Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

విద్యుత్ ప్రాజెక్టుల వేగం పెంచండి

రాష్ట్రంలో విద్యుత్ కష్టాలను తీర్చేందుకు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేలా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కసరత్తు వేగవంతం చేశారు. కొత్త విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి సత్వర చర్యలతోపాటు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేసేందుకు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, వీలైనప్పుడల్లా క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే నల్లగొండ జిల్లాలో పర్యటించి 7,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు వేసిన ఆయన, గురువారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో కూడా విద్యుత్‌రంగంపై దృష్టి కేంద్రీకరించారు. జైపూర్ మండలం పెగడపల్లి వద్ద సింగరేణి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న విద్యుత్ కేంద్రం పనులను సీఎం సమీక్షించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి 2015 నవంబర్‌కల్లా విద్యుత్ ఉత్పాదన ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని సూచించారు.

KCR-visit-Jaipur-Power-Plant-01

-నిర్ణీత సమయంలోనిర్మాణం పూర్తిచేయాలి -ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్ -జైపూర్ పవర్‌ప్లాంటు పనులపై సమీక్ష -నిర్వాసితులను ఆదుకుంటామని హామీ పవర్‌ప్లాంటు గెస్ట్‌హౌస్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ప్రాజెక్టు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ఎలాంటి సాయమైనా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వారం పదిరోజులకు ఒకసారి పవర్ ప్లాంటుకు వెళ్లి పనులను పర్యవేక్షించాలని ఆ ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. సమావేశం అనంతరం దాదాపు 40 నిమిషాలపాటు పవర్ ప్లాంటు మొత్తం కలియ తిరిగారు. ఆ తరువాత పలువురు బాధితులు మీ కోసం వేచి ఉన్నారంటూ స్థానిక ఎమ్మెల్యే నల్లాల ఓదెలు సీఎం దృష్టికి తేవటంతో ఆయన నేరుగా వారివద్దకు వెళ్లి మాట్లాడారు. బాధితులను ఆదుకుంటాం విద్యుత్ కేంద్రం ఏర్పాటువల్ల భూములు కోల్పోయినవారిని ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. బాధితులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. త్వరలో మంచిర్యాల కేంద్రంగా ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేస్తామని, దీంతో ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. త్వరలోనే మరోసారి మీ వద్దకు వస్తా. మీతోనే ఒక రోజున్నర కలిసి ఉంటా, మీతోనే కలిసి తింటా, ఇక్కడే పడుకుంటా అని హామీ ఇచ్చారు.

జిల్లా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రికి స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు బాల్కసుమన్,గోడెం నగేష్, ప్రభుత్వ విఫ్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్సీ వెంకట్రావు, ఎమ్మెల్యేలు కోవాలక్ష్మి, రేఖా నాయక్, కోనేరు కోనప్ప, దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, సోమారపు సత్యనారాయణ, టీఆర్‌ఎస్ ఆదిలాబాద్ జిల్లా తూర్పు, పశ్చిమ జిల్లాల అధ్యక్షులు పురాణం సతీశ్, లోక భూమారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ నేతలు కెంగర్ల మల్లయ్య, మిర్యాల రాజిరెడ్డి, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ మామిడిశెట్టి వసుంధర, జైపూర్ ఎంపీపీ మెండె హేమలత తదితరులు సీఎంకు స్వాగతం పలికారు. జిల్లా పర్యటనలో సీఎం వెంట టీఆర్‌ఎస్ పార్లమెంటరీపార్టీ నేత కేకే, ఢిల్లీలో టీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి, ఆర్ అండ్ బీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగారావు, విద్యుత్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జోషి తదితరులున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.