Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

విద్వేషానికి చోటులేదు

-ఆరున్నరేండ్లుగా ప్రశాంతంగా తెలంగాణ
-సీఎం కేసీఆర్‌ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామ రక్ష
-నోట్ల రద్దు.. రైతులు వద్దు.. కార్పొరేట్‌ ముద్దు
-ఇదీ కేంద్ర సర్కార్‌ వైఖరి
-దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు తథ్యం
-పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌
-టీఆర్‌ఎస్‌లోకి బీజేపీ నేత రావుల శ్రీధర్‌రెడ్డి

‘గత ఆరేండ్లలో తెలంగాణ నుంచి కేంద్రానికి వివిధ రకాల పన్నుల రూపంలో రూ.2.72 లక్షల కోట్లు ఇస్తే.. రాష్ర్టానికి కేంద్రం నుంచి రూ.1.40 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చారు. మనం కేంద్రానికి ఇచ్చిన దాంట్లో సగం కూడా తిరిగివ్వలేదు. దుబ్బాకలో బీజేపీ నేతల ప్రచారం చూస్తే వింతగా, విచిత్రంగా ఉన్నది. డబుల్‌ బెడ్‌కు, బాత్‌రూంలకు, పింఛన్లకు.. ఇలా అన్నింటికీ మేమే డబ్బులు ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు. కానీ తన మామ, బామ్మర్ది ఇంట్లో దొరికిన డబ్బులు మాత్రం తనవి కావని అంటున్నారు.

తెలంగాణలో మత విద్వేషపు విత్తనాలకు చోటు లేదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు అన్నారు. ఇక్కడి మట్టిలోనే పరమత సహనం ఉన్నదని చెప్పారు. తెలంగాణ రాష్ర్టానికి సీఎం కే చంద్రశేఖర్‌రావు నాయకత్వమే శ్రీరామరక్ష అని పునరుద్ఘాటించారు. నోట్ల రద్దు.. రైతు లు వద్దు.. కార్పొరేట్లు ముద్దు అన్నది బీజేపీ నినాదంగా మారిపోయిందని ఎద్దేవాచేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రావుల శ్రీధర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. గులాబీ కండువా కప్పి శ్రీధర్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, బీజేపీలకు దేశంలో 28 రాష్ర్టాలు ఉంటే.. 28 ఎజెండాలు ఉంటాయని తెలిపారు. టీఆర్‌ఎస్‌కు, సీఎం కేసీఆర్‌కు ఒక్కటే ఎజెండా అని.. అది తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి అని తెలిపారు. రాష్ట్రం వచ్చిన నాటినుంచి ఏ ఎన్నిక వచ్చినా టీఆర్‌ఎస్‌కు ప్రజలు పట్టం కడుతున్నారని, ప్రజలు అక్కు న చేర్చుకుంటున్నారని చెప్పారు. బీజేపీ నేతలది ప్రచార ఆర్భాటమే తప్ప క్షేత్రస్థాయిలో ఎలాంటి ఫలితాలు ఉండవన్నారు. ఆరేండ్ల లో రాష్ర్టానికి టీఆర్‌ఎస్‌ ఏం చేసిందో చెప్పడానికి గంటలకొద్దీ సమయం పడుతుందన్నారు. లెక్కలను వివరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌చేశారు.

మత రాజకీయాలకు స్థానం లేదు
రాష్ట్రంలో మతం పేరిట చిచ్చుపెట్టాలని కొందరు కుట్ర చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణలో మత రాజకీయాలకు స్థానం లేదని, ఇక్కడి మట్టిలోనే పరమత సహనం ఉన్నదని చెప్పారు. విద్వేషపు విత్తనాలకు తెలంగాణలో ఎంతమాత్రం చోటులేదన్నారు. 1908లో మూసీ నదికి భారీ వరదలు వస్తే అప్పటి ముస్లిం రాజు నిజాం కూడా శాంతించమ్మా అంటూ మూసీ కి పూజలు చేశారని గుర్తుచేశారు. ఈ ఏడాది వరదలు వస్తే మంత్రులు మహమూ ద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పూజలు నిర్వహించారన్నారు. ఇలాంటి సంస్కృతి తెలంగాణలో ఉన్నదని, కానీ కొందరు చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ను మించిన హిందువు ఎవరూ లేరని, ఆయన భారీ యాగాలే ఇం దుకు తార్కాణమని చెప్పారు. దేశభక్తి అన్న ది ప్రదర్శనాస్త్రం కాదన్నారు. టీఆర్‌ఎస్‌ను ప్రజలంతా ఇంటి పార్టీగా భావిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌ నగర సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. రోడ్ల మరమ్మతులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు.

పన్నుల్లో సగం కూడా వాపస్‌ రాలేదు
ఆరేండ్లలో తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో రూ.2.72 లక్షల కోట్లు ఇస్తే.. రాష్ర్టానికి కేంద్రం నుంచి రూ.1.40 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయని కేటీఆర్‌ వెల్లడించారు. మనం కేంద్రానికి ఇచ్చిన దాంట్లో సగం కూడా తిరిగి ఇవ్వలేదని తెలిపారు. దుబ్బాకలో బీజేపీ నేతల ప్రచారం చూస్తే వింతగా ఉన్నదని చెప్పారు. ‘డబుల్‌ బెడ్‌కు, బాత్‌రూంలకు, పింఛన్లకు.. ఇలా అన్నింటికీ మేమే డబ్బులు ఇస్తున్నామని చెప్పుకొంటున్నారు. కానీ తన మామ, బామ్మర్ది ఇంట్లో దొరికిన డబ్బులు మాత్రం తనవి కావని అంటున్నారు’ అని కేటీఆర్‌ చురకలంటించారు. దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. దేశంలో జీడీపీ లాక్‌డౌన్‌కు రెండేం డ్ల ముందునుంచే తగ్గుతూ వచ్చిందని, లాక్‌డౌన్‌ వల్ల ఇంకా తగ్గిపోయిందని పేర్కొన్నారు. మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌, శ్రీలంకల్లో జీడీపీ మెరుగ్గా ఉన్నదని తెలిపారు. ప్రపంచంలో భారత్‌ను తలదించుకొనే పరిస్థితిని ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని, ఒక్కొక్కరి బ్యాంకు ఖాతా ల్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా వేయలేదని గుర్తుచేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ.. ఎక్కడా అమలుచేయలేదన్నారు. నల్లధనం తేలేదు కానీ నల్ల చట్టాలు తెచ్చారని విమర్శించారు. రైతులతో సహా అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి దూరమయ్యారన్నారు. చివరకు జవాన్లు కూడా బీజేపీ వైపు నిలబడటంలేదని చెప్పారు. రాజ్యాం గం సంక్షోభంలో పడిందన్నారు.

బీజేపీది హడావుడే: రావుల శ్రీధర్‌రెడ్డి
రాష్ట్ర అభివృద్ధి.. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ నాయకత్వంలోనే సాధ్యమవుతుందని, అందుకే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని రావుల శ్రీధర్‌రెడ్డి తెలిపారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది ఏమీ లేదని, శుష్కప్రియాలు, శూన్య హస్తాలు అన్నట్టు ఉన్నదని విమర్శించారు. బీజేపీది సోషల్‌మీడియాలో హడావుడి తప్ప మరేమీ లేదని చెప్పారు. దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ గెలుపు నల్లేరు మీద నడకేనని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, విప్‌లు బాల్క సుమన్‌, భానుప్రసాద్‌, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌కుమార్‌, ఎమ్మె ల్యే గోపీనాథ్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, సాట్స్‌ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌రావు, టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, నాయకుడు తలసాని సాయికిరణ్‌ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌, బీజేపీలకు దేశంలో
28 రాష్ర్టాలు ఉంటే.. 28 ఎజెండాలు ఉంటాయి. టీఆర్‌ఎస్‌ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు ఒక్కటే ఎజెండా. అది తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి. రాష్ట్రం వచ్చిన నాటినుంచి ఏ ఎన్నిక వచ్చినా టీఆర్‌ఎస్‌కు ప్రజలు పట్టం కడుతున్నారు. ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు. బీజేపీ నేతలది ప్రచార ఆర్భాటమే తప్ప క్షేత్రస్థాయిలో ఎలాంటి ఫలితాలు ఉండవు.

– కేటీఆర్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.