Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

విశ్వనగరంగా తీర్చిదిద్దడమే టీఆర్‌ఎస్‌ ఎజెండా

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… భార‌త‌దేశంలోనే ఒక నిజ‌మైన కాస్మోపాలిట‌న్ న‌గ‌రంగా గొప్ప చారిత్రకనగరంగా హైదరాబాద్‌ ప్రసిద్ధిగాంచిందన్నారు. ఈ న‌గ‌రానికి చ‌రిత్ర‌, సంస్క్యృతిగ‌ల న‌గ‌రం ఎవ‌రు ఇక్కడి నుంచి వ‌చ్చినా అక్కున చేరుకుందన్నారు. దేశంలోని చాలాచోట్ల క‌నిపించ‌వుకానీ మ‌న‌ద‌గ్గర గుజ‌రాతీ గ‌ల్లీ, పార్సిగుట్ట‌, అర‌బ్‌గ‌ల్లీ, బెంగాళీ, కన్నడ, తమిళ స‌మాజం నుంచి ఇక్కడ వ‌చ్చి మ‌న సంస్కృతిలో లీనమైమయ్యాయి అన్నారు. వారివారి ఆచారాలు, పండుగలు గొప్పగా నిర్వహించుకునే.. ఒక అంద‌మైన పూల బొకేలాంటి న‌గ‌రం హైద‌రాబాద్‌ నగరం అన్నారు. అంద‌ర్నీ క‌డుపులోకి పెట్టుకొని నగరం చూసుకుంటుందన్నారు.

ఈ నగరాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం విశ్వవ్యాప్తంగా తీర్చిదిద్దే ఎజెండాను టీఆర్‌ఎస్‌‌ అమలు చేస్తుందన్నారు. ఇందులో చాలావ‌ర‌కు స‌క్సెస్ అయ్యామన్నారు. ఇంకా కావాల్సి ఉందన్నారు. జంట న‌గ‌రాల్లో నేడు మంచి నీటి కొట్లాట‌లు లేవని, గ‌తంలో శివారు ప్రాంతాల్లో నీటి సమస్యలు ఉండేవన్నారు. ఇప్పుడవన్నీ మిషన్‌ భగీరథతో పుణ్యమాని కనుమరుగయ్యాయన్నారు. నగరంతో పాటు నగర శివారులోని హెచ్‌ఎండీఏ పరిధిలో కూడా పుష్కలంగా మంచినీటి సరఫరా జరుగుతుందన్నారు. ఇది ప్రజలందరి కండ్ల ముందన్నారు. ఇలాంటి నగరాన్ని ఇంకా అపురూపంగా, గొప్పగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇట్లాంటి నగరాన్ని ఇంకా గొప్పగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. అద్భుతమైన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో దేశంలో రెండోస్థానంలో ఉన్నామన్నారు. హైదరాబాద్‌కు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామని, అవన్నీ కూడా విజయవంతంగా అమలు జరుగుతున్నాయన్నారు.

పెట్టుబడుల్లో దేశంలోనే రెండోస్థానం
అద్భుతమైన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో దేశంలో రెండోస్థానంలో ఉన్నామన్నారు. హైదరాబాద్‌కు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామని, అవన్నీ కూడా విజయవంతంగా అమలు జరుగుతున్నాయన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయని, పూర్తిస్థాయి పారదర్శకంగా, అవినీతి రహితంగా పరిశ్రమలు విధానం తీసుకువచ్చామని, ప్రస్తుతం తీసుకువచ్చినటువంటి ధరణి పోర్టల్‌ విషయంలో కానీ, అదే విధంగా టీఎస్‌ బీ-పాస్‌గానీ, టీఎస్‌ ఐ-పాస్‌ గానీ ప్రపంచవ్యాప్తంగా ప్రజల, పారిశ్రామిక వేత్తల మన్ననలు పొందుతున్నాయన్నారు. ఇవన్నీ విశ్వవేదికపై పెద్దకీర్తిని హైదరాబాద్‌కు తీసుకువచ్చాయన్నారు. అలాగే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ క్రియేషన్‌లోనూ ముందుకు దూసుకెళ్తున్నామని, నగరాన్నీ మరింత పట్టుదలతో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ఇక్కడనున్న అనేక ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన పేద, ధనిక ప్రజలందరినీ సమదృష్టితో చూస్తూ, మంచి విధానంతో, సామరస్యపూర్వక వాతావరణంలో నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రజలతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో జంటనగరాల భవిష్యత్‌, భాగ్యం కోసం టీఆర్‌ఎస్‌ ప్రతిపాదిస్తున్న ఎజెండాను అర్థం చేసుకొని, టీఆర్‌ఎస్‌తో హైదరాబాద్‌ అభివృద్ధి ప్రయాణంలో చేయిచేయి కలిపి ముందుకు రావాలని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించాలని కోరారు. గతంలో ఇచ్చిన విజయం కంటే ఉన్నతమైన విజయాన్ని చేకూర్చాలని జంటనగరాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఎన్నికల ప్రణాళికను ప్రకటించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.