దేశంలో చిన్న, సన్నకారు రైతులున్న రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రం ఏర్పడేనాటికి వ్యవసాయం సంక్షోభంలో, రైతాంగం అప్పుల్లో, అవస్థలలో కూరుకుపోయి ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఐదేండ్లలో తీసుకున్న వ్యవసాయ సానుకూల విధానాలతో ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలు నేడు ప్రపంచ వ్యవసాయిక దేశాలకు ఆదర్శం. దేశంలోని ప్రతి రాష్ట్రం రైతుల కు మేలు చేయాలనే దిశగా ఆలోచిస్తే మొదటగా వారికి కనిపిస్తున్నవి ఈ రెండు పథకాలే. ఇక వర్షాధార సాగుకుతోడు నిలకడలేని అస్పష్ట వర్షపా తం తదితర బాధల నుంచి రాష్ట్ర రైతులను విముక్తి చేసేందుకు కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి వరదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారు. గత ప్రభుత్వాలు పెండింగ్‌లో పెట్టిన పలు ప్రాజెక్టులను పూర్తి చేయడం మూలంగా ఇప్పటికే సాగువిస్తీర్ణం పెరిగింది. వరి ఉత్పాదకత పెరిగింది. ఫలితంగా రాష్ట్ర అవసరాలు తీరగా మిగులు ఉత్పత్తులను సద్వినియోగపరుచుకోవాలి. ధరలు పడిపోయి రైతులు నష్టపోకుండా చూడాలి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చాలా అనువైన వాతావరణం ఉన్నది విత్తన పంటల సాగుకే. ప్రపంచంలో విత్తనోత్పత్తికి అత్యంత అనువైన ప్రాంతాల్లో అమెరికాలో ని అరిజోనా రాష్ట్రం తర్వాత తెలంగాణ మాత్రమే. ఇప్పటికే భారత విత్త న రాజధానిగా ఉన్న తెలంగాణను ప్రపంచ విత్తన కేంద్రంగా తీర్చిదిద్దే విధంగా తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికలున్నాయి. ఇందుకు అధిక విస్తీర్ణంలో సాగవుతూ లాభసాటిగా లేని పంటల స్థానంలో పంటల వైవిధ్యీకరణ కింద విత్తన పంటల సాగుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం అందించనున్నది. ఈ పంటల సాగుకోసం రైతులకు సాంకేతికంగా, నైపుణ్యపరంగా, విధానాల పరంగా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నది.
గత కొన్నేండ్లుగా భారతీయ విత్తన పరిశ్రమలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఒకప్పుడు రైతులు తాము వేసిన పొలంలో నుంచి సేకరించిన విత్తనాలనే వాడేవారు. నేడు అత్యంత నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో వ్యవసాయ ముఖచిత్రమే మారిపోయింది. ఫలితంగా నేడు భారతదేశం ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద విత్త న పరిశ్రమగా ఎదిగింది. ప్రపంచ విత్తన మార్కెట్‌లో 4.4 శాతంతో అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రెజిల్ తర్వాత స్థానం భారత్‌ది.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నాణ్యమైన ఆహార సరఫరా పెరుగాలి. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రపంచ జనాభా 771 కోట్లు. 2050 నాటికి 990 కోట్లకు చేరుతుందని అంచనా. ఈ మేరకు ఆహారధాన్యాల, ఇతర పం టల డిమాండ్ 70 శాతానికి పైగా ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నాణ్యమైన విత్తనం అందుబాటులోకి రావాలి. తరుగుతున్న సహజ వనరులు, సాగునీటి అందుబాటు, సరాసరి తలసరి కమత విస్తీర్ణం నేపథ్యంలో పెరుగాల్సిన వ్యవసాయ ఉత్పత్తిలో అత్యంత కీలకం విత్తనం. ప్రపంచంలోని అన్ని దేశాలకు నాణ్యమైన విత్తనం అవసరం. ప్రస్తుతం ప్రపం చ విత్తన వ్యాపారం విలువ 60 బిలియన్ డాలర్లు. అందులో భారత విత్తన వ్యాపారం విలువ 2.5 బిలియన్ డాలర్లు. ప్రపంచంలోని మిగతా దేశాలు విత్తన వాడకం, ఎగుమతుల విషయంలో మేలుగానే ఉన్నాయి. అయితే ఇతర ఆసియా దేశాలు, ఆఫ్రికా ఖండపు దేశాల్లో నాణ్యమైన విత్తన కొరత ఉన్నది. సగం హైబ్రిడ్ కూరగాయల విత్తనాలు, 70 శాతం ఆహారధాన్యాల విత్తనాలను ఆసియా దేశాలకు భారత్ నుంచి సరఫరా అవుతున్నాయి. ప్రపంచ విత్తన మార్కెట్‌లో వృద్ధిరేటుతో పోలిస్తే ఆసి యా విత్తన పరిశ్రమలో వృద్ధిరేటు 10-12 శాతం. ఇది పారిశ్రామీకరణ వృద్ధిరేటు కంటే ఎక్కువ. ఇక ఆఫ్రికా దేశాల విషయానికొస్తే ఆ ఖండపు ప్రాంతీయ ఆర్థిక పరిస్థితిలో 50 శాతం వ్యవసాయ, అనుబంధ వ్యాపారాలదే. 70 శాతానికి పైగా వారి జీవనోపాధికి వ్యవసాయం మీద ఆధార పడి ఉన్నారు. అందులో ఎక్కువమంది చిన్న, సన్నకారు రైతులే. ప్రస్తుతం 80-90 శాతం ఆఫ్రికా రైతులు సాధారణంగా, సాంప్రదాయంగా ఉత్పత్తిచేసిన విత్తనమే వాడుతున్నారు. ఒక వంతు రైతులకు మాత్రమే నాణ్యమైన విత్తనం అందుబాటులో ఉన్నది.
అంతర్జాతీయ విత్తన పరీక్షా సంస్థ అయిన ఇస్టా వారి ప్రయోగశాలలలో విత్తన నాణ్యత పరీక్షించిన తర్వాతనే ఇతర దేశాలకు ఎగుమతికి అవకాశం ఇస్తాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విత్తనాలను ఎగుమతి చేయాలంటే ఇస్టా నాణ్యత ప్రమాణాలు మన రైతులు అందుకోవాలి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సదస్సు లో ఆ ప్రమాణాలు అందిపుచ్చుకునేలా వివిధ సాంకేతిక తరగతులు, నిపుణులకు అవగాహన కల్పించడం జరిగింది. అంతర్జాతీయ విత్తన సదస్సు తొలిసారి ఆసియాలో అందునా తెలంగాణలో జరుగడం గర్వకారణం.
ఇదే సమయంలో భారత, ఆఫ్రికా ఖండపు వాతావరణ పరిస్థితులు దాదాపు ఒకేవిధంగా ఉంటాయి. కాబట్టి మన దగ్గర పండే అన్నిపంటల విత్తనాలను మనం ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయగలం. ఇప్పటికే మన విత్తనాల కు అక్కడ మేలైన ఆదరణ ఉన్నది. కొన్నేండ్లుగా భారతీయ విత్తన పరిశ్రమలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఒకప్పుడు రైతులు తాము వేసిన పొలంలో నుంచి సేకరించిన విత్తనాలనే వాడేవారు. నేడు అత్యంత నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో వ్యవసాయ ముఖచిత్రమే మారిపోయింది. ఫలితంగా నేడు భారతదేశం ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద విత్త న పరిశ్రమగా ఎదిగింది. ప్రపంచ విత్తన మార్కెట్‌లో 4.4 శాతంతో అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రెజిల్ తర్వాత స్థానం భారత్‌ది. ప్రపంచ విత్తన మార్కెట్‌లో భారత విత్తన మార్కెట్ వృద్ధిరేటు 17 శాతంగా ఉన్నది. 1988 విత్తన అభివృద్ధి నూతన విధానం, 2002 జాతీయ విత్తన విధానం అమలు చేయడంతో విత్తన పరిశోధన, అభివృద్ధి, నాణ్యత, ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలు మెరుగుపడటం ద్వారా విత్తన పరిశ్రమ ఎదుగుదల కు తోడ్పడ్డాయి. తెలంగాణలో విత్తనోత్పత్తికి అనుకూలమైన వాతావర ణ పరిస్థితులు, నిపుణులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, నిల్వ, రవాణా సౌకర్యాలు పుష్కలంగా అందుబాటులో ఉండటంతో దేశానికి అవసరం ఉన్న విత్తనాలలో 60 శాతం పైగా మన రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతున్నాయి. చల్లని వాతావరణం మూలంగా వరి, మక్క, సజ్జ, కంది, పెసర, శనగ, సోయాబీన్, పల్లి, పత్తి పంటల విత్తనోత్పత్తికి తెలంగాణ అత్యంత అనుకూలం. ప్రపంచ విత్తన రాజధాని తెలంగాణ కావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కలను నెరవేర్చుకునే అవకాశాలు మన కు మెరుగ్గా ఉన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 400కు పైగా జాతీయ, అంతర్జాతీయ విత్తన సంస్థలున్నాయి.
1500 గ్రామాల్లో 2.5 లక్షల మంది సుశిక్షుతులైన విత్తనోత్పత్తి రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ఏటా 65 లక్షల క్వింటాళ్ల విత్తనాలు ఉత్పత్తి అవుతున్నాయి. తెలంగాణ భారత విత్తన భాండాగారంగా మారింది. దీని లాభాలు అన్నీ రైతులకే అందుతున్నాయి. ఓఈసీడీ విత్తన స్కీంలు, ఆన్‌లైన్ విత్తన ధృవీకరణ వ్యవస్థలు అమలుపరిచిన మొదటి రాష్ట్రం తెలంగాణ కావడం గమనార్హం. ప్రత్యేకించి కొన్ని జిల్లాలు కొన్ని విత్తన పంటల సాగుకు మరింత అనుకూలం. పత్తికి మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలు, పల్ల్లికి వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల, మహబూబ్‌నగర్, మక్కజొన్నకు నిజామాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, సజ్జ, జొన్నలకు నిజామాబాద్, నిర్మల్, వరికి కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, జనగామ, శనగ, సోయాబీన్ పంటలకు నిజామాబాద్, ఆదిలాబాద్, గద్వాల్, నిర్మల్, పశుగ్రాస జొన్నకు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు అత్యంత అనుకూలంగా ఉన్నవి. కాబట్టి ఈ ప్రాంతాల్లో బ్రీడర్ విత్తనం ద్వారా ఫౌండేషన్ తదుపరి సర్టిఫికేషన్ చేస్తే నాణ్యత బాగుంటుంది. మన రైతులు వాటిని నేరుగా ఎగుమతి చేసుకునే అవకాశాలు పెరుగుతాయి. ఆయా ప్రాంతాల్లో విత్తన పంటల ఉత్పత్తికి సాంకేతిక సలహాలు, సాగు వివరాలు అందించేందుకు వ్యవసాయ శాఖ ఉద్యోగులు, రైతు సమన్వయ సమితి సభ్యులు కలిసికట్టుగా పనిచేయాలి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సాగుకు ఉచితంగా 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్నది. సాగునీరు అందిస్తున్నది. రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టింది. రైతులు ఈ ప్రోత్సాహకాలతో విత్తన పంటల సాగుపై దృష్టిపెడితే అదనపు ఆదాయం లభిస్తుంది.
అంతర్జాతీయ విత్తన పరీక్షా సంస్థ అయిన ఇస్టా వారి ప్రయోగశాలలలో విత్తన నాణ్యత పరీక్షించిన తర్వాతనే ఇతర దేశాలకు ఎగుమతికి అవకాశం ఇస్తాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విత్తనాలను ఎగుమతి చేయాలంటే ఇస్టా నాణ్యత ప్రమాణాలు మన రైతులు అందుకోవాలి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సదస్సు లో ఆ ప్రమాణాలు అందిపుచ్చుకునేలా వివిధ సాంకేతిక తరగతులు, నిపుణులకు అవగాహన కల్పించడం జరిగింది. అంతర్జాతీయ విత్తన సదస్సు తొలిసారి ఆసియాలో అందునా భారత్‌లోని తెలంగాణలో జరుగడం గర్వకారణం. రాబో యేకాలంలో ఈ సదస్సు మూలంగా నూతన వంగడాలు, నాణ్యమైన విత్తనాల దిగుబడితో తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీ య విత్తన మార్కెట్‌లో కీలకంగా ఎదిగేలా పనిచేద్దాం. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (వ్యాసకర్త: రాష్ట్ర వ్యవసాయ శాఖా మాత్యులు)