Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

వరంగల్‌లో ఇస్పాత్ నిగమ్

రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) యూనిట్‌ను వరంగల్‌లో ప్రారంభించడానికి కేంద్ర ఉక్కుశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అంగీకరించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కేంద్రమంత్రి సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. తెలంగాణలో ఖనిజాల వెలికితీతకు అవకాశాలున్న గనుల వివరాలతో కూడిన జియాలజీ, మినరల్ రిసోర్సెస్ ఆఫ్ తెలంగాణ అనే పుస్తకాన్ని ఈ సందర్భంగా కేంద్రమంత్రి ఆవిష్కరించారు.

KCR met with Narendra singh thomar

-కేంద్ర మంత్రి తోమర్ అంగీకారం -జియాలజీ, మినరల్ రిసోర్సెస్ ఆఫ్ తెలంగాణ పుస్తక ఆవిష్కరణ -బయ్యారంపై అధ్యయనాన్ని త్వరగా పూర్తి చేయండి -కేంద్ర మంత్రిని కోరిన సీఎం కేసీఆర్ -త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాధికారుల సమావేశం మొదటి ప్రతిని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలలో ఉన్న గనులద్వారా అపారమైన ఖనిజ సంపదను వెలికితీసి, జాతి అభివృద్ధికి ఉపయోగించే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో ఉన్న గనులు, ఖనిజాల లభ్యతపై మాట్లాడారు. బొగ్గు నిల్వలను వెలికితీసే విషయాన్ని సీఎం కేసీఆర్ కేంద్రమంత్రికి వివరించారు. బయ్యారం గనులలో ఐరన్ ఓర్ నిల్వలపై తలపెట్టిన అధ్యయనం త్వరగా పూర్తి చేయాలని సీఎం కోరారు.

తెలంగాణలో ఉన్న ఖనిజ సంపద ఎంత? ఎక్కడెక్కడ గనులు ప్రారంభించవచ్చు? అనే అంశంపై త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు భేటీ కావాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, పరిశ్రమలశాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, ఎన్‌ఎండీసీ సీఎండీ నరేంద్ర కొఠారి, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ సీఎండీ మధుసూధన్, ఉక్కుశాఖ జాయింట్ సెక్రటరీ ఊర్విలా ఖాతి పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.