాడి రెండులక్షల ఎకరాలల్ల పంటలు పండించినం. ఈ కాంగ్రెస్ నాయకులు అప్పుడేం చేసిండ్రు? మెదక్‌జిల్లా జహీరాబాద్‌ల ధర్నాలు చేసిండ్రు. మెదక్ జిల్లాల మెదక్ నీళ్లు ఉంటయా ఎక్కడన్నా! మెదక్ నీళ్లు, మహారాష్ట్ర నీళ్లు ఉంటయా? సంపుడు సంపితే వాన గోదావరి కొట్టుడు కొడితే చెంబట్కపోయే దాక కొడ్తది. అంతేకదా! ఈ నీళ్లు.. ఆ నీళ్లు ఉంటాయా? ఎంత కిరికిరి రాజకీయం? ఇప్పుడు ఎస్సారెస్పీల నీళ్లున్నయి. వందశాతం మీ పంటలు పండిస్తం. ఈడనే కాదు.. బాల్కొండ, జగిత్యాల, మెట్‌పల్లిల కూడా పారాలె. 42, 43 టీఎంసీల నీళ్లున్నయి. కొన్నినీళ్లు కింద కూడ ఇవ్వాలె కదా! వాళ్లు కూడ బతకాలె కదా! మంచినీళ్లు కావద్దా? వాళ్లు రైతులు కాదా? వాళ్లు వేరేనా? అమెరికానా? పాకిస్థానా? దాన్ని కూడ రాజకీయం చేస్తున్నరు. దయచేసి ఆలోచన చేయాలె. తెలంగాణల ఏ ఊరైనా, ఏ పల్లె అయినా మనదే.. ఈ లంగ రాజకీయం ఎన్ని రోజులండీ.

వరద కాల్వను రిజర్వాయర్‌లాగా మార్చినం..
వరదకాల్వను రిజర్వాయర్‌లాగా మార్చి, కాళేశ్వరం నీళ్లను తెచ్చి, రోజుకొక టీఎంసీ దాంట్ల పోసి 365 రోజులు ఎస్సారెస్పీ నిండి ఉండే పనిచేసినం. కాల్వ కింద మిగులు నీళ్లని మాట్లాడిండ్రు! మిగులు నీళ్లు కాదు.. మీరు వద్దన్నదాక నీళ్లుంటయి. ఒక్క ఆరు నెలలు.. జూన్ అయిపోతే ఆ బాధనే పోతది. ఇయ్యాలకూడ రెండవ పంట.. ఆరుతడి పంట చొప్పున ఇచ్చుకొని ఈ రెండు మూడు తాలుకాల్లో నీళ్లు ఇచ్చుకునే బాధ్యత నాది. మీరెవ్వరు కాంగ్రెసోళ్ల దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. చిల్లర రాజకీయాలు ఏవిధంగానూ మంచిది కాదు. బాల్కొండ నియోజకవర్గానికి రాబోయే ఒకటి, ఒకటింబావు సంవత్సరంలోపల 1.10 లక్షల ఎకరాలకు సాగునీళ్లు ఇచ్చే బాధ్యత నాది. ఆర్మూర్, బాల్కొండ రైతులను చూస్తే కడుపు నిండిపోతది. ఎక్కడికిపోయినా మీనుంచి నేర్చుకొని పొమ్మని చెప్తం. ఆదర్శ రైతాంగం ఉండే ఈ ప్రాంతాన్ని అన్నివిధాల కాపాడాలె. మీరు యావత్ తెలంగాణకు ట్రైనింగ్ గ్రౌండ్‌లా కావాలి.

వంద పడకల దవాఖాన
భీంగల్‌కు వంద పడకల దవాఖాన మంజూరుచేస్తం. బాల్కొండకు డిగ్రీ కాలేజీ కూడా ఇస్తం భీంగల్ మున్సిపాలిటీ అయింది కాబట్టి దానికి డబ్బులు ఇస్తం. పట్టణాన్ని బాగా అభివృద్ధి చేస్తం. ఇంతకుముందు ఎర్రజొన్నలకు వాళ్లు (కాంగ్రెస్ ప్రభుత్వం) ఎగబెడితే డబ్బులు టీఆర్‌ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది.. మీకు తెలుసు. ఇవ్వాల పసుపు మార్కెట్ గురించి, పసుపు పరిశోధన కేంద్రం గురించి మీ ఎంపీ, మీ ఎమ్మెల్యే అందరు పోరాటం చేస్తావున్నరు.

ప్రశాంత్‌రెడ్డి.. నా ఇంట్లో బిడ్డలాగ.. ప్రశాంత్‌రెడ్డి నాకు ఇంట్లో నా బిడ్డలాగ ఉంటడు కాబట్టి.. ఆయనకు అర్ధరాత్రి, అపరాత్రి ఎప్పుడైనాసరే మీ అవసరాల గురించి నాతో మాట్లాడే అవకాశం ఉంటది. మాజీ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి కూడ ఈ మధ్యనే పార్టీలో చేరారు. సురేశ్‌రెడ్డి కూడ ప్రశాంత్‌రెడ్డికి ఆశీర్వాదం ఇచ్చినారు. ఇంత పెద్ద నాయకులందరూ కలిసిన తరువాత ఈ ప్రాంతం అన్ని విధాలుగా గ్యారెంటీగా అభివృద్ధి చెందుతది. మల్లొకసారి ప్రశాంత్‌రెడ్డిని పెద్ద మెజార్టీతో గెలిపించండి. కాకతీయ వాటర్ లీకేజీ, పీకేజీ వద్దు.. బాజాప్త దీన్ని స్టెబిలైజ్ చేయాలని నాకు సురేశ్‌రెడ్డి చెప్పారు. వందశాతం చేపించే బాధ్యత నాది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.