Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

వైద్యారోగ్యశాఖకు 5,536 కోట్లు

-దేశంలోనే అత్యుత్తమ వైద్యసేవలు అందిస్తున్న టాప్‌రాష్ర్టాల్లో తెలంగాణ
-సత్ఫలితాలిస్తున్న కేసీఆర్ కిట్
-ఎన్నికల హామీ నెరవేర్చేదిశగా ఈఎన్టీ పరీక్షలకు ఏర్పాట్లు

ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా వైద్యరంగంలో అనూహ్యమైన మార్పులు తెస్తూ.. సర్కారు వైద్యం పట్ల విశ్వాసం పెంచిన తెలంగాణ ప్రభుత్వం.. 2019-20 బడ్జెట్‌లో రూ.5,536కోట్లు ప్రతిపాదించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో వసతులను అభివృద్ధిపరిచింది. అవసరమైన వైద్య పరికరాలు, మందులు, ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. సమైక్య పాలనలో తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందించే మందుల కొనుగోలు కోసం కేవలం రూ.146 కోట్లు మాత్రమే ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ మొత్తాన్ని మూడింతలు పెంచి ఏటా రూ. 440 కోట్లు వెచ్చిస్తున్నది. 40 ప్రభుత్వ దవాఖానల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటుచేసింది. ఎంఆర్‌ఐ, సిటీస్కాన్, డిజిటల్ రేడియాలజీ, టూడి ఎకో, తదితర అత్యాధునిక పరికరాలను వివిధ దవాఖానల్లో అందుబాటులోకి తేవడంతోపాటు జిల్లా, ఏరియా దవాఖానల్లో ఐసీయూ కేంద్రాల సంఖ్య కూడా పెంచింది. ఫలితంగా దేశవ్యాప్తంగా అత్యుత్తమ వైద్యసేవలందించే మూడు రాష్ర్టాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. హైదరాబాద్ నగరంలో పేదలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతీ పదివేల మందికి ఒకటి చొప్పున బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నది. 40 బస్తీ దవాఖానాలు ఇప్పటికే సేవలు అందిస్తున్నాయి. కొత్తగా నాలుగు వైద్య కళాశాలల్లో సిద్దిపేట, మహబూబ్‌నగర్‌లో వైద్య కళాశాలలు ఇప్పటికే ప్రారంభం కాగా సూర్యాపేట, నల్లగొండలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమవుతాయి. దవాఖానలో మరణించిన వారి మృతదేహాలను ఉచితంగా తరలించే పరమపద వాహనాల సదుపాయం తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేదు.

కేసీఆర్ కిట్స్ పథకానికి మూడు లక్ష్యాలున్నాయి. 1.అవాంఛనీయ ఆవరేషన్లకు అడ్డుకట్ట వేయడం. ప్రభుత్వ దవాఖానల్లో సురక్షిత ప్రసవాలు జరుగడం.
2. గర్భందాల్చిన సమయంలో కోల్పోయిన ఆదాయాన్ని ప్రభుత్వమే అందించడం.
3.ప్రసూతి మరణాలు లేకుండా చేయడం. ఈ పథకం కింద నిరుపేద గర్భిణులకు ప్రభుత్వం రూ.12 వేలు చెల్లిస్తున్నది. ఆడపిల్ల పుడితే ప్రోత్సాహకంగా మరో రూ. వెయ్యి ఇస్తున్నది. దీంతోపాటు నవజాత శిశువులకు, బాలింతలకు కావల్సిన 16 రకాల వస్తువులతో కూడిన రూ.2,000 విలువైన కిట్‌ను కూడా అందిస్తున్నది. ఈ పథకం అమలు తర్వాత దవాఖానల్లో జరిగే ప్రసవాలు 33 నుంచి 49 శాతానికి పెరిగాయి. తెలంగాణ ఏర్పడే నాటికి శిశు మరణాల రేటు ప్రతీ వెయ్యి మందికి 39 ఉండేది. అది నేడు 28కి తగ్గింది. మాతా మరణాల రేటు కూడా 91 నుంచి 70కి తగ్గింది. కంటి వైద్యాన్ని ప్రజలు ముంగిట్లోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు ఈ శిబిరాల ద్వారా 1.52 కోట్ల మందికి పరీక్షలు జరిపారు. 50 లక్షల మందికి కండ్లద్దాలు అందించారు. కాటరాక్ట్, గ్లూకోమా, రెటినోపతి, కార్నియా డిసార్డర్స్ వంటి కంటి రుగ్మతలున్న వారిని గుర్తించి, ఉచితంగా ఆపరేషన్లు చేయడానికి ఏర్పాట్లు చేశారు. కంటి వెలుగు తరహాలోనే చెవి, ముక్కు, గొంతు, దంత సంబంధమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలు ఊరూరా నిర్వహిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఈ దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.

కేసీఆర్ కిట్స్ పథకానికి మూడు లక్ష్యాలు
1. అవాంఛనీయ ఆవరేషన్లకు అడ్డుకట్ట వేయడం. ప్రభుత్వ దవాఖానల్లో సురక్షిత ప్రసవాలు జరుగడం.
2. గర్భందాల్చిన సమయంలో కోల్పోయిన ఆదాయాన్ని ప్రభుత్వమే అందించడం.
3. ప్రసూతి మరణాలు లేకుండా చేయడం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.