Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

వ్యూహ రచనా దురంధరుడు

కేసీఆర్ మంచి వ్యూహకర్త. తెలంగాణ ఉద్యమం ఆసాంతం ఆయన వ్యూహ ప్రతివ్యూహాల సమాహారమే. 2001 నుంచి మొదలు పెట్టి 2014 తెలంగాణ బిల్లు ఆమోదం వరకూ ఈ 14 ఏళ్ల పాటు మహామహా నాయకులు, పార్టీలన్నీ ఆయన రచించిన వ్యూహాల్లో గిలగిలలాడినవే. ఆయన స్కేచ్‌గీస్తే ఇక అంతే సంగతులు ఈ మాటలు టీఆర్‌ఎస్ నేతలు కాదు.. టీఆర్‌ఎస్ పేరెత్తితేనే భగ్గున మండే పార్టీ నేతలు కూడా అంతరంగికంగా చెప్పుకునే మాట. ఐదొందలకు పైబడిన పార్లమెంటులో వేళ్ల మీద లెక్కించే ఎంపీలు కూడా లేకుండా…294 మంది కొలువయ్యే శాసనసభలో కేవలం 10 మంది ఎమ్మెల్యేలతోనే ప్రభుత్వాలకు నిద్రలేకుండా చేయడం ఆయన వ్యూహాల కారణంగానే సాధ్యమైంది.

– 14 ఏళ్లు మహామహులను విలవిలలాడించిన ఘనత – ఆయన మౌనమూ వ్యూహాత్మకమే.. – ఉద్యమాన్ని ప్రజల్లోకి చేర్చింది ఆ నైపుణ్యమేరాష్ట్ర విభజన జరగనే జరగరాదని అనేక మోహావేశ బంధనాలు, రాజ్యాంగ నిబంధనాలు, రాక్షస విధానాలతో కట్టుదిట్టం చేసుకున్న దుర్బేధ్యమైన సీమాంధ్ర దుర్మార్గాన్ని దెబ్బకు కుప్పగూల్చడం మాటలు కాదు. అయినా 14 సంవత్సరాల ప్రస్తానంలో కష్టనష్టాలు, శ్రమను, ఒత్తిళ్లను ఎదుర్కొన్న కేసీఆర్ ప్రతిసారి ఉద్యమాన్ని సజీవంగా నిలిపిఉంచడానికి, టీఆర్‌ఎస్ పార్టీని కాపాడడానికి ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకు సాగారు. అయిపోయింది అన్న ప్రతిసారీ రెట్టింపు వేగంతో పైకి లేవడం ఆయన వ్యూహరచన విశిష్టత. అందుకే కేసీఆర్ మాట్లాడినా మాట్లాడకున్నా కూడా ప్రత్యర్థులు కంపించిపోయే వారు. 2009 ఎన్నికల తరువాత దాదాపు నాలుగైదు నెలలు మౌనంగా ఉన్న కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష చేపట్టి 10 సీట్లే పనైపోయిందనుకున్న వారు దిమ్మదిరిగే స్థాయికి ఉద్యమాన్ని తెచ్చారు.

2001 నుండి 2014 వరకు కేసీఆర్ వేసిన ప్రతి అడుగూ తెలంగాణ రాష్ట్రసాధనే లక్ష్యంగా పడిందన్నది నిస్సందేహం. 2001లో పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అనూహ్య విజయాన్ని సాధించింది. తర్వాత ఎన్నికలతోనే తెలంగాణ అన్న వ్యూహ రచనలో భాగంగా మెదక్ ఉపఎన్నిక, నారాయణపేట మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను దింపి కాంగ్రెస్ అవకాశాలను దెబ్బ తీశారు. ఫలితంగా టీఆర్‌ఎస్ రంగంలో ఉంటే కాంగ్రెస్ మళ్లీ ఇంటికే అనే భావన వ్యాపింప చేశారు. 25 శాతం ఓట్లు సాధించి కాంగ్రెస్‌లో ఆశలు రేపారు. ఫలితమే కాంగ్రెస్ నాయకత్వమే స్నేహహస్తం అందించడం. 2004లోవచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక జాతీయ పార్టీ ఒక ఉప ప్రాంతీయ పార్టీ నాయకుడి ఇంటికి వచ్చి మీకెన్ని సీట్లు కావాలి అని అడిగే స్థితి కలిగించడం ఆయన వ్యూహరచనా చమత్కతి మాత్రమే.

kcr13

దీనికి 2004 ఎన్నికలకు ముందు మూడు సంవత్సరాల పాటు ప్రజల్లో ఉండి భారీ బహిరంగ సభలు నిర్వహించడం కూడా ఒక కారణమే. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 26 అసెంబ్లీ, 5 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించింది. ఆ తరువాత వైఎస్ ప్రభుత్వం ఏర్పడటం, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో 10 మంది కాంగ్రెస్‌కు అనుబంధంగా మారడంతో రెండు సంవత్సరాలు ఉద్యమంలో స్తబ్ధత వచ్చింది. ఢిల్లీలో రాజీనామా చేసి ఇంటికి వచ్చిన కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడలో కాంగ్రెస్‌ను రెచ్చగొట్టి సవాళ్లకు దింపారు. ఫలితంగా కాంగ్రెస్ నేత ఎం. సత్యనారాయణ రావు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసరడం, మరుక్షణమే కేసీఆర్ దాన్ని స్వీకరించి రాజీనామా ప్రకటించి కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేయడం జరిగింది. క్షేత్రస్థాయి నివేదికలు కేసీఆర్‌కు అనుకూలంగా లేవన్న ధైర్యంతో ఇది తెలంగాణకు రెఫరెండం అని వైఎస్ అహంకరిస్తే దాన్ని తాను స్వీకరించి తెలంగాణ సమాజం స్వీకరించేలా చేసింది కేసీఆర్ చతురతే. అప్పటికి 30 ఏళ్ల తన రాజకీయ జీవితం మొత్తం పణంగా ఒడ్డి అగ్నిపరీక్షకు సిద్ధమయ్యారు. ఫలితం మళ్లీ రెండు లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

2008లో ఉద్యమాన్ని మరోసారి తట్టిలేపేందుకు కేసీఆర్ తన వెంట ఉన్న 16 అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్ సభ్యులతో రాజీనామాలు చేయించారు. వీరిలో ఏడు అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలనే దక్కించుకుంది. అయినా 35 శాతం ఓట్లకు టీఆర్‌ఎస్ ఎదగడం విశ్లేషకులు కనుబొమ్మలెగరేసేలా చేశాయి. తిరిగి ఎన్నికలు వచ్చే ఆరు నెలల విరామంలో వైఎస్ పథకాల సుడిగాలిలో తెలంగాణ ఉద్యమ దీపం ఆరకుండా వేసిన కేసీఆర్ వేసిన ఎత్తుగడే ఇది.

KCR 001

పార్టీలు…. మారిన వైఖరులు కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడల ఫలితంగానే దాదాపు అన్ని పార్టీలు తెలంగాణకు జై కొట్టాయి. ఎపుడో కాకినాడలో చేసిన తీర్మానాన్ని అటకెక్కించిన బీజేపీ కూడా 2004 ఎన్నికల దెబ్బతో తిరిగి తెలంగాణ రాగం అందుకుంది. ఆ పార్టీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ తీర్మానం చేయించడంలో కేసీఆర్ విజయం సాధించారు. ఎన్నికల్లో ఓట్లు, సభలకు తరలివచ్చిన జనం చూపించి చివరకు టీడీపీ లాంటి పార్టీని కూడా ఊరించి ఊరించి తెలంగాణ తీర్మానం చేసుకునే పరిస్థితి కల్పించారు

ఉర్రూతలూగించిన మలిదశ వ్యూహాలు 2009 డిసెంబర్ ప్రకటన తరువాత సీమాంధ్రలోని అన్ని పార్టీలు వెనక్కి తరగడంతో వచ్చిన తెలంగాణ ఆగిపోయింది. దీంతో అన్ని రాజకీయ పార్టీలను ఒకే వేదికపైకి తెచ్చి కోదండరాం చైర్మన్‌గా అందులో అన్ని సంఘాలు, సంస్థలకు భాగస్వామ్యం కల్పించారు. మరోసారి టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేల్లో 16 మంది రాజీనామాలు చేశారు. ఈసారి వ్యూహం ఓట్ల వర్షం కురిపించింది. 90 వేలు, 80 వేల మెజార్టీ దక్కింది. టీడీపీ, కాంగ్రెస్‌లకు డిపాజిట్లు దక్కలేదు. ఈ ఒక్క వ్యూహం రాజకీయ రంగాన్ని పూర్తిగా మార్చేసింది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను దోషులుగా ఆయన ఎంత బలంగా నిలబెట్టారంటే ఆ పార్టీల నేతలు నెలల తరబడి గ్రామాలకు సైతం వెళ్లలేకపోయారు. దీనికి పరాకాష్ట కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామన్న ప్రతిపాదన. బ్రహ్మాస్త్రంలాంటి ఈ వ్యూహం కాంగ్రెస్‌ను చావుదెబ్బతీసింది. ప్రజలు ఆ నాయకులను తరిమికొట్టే స్థాయికి తెచ్చింది.

టీడీపీతో పొత్తు వెనక…. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణకు మద్దతిచ్చిన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టకుంది. ఇది వ్యూహాత్మకమే. కాంగ్రెస్‌తో జై తెలంగాణ అనిపించినందున ఇక రాజకీయ క్షేత్రంలో మిగిలిన టీడీపీతో అనిపిస్తే పార్లమెంటు తీర్మానానికి మార్గం సుగమం అవుతుందన్న ఎత్తుగడే టీడీపీ పొత్తు. వాస్తవానికి అన్నీ అనుకున్నట్టు జరిగితే శాసనసభలో చంద్రబాబుతో తెలంగాణ అనుకూల తీర్మానం చేయించే వారు. అయితే ఫలితాలు సహకరించలేదు. అయితే పొత్తులు బెడిసి కొట్టడం, చంద్రబాబు టీఆర్‌ఎస్‌కు ఇచ్చిన స్థానాల్లో అభ్యర్థులను నిలపడం, టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఇచ్చిన స్థానాలు బలమైనవి కాకపోవడానికి తోడు రంగంలో కొత్తగా వచ్చిన ప్రజారాజ్యం దెబ్బకొట్టింది. టీఆర్‌ఎస్ పార్టీ కేవలం 10 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఇంటాబయట విమర్శలు రావడంతో కొంతకాలం మౌనం వహించారు. సెప్టెంబర్ వరకు మౌనం వహించిన కేసీఆర్ ఒక్కసారిగా దెబ్బతిన్న బెబ్బులిలా మారారు. తెలంగాణ ఎట్ల రాదో చూస్తానంటూ తన ప్రాణాలను పణంగాపెట్టి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కేసీఆర్ చచ్చుడో… తెలంగాణ వచ్చుడో అన్న నినాదం ఎత్తుకుని దీక్షకు దిగారు. అదే సమయంలోకేసీఆర్ నిరాహార దీక్ష చేసిన 11రోజుల పాటు తెలంగాణ యావత్తూ కేసీఆర్‌కు మద్దతుగా నిలిచింది. ఆ తరువాత కేంద్రం తెలంగాణ ఇచ్చేందుకు ముందుకు రావడం, డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పడంతో కేసీఆర్ దీక్షకు ఫలితం లభించినైట్లెంది. ఈ 8 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం ఆఖరి అంకానికిచేరుకోవడంతో కేసీఆర్ దీక్ష విరమించారు.

ఉద్యమానికి ముందు… 1969లో ఉవ్వెత్తున ఎగిసిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చల్లారిన తరువాత వివిధ సందర్భాల్లో మళ్లీ ప్రత్యేక రాష్ట్రం వాదనలు వినిపించినప్పటికీ అవన్నీ పుబ్బలో పుట్టి మఖలో మాయమైన చందంగా అవి జనంలోకి చొచ్చుకెళ్ల లేకపోయాయి. వాస్తవానికి పదవులు, ప్రయోజనాలు ఆశిస్తున్న రాజకీయ నిరుద్యోగులు ఆశ్రయించే చివరి గమ్యంగా వేర్పాటు రాష్ట్ర ఉద్యమం మారిపోయిందనే అప్రతిష్ట వచ్చింది. ఈ స్థితిలో 1999 ఎన్నికల తర్వాత ఎదురైన అనుభవాలనుంచి కేసీఆర్‌కు టీడీపీ పార్టీకి ఎడమొహం, పెడమోహం పరిస్థితి వచ్చింది.

kcr9

ఈ నేపథ్యంలోనే ఆయన తెలంగాణ వెనకబాటుతనంపై దష్టి సారించారు. ఏ విషయానైనా పూర్తిగా అధ్యయనం చేసే ఆయన సహజసిద్ధమైన ప్రవత్తి తెలంగాణ లోతుపాతులసమగ్ర అధ్యయనానికి తావిచ్చింది. తర్వాత కాలంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కినా తెలంగాణ ఉద్యమం మీద కలిగిన ఆసక్తిని ఆ పదవి నివారించలేకపోయింది. ఈ క్రమంలో మేధావులతో సంప్రదింపులు, అసమానతలను వెల్లడించే గణాంక వివరాల సేకరణ మొదలైన పనుల్లో కేసీఆర్ నిమగ్నమయ్యారు. మహనీయుడు జయశంకర్ పాఠాలు కేసీఆర్‌లో ఉద్యమ కారుడిని నిద్ర లేపాయి. అనేక వందల గంటల చర్చోప చర్చలు ఉద్యమ ప్రస్తానంపై మీమాంసలు అన్నీ సమగ్రంగా చర్చించిన అనంతరం ఉద్యమానికి రూపకల్పన జరిగింది. పార్టీని, పదవులను పరిత్యజించి తెలంగాణ రాష్ట్ర సమితికి కేసీఆర్ శ్రీకారం చుట్టి గులాబీ జెండా ఎగురవేశారు. టీఆర్‌ఎస్ ఆవిర్భవించిన ఇరవై రోజులకే కరీంనగర్ పట్టణంలో 2001 మే 17న తెలంగాణ సింహగర్జన పేరిట నిర్వహించిన భారీ బహిరంగసభకు తెలంగాణ జిల్లాల నుంచి లక్షలాది మంది తరలిరావడంతో టీఆర్‌ఎస్ ప్రభావం రుజువైంది. అప్పటి వరకు టీఆర్‌ఎస్ ఉనికిని దాదాపు పట్టించుకోని రాజకీయ పక్షాలు సింహగర్జనకు లభించిన ప్రజాస్పందన చూసి విస్మయానికి లోనయ్యాయి. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్ పుట్టి వందరోజులు తిరగకుండానే జరిగిన స్థానిక పోరులో రెండు జడ్‌పీ చైర్మన్ పదవులతో సహా పదుల్లో జడ్పీటీసీ, వందల్లో ఎంపీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్ సొంతం చేసుకుంది. అనంతరం తెలంగాణ జైత్రయాత్ర పేరిట వివిధ జిల్లాల్లో కేసీఆర్ పర్యటించి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేశారు.

తొలిదశ ఆందోళనలు చేనేత కార్మికుల కోసం భిక్షాటన 22-05-2002 జలసాధన కార్యక్రమం 06-01-2003 ఢిల్లీకి వెయ్యి కార్లతో ర్యాలీ 27-03-2003 అలంపూర్‌నుంచి గద్వాలకు పాదయాత్ర 25-05-2003 కోదాడ నుంచి హాలియాకు పాదయాత్ర 30-08-2003 విద్యుత్ కోతకు నిరసనగా రాస్తారోకోలు 11-11-2005 విద్యార్థులకు శిక్షణా కార్యక్రమాలు 11-08-2007 టు 09-10-2007KCR24

సిద్దిపేట ముద్దుబిడ్డ సిద్ధిపేట: కేసీఆర్ అన్న మూడు అక్షరాలే ఒక సంచలనం… తెలంగాణ ఉద్యమాన్ని ఎవరూ ఊహించని రీతిలో ముందుకు నడిపి గమ్యాన్ని ముద్దాడిన ధీరోదాత్తుడు. ఎత్తుపల్లాలెన్ని ఎదురైనా, ఎవరెన్ని కుతంత్రాలు పన్నినా లక్ష్యంపైనే గురిపెట్టి పోరాటాల బాటలో అంచెలంచెలుగా ఎదిగి ప్రత్యేక రాష్ట్రమనే తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన పెట్టిన ఘనుడు. స్పష్టమైన లక్ష్యంతో గమ్యాన్ని ముద్దాడిన గులాబీ దళాధిపతి కేసీఆర్ ఉద్యమాల పురిటిగడ్డ సిద్దిపేట ముద్దుబిడ్డ. సిద్దిపేటతో ఆయనది విడదీయలేని సంబంధం. సిద్దిపేట మండలంలోని ఓ మారుమూల గ్రామమైన చింతమడకలో 17 ఫిబ్రవరి 1954వ సంవత్సరంలో కల్వకుంట్ల వెంకటమ్మ, రాఘవరావు దంపతులకు కేసీఆర్ జన్మించారు.

kcr-parents

– 1978లో మాజీ మంత్రి అనంతుల మదన్‌మోహన్ శిష్యుడిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. – 1979 నాటికే ఢిల్లీ చేరి ఇందిరాగాంధీ రెండవ తనయుడు సంజయ్‌గాంధీకి సన్నిహితుడిగా పేరుతెచ్చుకున్నారు. – 1983లో ఎన్‌టి రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కేసీఆర్ చేరారు. అదే సంవత్సరం జరిగిన ఎన్నికల్లో మదన్‌మోహన్ చేతిలో 877 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. – రెండేళ్లు తిరగకుండానే 1985లో మళ్లీ వచ్చిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగానే ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి సిద్దిపేటలో ఆయన ఓటమి చూడలేదు. అదేకాదు ఎక్కడ ఏ ఎన్నికల్లో పోటీకి దిగినా ఓటమి అనేదే లేదు. – 1985, 1989, 1994, 1999, 2001 (ఉ.ఎ), 2004 సంవత్సరాల్లో సిద్దిపేట అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వరుసగా ఆరుసార్లు విజయం సాధించి డబుల్ హ్యాట్రిక్ సాధించారు. సిద్దిపేటను తన రాజకీయ, ఉద్యమ ప్రస్థానానికి కంచుకోటగా మార్చుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో సిద్దిపేటకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించారు. – తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి, పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పదవులకు రాజీనామా చేసి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపారు.

2001, ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)ను స్థాపిచిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోరాటాల బాటలో అంచెలంచెలుగా ఎదిగి నేడు ఈ స్థాయికి చేరుకుంటారని గులాబీ జెండా ఎగిరిన తొలిరోజుల్లో ఆయనతో సహా మరెవ్వరూ ఊహించి ఉండరు.

జలదశ్యం: టీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ 27-04-2001 కరీంనగర్: సింహ గర్జన 17-05-2001 పరేడ్ గ్రౌండ్: తెలంగాణ గర్జన 06-01-2003 వరంగల్ జైత్రయాత్ర: 15 లక్షల మందితో దేవెగౌడ, అజిత్‌సింగ్ హాజరు 27-04-2003 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగూరు సింహ గర్జన, పాలమూరు గర్జన, ఓరుగల్లు వీరగర్జన, కరీంనగర కదనభేరి 19-11-2003 16-12-2003 పరేడ్ గ్రౌండ్: భారీ బహిరంగ సభ. యూపీఏ మిత్రులు అజిత్‌సింగ్, ముఫ్తి మహబూబా, డాక్టర్ రాందాస్, కష్ణన్ ఎండీఎంకే తదితరులు హాజరు. వరంగల్: ప్రజా గర్జన శరద్‌పవార్ హాజరు 17-07-2005 సిద్దిపేట: సమరశంఖారావం 08-10-2006 నిజాం కాలేజి: విద్యార్థి గర్జన 29-12-2008 సిద్దిపేట: ఉద్యోగ గర్జన 21-10-2009 వరంగల్: మహా గర్జన 16-12-2010

కేసీఆర్ వ్యక్తిగత వివరాలు

Kcr-profile పేరు : కల్వకుంట్ల చంద్రశేఖరరావు సన్నిహితులు పిలిచే పేరు : కేసీఆర్, శేఖరన్న తల్లిదండ్రులు : దివంగతులు కె కె.రాఘవరావు. కుటుంబం : భార్య కె.శోభ, కొడుకు రామారావు (కేటీఆర్), కూతురు కవిత. స్వగ్రామం : చింతమడక (సిద్దిపేట మండలం) పుట్టిన తేది : 17 ఫిబ్రవరి, 1954 వివాహం : 23 ఏప్రిల్, 1969. చదువు : బీ.ఏ (తెలుగు సాహిత్యం), (ఎం,ఏ) రాజకీయ చరిత్ర : 1985లో మొదటిసారిగా సిద్దిపేట నుంచి అసెంబ్లీకి ఎన్నిక. 1985, 1989, 1994, 1999, 2001 (ఉ.ఎ) వరుస విజయాలు. 1985లో డిప్యూటీ మంత్రి హోదాలో కరువు పనుల ప్రత్యేక ప్రతినిధిగా.. 1997లో టీడీపీ ప్రభుత్వంలో రవాణా మంత్రి. 2000 సంవత్సరంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్. 2001, ఏప్రిల్ 21న ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పదవులకు, టీడీపీకి రాజీనామా. 2001, ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) స్థాపన. 2004 ఎన్నికల్లో మొదటిసారిగా కరీంనగర్ లోకసభ నుంచి విజయం. మన్మోహన్ ప్రభుత్వంలో కార్మికశాఖ మంత్రి. ఇష్టమైన ఆట : చదరంగం ఇష్టమైన వంటకం : పాలకూర పప్పు

Please click on the image to view full size

KCR Biography
MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.