Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

వలస కార్మికులు వాపస్ రావాలె

హైదరాబాద్‌లో ఉపాధి అవకాశాల్లేక కాదు. ఇక్కడి అవసరాలు తీర్చడం కోసం ఏపీ నుంచి తాపీ మేస్త్రీలు, రాజస్థాన్ నుంచి వచ్చి మార్బుల్ పనులు, బీహార్ నుంచి వచ్చి కార్వింగ్ పనులు, ఒడిశా నుంచి వచ్చి కార్పెంటర్ పనులు, కర్ణాటక, తమిళనాడుల నుంచి వచ్చి హోటల్ వ్యాపారాలు అద్భుతంగా చేకుంటూ గొప్పగా బతుకుతున్నారు. ఇలాంటి స్థితిలో పుట్టిన గడ్డకు దూరంగా దుర్భరంగా గల్ఫ్ దేశాల్లో ఉండటం సరికాదు.

దుబాయి, బొంబాయి, బొగ్గుబాయి.. ఇవి తెలంగాణ బతుకు చిత్రానికి పర్యాయపదాలు. ఉమ్మడి పాలనలో తెలంగాణ లో బతుకలేక పొట్టచేతపట్టుకొని బతుకపోయిన ప్రాంతమిది. ఇక్కడి ప్రజలకు చెందాల్సిన నిధులు, నీళ్లు, నియామకాలను ఆంధ్ర ప్రాంతానికి మళ్లించుకున్నారు. కృష్ణా, గోదావరి నదులు తెలంగాణ గడ్డ మీద ప్రవహిస్తున్నప్పటికీ ప్రాజెక్టులు కట్టకుండా తెలంగాణ రైతు కంట కన్నీళ్లు పెట్టించారు. వ్యవసాయం కుదేలైంది. ఎద్దెవుసం మూలపడింది. చేతివృత్తులు ధ్వంసమై గ్రామీణార్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. సమైక్య పాలకులు కరువుభూతం తెలంగాణలో తిష్ట వేసేలా చేశారు. గ్రామాల్లో పనులు దొరుకక పస్తులుండాల్సిన దుర్గతి. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలే శరణ్యమనే పరిస్థితి. ఈ నేపథ్యంలో రెక్కాడితే కానీ డొక్కాడని పేద ప్రజలతో పాటు చాలామంది రైతులు కూడా ఉపాధి కోసం పట్టణాల బాట పట్టారు. హైదరాబాద్, బొంబాయి, దుబాయిలకు వెళ్లి భవననిర్మాణ కూలీలు గా, హోటళ్లలో సప్లయర్లుగా ఇలా ఏ పని దొరికితే ఆ పనిచేసుకున్నారు. నాటి పాలకులు చేనేత రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేయడం, వేలాదిమందికి అన్నం పెట్టిన అజంజాహీ మిల్లు మూతపడింది. ఫలితంగా వేలాది మంది ఉపాధి కోల్పోయి సూరత్, షోలాపూర్, ఔరంగాబాద్, బీవండి వంటి ప్రాంతాలకు వలస వెళ్లారు. ముఖ్యంగా వేల సంఖ్యలో ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలసవెళ్లారు. ఒక్క ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచే 20 లక్షల మంది వరకు బయటి ప్రాంతాలకు వలస వెళ్లారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్థమవుతున్నది. ఇదంతా మూడేం డ్ల కిందటి వరకూ ఉన్న దుస్థితి.

ఇప్పుడు పరిస్థితి మారింది. మన రాష్ట్రం మనకొచ్చింది. రాష్ట్ర ప్రజలకేం కావాలో తెలిసిన ఏకైక నేత కేసీఆర్ సీఎం అయ్యారు. అందుకే తక్ష ణ ఉపశమన చర్యలు, కరువును పారదోలేందుకు శాశ్వత ప్రణాళికలతో కేసీఆర్ అనేక విజయాలను సాధిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దారు. ఇప్పుడు కరెంట్ బాధ ల్లేవు. మిషన్ భగీరథతో నల్లాల ద్వారా ఇంటింటికీ నీటిని సరఫరా చేసే ప్రయత్నాలు తుదిదశకు చేరుకొని మంచినీటికి కరువు లేకుండా చేస్తున్న ది. మిషన్‌కాకతీయ ద్వారా 46 వేల చెరువులను పునరుద్ధరిస్తూ తద్వారా సాగునీటినివ్వడమే కాకుండా చెరువులతో ముడిపడి ఉన్న కులవృత్తులకు జీవంపోసే చర్యలు చేపట్టింది. గ్రామీణార్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు చేపలు, గొర్రెల పెంపకాన్ని పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నది. కోటి ఎకరాలకు సాగునీరిచ్చే లక్ష్యంతో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కడుతున్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రం లోని ప్రతి గ్రామాన్ని అనుసంధానం చేస్తూ జాతీయ రహదారుల నిర్మాణాలు ముమ్మరంగా సాగుతున్నాయి. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం ఊపందుకుంటున్నది. సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నది. ఎరువులు సరఫరా మొదలుకొని రెండు సీజన్లకు కలిపి ఎకరానికి 8వేల చొప్పున రైతులకు పెట్టుబడి సమకూర్చనున్నది. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా ప్రభుత్వమే పంటల కొనుగోలు బాధ్యత తీసుకున్నది. పారిశ్రామిక పెట్టుబడుల వరద తెలంగాణ వైపు పారుతున్నది. ముచ్చర్ల ఫార్మాసిటీ వస్తున్నది.

దీనివల్ల దాదాపు 60వేల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. అజంజాహీ స్థానంలో వరంగల్ నగరానికి మెగా టెక్స్‌టైల్ పార్క్ వచ్చింది. శంకుస్థాపన జరిగిన తొలిరోజే ఈ టెక్స్‌టైల్ పార్క్‌కు 22 కంపెనీల ద్వారా 3500 కోట్ల పెట్టుబడులు రావడం మారిన తెలంగాణ బతుకు చిత్రానికి ప్రతీక. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామస్థాయి నుంచి హైదరాబాద్ వరకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అంచనాలకు మించి పెరిగాయి. ఇప్పుడు హైదరాబాద్ నగరం దేశంలోనే మంచి ఉపా ధి అవకాశాలకు కేంద్రంగా మారింది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతూ పాలమూరు జిల్లా పచ్చదనంతో కళకళలాడుతున్నది. అనేక జిల్లాల్లో కొత్తగా వచ్చిన సాగునీటి వనరుల వల్ల సేద్యానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉమ్మడి పాలనలో వ్యవసాయం వదులుకొని ఉపాధి వెతుక్కుంటూ వలసలు వెళ్లిన వారు తిరిగి స్వగ్రామాలకు చేరుకుంటూ మళ్లీ సేద్యంలోకి దిగుతున్నారు. సింగూరు ప్రాజెక్టుకు గతంలో నీళ్లు రాక వ్యవసాయాన్ని వదిలి దాని పరిధిలోని అనేక గ్రామాల రైతులు హైదరాబాద్‌కు వలస పోయారు. కానీ ఇప్పుడు సింగూరుకు నీళ్లు రావడంతో దాదాపు అయిదారు వేల మంది తమ రేషన్‌కార్డులను వాపస్ ఇచ్చి తిరిగి వ్యవసాయం చేసుకునేందుకు స్వగ్రామాలకు వెళ్లారు. మూడేండ్లుగా తెలంగాణ నుంచి వలసలు తగ్గాయి. మంచి ఉపాధి అవకాశాలు ఇక్కడే కనిపిస్తుండటంతో వలసలు వెళ్లిన వారిలో చాలామంది వాపస్ వస్తున్నారు.

ఇది ప్రజలు కోరుకున్న తెలంగాణ. మీ బతుకులను కాటేసిన ఉమ్మడి పాలన పోవాలని ఉద్యమ సమయంలో గల్ఫ్ దేశాలతోపాటు దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న మీరు గులాబీ జెండా పట్టుకొని మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తుకుతెచ్చుకోండి. ఉమ్మడి పాలకుల హయాంనాటి చేదు జ్ఞాపకాలన్నీ చెరిగిపోతున్నాయి. చేనేత రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. చేనేత ఉత్పత్తులను ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నది. వరంగల్‌కు మెగా టెక్స్‌టైల్స్ పార్క్ వస్తున్నది. షోలాపూర్, ఔరంగాబాద్, బీవండి, సూరత్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లి న చేనేతసోదరులు తిరిగి రావా లి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారి కడగండ్లు వర్ణనాతీతం.అక్కడ మన వాళ్లు కలలు కన్నంత గొప్పగా ఉపాధి అవకాశాల్లేవు. చాలీచాలని జీతాలతో అనేక అవమానాలు, బాధలు భరించి నెలంతా కష్టపడినా వారికి దక్కేది పది వేల లోపే. ఇక నకిలీ పాస్‌పోర్ట్, వీసాల మోసాలకు గురైన ఎందరో అభాగ్యులు ఎందరో జైళ్ల పాలయ్యారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాల్లో తిరుగుతూ రోడ్లపైనే చనిపోయిన వారున్నారు. ఇలా చనిపోయిన వారి బౌతిక కాయాలను గల్ఫ్ దేశాల నుంచి స్వస్థలాలకు తరలించడానికి నానా యాతనలు పడాల్సి వస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని అక్కడి మన ఎంబసీలను అప్రమత్తం చేసి ఆయా దేశాల చట్టాల ప్రకారం ఎదురయ్యే సమస్యలను అధిగమించి శవాలను తీసుకురావడమనేది బాధ్యతగా చేయాలి.

ఇక్కడ పరిస్థితులు బాగోలేనప్పుడు గత్యంతరం లేక వలస వెళ్లి ఉండవచ్చు. నాటి కరువు పరిస్థితులు ఇప్పుడు లేవు. తల్లిదండ్రులు, కుటుంబాలకు దూరమై గల్ఫ్ దేశాల్లో దుర్బరజీవితం గడుపటం, కుటుంబ సభ్యులకు ఆత్మీయతలకు దూరం కావడం ఇక ఉం డకూడదన్నదే ప్రభుత్వ భావన. హైదరాబాద్‌లో ఉపాధి అవకాశాల్లేక కాదు. ఇక్కడి అవసరాలు తీర్చడంకోసం ఏపీ నుంచి తాపీ మేస్త్రీలు, రాజస్థాన్ నుంచి వచ్చి మార్బుల్ పనులు, బీహార్ నుంచి వచ్చి కార్వింగ్ పను లు, ఒడిశా నుంచి వచ్చి కార్పెంటర్ పనులు, కర్ణాటక, తమిళనాడుల నుంచి వచ్చి హోటల్ వ్యాపారాలు అద్భుతంగా చేకుంటూ గొప్పగా బతుకుతున్నారు. ఇలాంటి స్థితిలో పుట్టిన గడ్డకు దూరంగా దుర్భరంగా గల్ఫ్ దేశాల్లో ఉండటం సరికాదు. వలసలు వాపస్ రావాలె అన్నది తెలంగాణ ప్రభుత్వ నినాదం. ఈ పిలుపుతో వలస జీవితం గడుపుతున్న వారంతా తిరిగొచ్చి తమ జీవనాన్ని కొత్త మలుపు తిప్పుకోవాలి. ఇక్కడే ఆత్మగౌరవంతో జీవించడానికి అన్నివిధాలా అండదండలిచ్చే ప్రభుత్వమున్నది.

విశ్లేషణ : కర్నె ప్రభాకర్ , శాసనమండలి సభ్యులు. (నమస్తే తెలంగాణ)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.