Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

వ్యయం కాదు, వ్యవసాయం

నియంత్రిత వ్వవసాయ విధానంలో ఏ పంట రకాలు ఎక్కడ సాగుచేయాలో ప్రభుత్వమే చెబుతుంది. దాని ప్రకారమే రైతులు పంటలు వేసేలా చర్యలు తీసుకుంటున్నది. ఎక్కడ ఏ పంటలు వేయాలన్నది ప్రభుత్వమే మ్యాపింగ్‌ చేసి, సమగ్ర వ్యవసాయ విధానాన్ని రాష్ట్రమంతా అమలయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించింది. ఈ నియంత్రిత వ్యవసాయ విధానాన్ని రైతులు గుండెలకద్దుకొని స్వీకరిస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటిరంగంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. సాగునీటి ప్రాజెక్ట్‌లను కట్టకపోవడం, మొదలుపెట్టిన వాటిని పూర్తి చేయకపోవడం పరిపాటి అయ్యింది. వారసత్వంగా వచ్చిన గొలుసుకట్టు చెరువులను ధ్వంసం చేయడం మూలంగా ఈ ప్రాంత రైతాంగం కోట్ల రూపాయలు వెచ్చించి 25 లక్షలకు పైగా బోర్లు వేయాల్సి వచ్చింది.

రాష్ట్ర అవతరణ తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొదటి బడ్జెట్‌ నుంచి ప్రతిసారి సరాసరిన రూ. 25 వేల కోట్లు కేటాయిస్తూ శరవేగంగా పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నది. కాళేశ్వరం వంటి ప్రాజెక్టును మూడున్నరేళ్లలో నిర్మించిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవు. మిషన్‌ కాకతీయ పథకంతో 45 వేల చెరువులను పునరుద్ధరించడం, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు అందుబాటులో ఉంచటంతో బోర్లు, బావుల ద్వారా సాగునీరు కొరత తీరింది.

రైతుల కష్టాలు తెలిసిన కేసీఆర్‌ అధికారంలోకి రాగానే రు. 17వేల కోట్ల రుణ మాఫీ చేశారు. రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చి, ఇప్పటికే 25వేల రూపాయల లోపు రుణాలను మాఫీ చేశారు. రైతు బీమా ఉండనే ఉన్నది. రైతులకు సబ్సిడీతో ట్రాక్టర్లు, పనిముట్లు అందజేయడంతో కూలీల కొరత ఉన్నా వ్యవసాయం ఆగకుండా త్వరిత గతిన సాగుతున్నది. ఏ రాష్ట్రం చెయ్యనివిధంగా 100శాతం ధాన్యాన్ని కనీస మద్దతుధరకు కొనుగోలు చేసింది. దేశంలో సేకరించిన వరిధాన్యంలో తెలంగాణనే 54శాతం సమకూర్చింది.

ఆరేండ్లలో సీఎం కేసీఆర్‌ దూరదృష్టి, చిత్తశుధ్ది, స్పష్టమైన ప్రణాళిక ఫలితంగా తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారింది. ఇక 2014లో 4లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములను 24 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెంచారు. ఈ ఏడాదిలోమరో 40 లక్షల మెట్రిక్‌ టన్నుల గోదాముల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఇవేకాదు, రైతులకు మద్దతు లభించే వరకు, వ్యవసాయం లాభసాటి అయ్యేవరకు ప్రభుత్వ తోడ్పాటు ఉంటుం ది. కోటి మెట్రిక్‌ టన్నుల మన ఆహార అవసరాలు తీరుస్తూ, బయటి మార్కెట్‌కు అవసరమయ్యే పంటలనే ప్రోత్సహించాలన్నది కేసీఆర్‌ ఆలోచన. వ్యవసాయ శాస్త్రవేత్తలు, మార్కెటింగ్‌ నిపుణులు, రైతులు, రైస్‌ మిల్లర్లు వ్యవసాయ, దాని అనుబంధ రంగాల ప్రముఖులతో కూలంకష చర్చల అనంతరం కేసీఆర్‌ రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో సమగ్ర వ్యవసాయ విధానానికి ప్రణాళికలు రూపొందించారు. రైతు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు దొరకాలనే సదాశయానికి తెలంగాణ రైతన్నల నుంచి విశేషమైన స్పందన లభించడం కేసీఆర్‌ మీద ఉన్న నమ్మకాన్ని తెలియచేస్తున్నది. గతంలో మాదిరిగా ఇష్టారీతిన పంటలు వేసి నష్టపోకుండా, మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలే వేసి, లాభాలు గడించే విధంగా చర్యలు తీసుకుంటున్నది.

సమగ్ర వ్యవసాయ విధానంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ చొప్పున, 2604 క్లస్టర్స్‌ను ఏర్పాటు చేసింది. ప్రతి క్లస్టర్‌కు ఒక ఏఈవోను నియమించింది. ఈ క్లస్టర్స్‌ అన్నింటిలో రైతు వేదికల నిర్మాణాలు మొదలయ్యాయి. రైతులతో సమావేశం జరపడానికి వేదిక ఉపయోగపడటమే గాక, అవసరమైనప్పుడు ఎరువులు, విత్తనాలు, పంట ఉత్పత్తులను నిల్వ చేసుకోడానికి కూడా ఇవి ఉపయోగపడనున్నాయి. రైతు బంధు సమితుల ద్వారా రైతులను సంఘటితం చేయడమే కాకుండా, వ్యవసాయ అనుబంధ రంగాల మధ్య సమన్వయానికి సాధిస్తున్నది. పంటల ధరలు నిర్ణయించడంలో కూడా ఈ రైతు బంధు సమితుల పాత్ర కీలకంగా మారనున్నది. రైతుకు సాగునీరు దగ్గరినుంచి విత్తనాలు, ఎరువులు, గిట్టుబాటు ధరలు అందించే దాకా రైతు బంధు సమితులు బాసటగా నిలుస్తాయి. కేసీఆర్‌ మానసపుత్రికలైన రైతుబంధు సమితులు, రైతు వేదికలు ఈ దేశంలో మరో వ్యవసాయ విప్లవానికి నాంది పలుకబోతున్నాయి. ఈ కృషి విజయం సాధించా లని కోరుకుందాం.

వ్యాసకర్త: శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి ఛైర్మన్‌

తెలంగాణలో గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా వ్యవసాయరంగం కుదేలైపోయింది. ఈ దుర్భర స్థితిని మార్చాలని సీఎం కేసీఆర్‌.. దేశమే ఔరా అనేలా ‘రైతుబంధు పథకం’ ప్రవేశపెట్టారు. సంక్షోభంలో ఉన్న రైతులకు పెట్టుబడి మద్దతు పథకం కింద ఒక్కో పంట సీజన్‌కు ఎకరాకు రూ. 5,000 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తున్నది. కేసిఆర్‌ సర్కారు కరోనా కల్లోలం, ఆర్థిక కష్టాలను కూడా కాదని 7,350 కోట్ల రూపాయలను రైతుబంధు సాయం విడుదల చేసింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.