వాళ్లకు-మనకు, మనపాలనకు-పరపాలనకు, గతానికి-వర్తమానానికి, పొలిటికల్ లీడర్స్‌కు, రియల్ లీడర్స్‌కు తేడా ఏంటో స్ఫష్టంగా కనిపిస్తోంది. నిజమైన నాయకుల పాలనకు, రాజకీయ నాయకుల పాలనకు నక్కకు.. నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.

ఇప్పటివరకు చుట్టూ సెక్యూరిటీతో బిల్డప్ తప్ప బిజినెస్ లేని నాయకులను చూశాము. కానీ.. ఇప్పుడు ఉన్న సెక్యూరిటీని పక్కనబెట్టి ప్రజలకొరకు ప్రజల్లో కలసిపోతున్న నాయకులను చూస్తున్నాము. వీళ్లు నిజమైన నాయకులు… వీళ్లు రియల్ లీడర్స్.
సేవ చేయాలనే తపన మనసులో ఉండాలి తప్ప, ఎవరో చెబితేనో, ఎవరినో చూసో నేర్చుకుంటే రాదు.. పుష్కరాల్లో మన మంత్రుల పనితీరు అందరినీ సంబ్రమాశ్చర్యానికి గురి చేసింది. పుష్కర ఘాట్లవద్ద వాలంటీర్లుగా, రోడ్డుపై ట్రాఫిక్ పోలీసులుగా మారిపోయి సైనికుల్లా పనిచేశారు. మేమున్నామంటూ ప్రజల్లో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపారు. అందుకే తెలంగాణలోని గోదావరి నదీ తీరం మునుపెన్నడూ లేనివిధంగా భక్తజనంతో పోటెత్తింది.